విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-28

0
4

[ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి చిత్రాలను విశ్లేషిస్తూ వేదాల గీతాచార్య అందిస్తున్న సీరిస్]

తుదికి మొదలు

ప్రేమ – త్యాగం.

[dropcap]T[/dropcap]hese are mutually exclusive, and unfortunately people take them as mutually inclusive. To understand we need to have a fairly deep understanding of Objectivism (which is getting beyond the scope of this series, which already overstayed its welcome 😉).

బాలకృష్ణ భాగవతార్ నిజానికి తనను తానే కరిగించేసుకన్నాడు. దానికి ప్రధాన కారణం self-pity which muffled his self-conceit. చిన్నతనంలో అనుభవించిన పరిస్థితులను బట్టీ, ఆ సమయంలో అనుభవించిన ట్రామా మొదలైనవి ఆత్మన్యూనతకు దారితీస్తాయి. ఆ ఆత్మన్యూనత పెరిగితే మనుషుల్లో కాస్త self-pity వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది.

అలాగే తక్కువ ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులు తమను తాము జాలిపడే అవకాశం ఉంది. ఎందుకంటే వారు తమ గురించి, తమ సామార్థ్యాలపై ప్రతికూల దృక్పథాన్ని కలిగి ఉంటారు, దీనివల్ల ప్రతికూల ఆలోచనలు ఎక్కువై భావోద్వేగాలను అధోముఖం పట్టించి మరింత హాని చేస్తుంది. వారు తమ జీవితంలోని ప్రతికూల అంశాలపై ఎక్కువ దృష్టి సారిస్తారు. అందుకే వాటినాకర్షిస్తారు. అలాగే సమస్యలను భూతద్దంలో పెట్టి చూస్తారు. ఇక జరుగదు. ఏ రకమైన సానుకూలత ఉండదు. ఇలా సాగుతాయి ఇలాంటి వారి ఆలోచనలు.

దీన్ని మనం బాలకృష్ణ భాగవతార్ విషయంలో బాగా గమనించవచ్చు. మొహమాటం, దూసుకుపోయే తత్వం లేకపోవటం, ఎదుటివారిని తన పర్సనాలిటీతో అదుపులో ఉంచి పనులు చేయించుకోగలగటం (భంగిమా) తెలియకపోవటం, lack of ego (don’t confuse with vanity). వీటివల్ల అతను తన స్థాయి, ప్రతిభలకు తగిన ఫలితాన్ని జీవితంలో పొందలేక పోయాడు.

సరే! ఆయన సంగతి పక్కన పెడితే.. ఢిల్లీలో జరిగే ప్రోగ్రామ్‌కు శైలజ కూడా రావచ్చు అని విన్నాను.

అనంతరామ శర్మ గారు నా కోరికను మన్నించి నాతో రావటానికి, and his acceptance to travel with me to attain the redemption – వీటివల్ల నేనొకరకమైన ఉద్విగ్నతకు లోనౌతున్నాను.

మీనాక్షి, చంద్రశేఖర్‌లు – వారి కథ ఏమైందో మనకు సినిమా ద్వారా తెలుసు. స్వర్ణ కమలం.

కానీ, ఆ తరువాత ఏమైందన్నది ఎవరి ఊహలు వారికి ఉన్నా, నిజజీవితంలో జరిగేది వేరుగానే ఉంటుంది.

There’s nothing like happily ever after. And more of it.. if we observe, in lesser number of cases there’s also nothing like unhappily ever after. అలా ఉంటే అది జీవితం కాదు కదా.

మనిషి జీవితమే దుఃఖంతో మొదలౌతుంది.

నా మానాన నేనేదో తల్లి గర్భంలో తేలుతూ ఉంటే అనవసరంగా ఈ లోకంలోకి తెచ్చి పడేశారు. ఆటోమేటిగ్గా నా బొజ్జలోకి వచ్చి చేరే ఆహారం ఇప్పుడు నేను వెతుక్కుని తీసుకోవాలి అని గర్భం నుంచీ బైటకు రాగానే దుఃఖపడతాడు మానవుడు. అలాగే అనంతుడైన ఆ పరమాత్మ నుండీ ఆత్మగా వేరుపడి, ఆ ఆత్మ ఒక శరీరాన్ని తీసుకుని ఈ జన్మ ఎత్తటమే దుఃఖమంటారు. ఆ దుఃఖంలో ఒక విరామం లాటింది సంతోషం.

ఆ సంతోషాన్ని పొందటం వల్లనే మనం శాశ్వతమైన ఆనందానికి దూరమౌతున్నామని తెలుసుకోలేము.

Anyway, మీనాక్షికి తిరిగి అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది. చెప్పాను కదా.. anything is possible in a benevolent universe అని ఐన్ అమ్మమ్మ తన షార్ట్ స్టోరీ గుడ్ కాపీ లో రాసిందని.

అలా benevolent universe లో lighthearted జీవితం గురించి తీసిన స్వర్ణ కమలం సినిమా.. ఇక అందులో అవకాశాలు అందకపోవటం ఉండదు.

అందెను నాడే (ఏ రోజైతే మీనాక్షి తన సామర్థ్యాన్ని తెలుసుకుని, నాట్యం తన జీవితమని అర్థం చేసుకున్నాక ఇక ఆమెకు అవకాశాలు వేరొకరు ఇవ్వాల్సిన పని లేదు)

ఆకాశంలో ఆశల హరివిల్లు – through Periyalwar like Chandrasekhar.

హరివిల్లు – పెరియాళ్వార్.

ఆశ్చర్యకరమైన coincidence or K. Vishwanath made things happen like that? Whatever is the case, ఇది మాత్రం almighty creativity and hidden detail.

మీనాక్షి నాట్యానికి ప్రపంచం హారతులద్దింది. ఇక్కడ గంగాధరం ప్రభ వెలగబోయి ముగిసిపోయే కాలానికి మీనాక్షి నాట్యానికి మారు పేరుగా నిలిచింది. శైలజకు పోటీగా. ఇద్దరి వల్లా ప్రపంచంలో మన దేశ కీర్తి పతాకం రెపరెపలాడింది. ఇద్దరి ఫిలాసఫీలు వేరు. ఇద్దరి జీవిత గమనాలు వేరు. అయినా ఇద్దరూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు తమ రంగంలో.

ఇటువైపు చందు కూడా తనదైన శైలిలో తన కళను విస్తరించుకుని కొంతమేర పేరు పొందాడు.

ఇంకొక్కరు మిగిలిపోయారు.

ఎవరు?

The conclusion Starts!

(కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here