ఒంటరితనం

0
3

[మాయా ఏంజిలో రచించిన ‘Alone’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]

(రెండవ ప్రపంచయుద్ధం తరువాత వియత్నాం యుద్ధం అమెరికన్స్‌ని విడదీసినప్పుడు మాయా ఈ కవిత రాసినట్టుగా చెప్పబడుతుంది. ‘Where water is not thirsty’ అన్న వాక్యం బైబిల్ నుంచి తీసుకోబడినట్టు తెలుస్తుంది. తాను ఏర్పాటు చేసిన బావిలోని నీరు తాగినవారికి దాహమనేది ఉండదని జీసస్ యే చెప్పినారట. అటువంటి నీటికే దాహం వెయ్యడమనేది అత్యంత ఒంటరితనానికి ప్రతీకగా కవయిత్రి వాడినట్టుగా అర్థం చేసుకోవాలి.)

~

[dropcap]నా[/dropcap] హృదయానికో ఆసరా
దొరుకుతుందేమోనని
నిన్నటి రాత్రివేళ
పడుకొని యోచిస్తూ ఉన్నా..
ఎక్కడైతే నీటికే దాహం వేస్తుందో
రొట్టెముక్క తినే వీలు లేక
రాయి వలె గట్టిపడి ఉంటుందో
అక్కడ నేనొంటరినే

నేనో నిశ్చయానికి వచ్చాను
నేనది తప్పనీ అనుకోవడంలేదు
ఎవరు కూడా
ఎవ్వరు కూడా..
నా ఒంటరితనానికి తోడు అవలేరని..

ఒంటరితనం.. అందరూ ఒంటరులే
అంతటా ఒంటరితనమే
ఎవ్వరు కూడా
ఈ ఒంటరితనానికి ఆసరానివ్వలేరు..

తమ ధనాన్ని తాము ఉపయోగించుకోలేని
ఎందరో కోటీశ్వరులు
ప్రేతాత్మల్లా వారి చుట్టూ
తిరిగే వారి భార్యలు
దిగులు నీలిగీతాలు పాడే వారి పిల్లలు
వాళ్ళ శిలాహృదయాలకు
చికిత్సనందించేందుకు
చుట్టూ ఖరీదైన వైద్యబృందం
వీరెవ్వరు కూడా
ఒక స్నేహహస్తపు ఆసరా లేకుండా
ఈ ప్రపంచంలో బతకలేరు
నువు జాగ్రత్తగా వింటానంటే
నాకు తెలిసిందొకటి నీకు చెబుతా

తుఫాను మేఘాలు గుమిగూడినట్టు
బలమైన గాలులు వీస్తున్నాయి
మానవజాతి అనేక బాధల్లో ఉంది
పరిగెడుతూ పరిగెడుతూ నిలబడ్డ మనిషి
వేదనాభరితమైన మూలుగు
నాకిప్పుడు వినబడుతుంది

చెబుతున్నా
ఒంటరిగా ఎవరూ
ఈ ప్రపంచంలో బతకలేరని!!

~

మూలం: మాయా ఏంజిలో

అనువాదం: హిమజ


1951 లో మాయా Tosh Angelos అనే గ్రీకు electrician ని వివాహం చేసుకుంది. తన తల్లి అసమ్మతిని లెక్క చెయ్యకుండా, ఎంతో మంది ఖండనలను పరిగణనలోకి తీసుకోకుండా అతన్ని వర్ణాంతర వివాహం చేసుకుంది మాయా. Tosh Angelos పూర్వ నావికుడు కూడా. సంగీతకారుని గానూ రాణించాలన్న తపన ఉన్నవాడు.

వివాహం తరువాత మాయా modern dance క్లాసులు తీసుకునేది. ఆ క్రమంలో ఎందరో డాన్సర్స్‌ని, కొరియోగ్రాఫర్స్‌ని కలుస్తుండేది. Alvin Ailey అనే కొరియోగ్రాఫర్,  మాయా కలిసి ఒక బృందంగా ఏర్పడ్డారు. Al and Rita ( మాయా అసలు పేరు) అన్న పేరుతో Fraternal Black Organizations లో San Francisco అంతటా modern dance తరగతులు నిర్వహించారు గానీ అవి అంతగా విజయవంతం అవలేదు.

1954లో మాయా వివాహం విఫలమై ముగిసిపోవడంతో ఆమె నాట్యాన్ని సీరియస్‌గా తీసుకొని San Francisco లోని రాత్రిక్లబ్బుల్లో నర్తించడం మొదలుపెట్టింది. ‘The Purple Onion’ లోను తాను ఇదివరలో నర్తించిన ‘Calypso Music’ క్లబ్బులలో అధికంగా డాన్స్ చేసేది. అప్పటివరకు మాయా తన అసలు పేరయిన Marguerite Johnson లేదా Rita గాను వ్యవహరింపబడింది. ఆమె వ్యవహారాలు చూసుకునే మేనేజర్, క్లబ్ మద్దతుదారులు ఇచ్చిన బలమైన సలహాతో తన వృత్తిపరమైన పేరు- ‘మాయా ఏంజిలో’గా మార్చుకుంది. చిన్ననాడు తన అన్న ముద్దుగా పిలిచే మాయా పేరుకి పూర్వ వివాహంతో ఏర్పడిన ఇంటిపేరు ఏంజిలో ను కలిపి ‘మాయా ఏంజిలో’గా మారింది. Calypso లో మాయా ఇచ్చే ప్రదర్శనలకు ఆ పేరు ఒక Distinctive name గా, unique గా సులభంగా గుర్తుంచుకునేలా సరిపోయింది.

1954, 55 లలో యూరోప్‌లో విస్తృతంగా నాట్య ప్రదర్శనలిచ్చింది మాయా. ఏ దేశానికి వెళ్తే ఆ దేశ భాష నేర్చుకోవడం ఆరంభించింది. ఏ ప్రాంతం వెళ్తే అక్కడి ఆచార వ్యవహారాలను ఒంటబట్టించుకునేది. అక్కడి ప్రజలతో సులభంగా కలసిపోయేందుకు అది ఎంతో ఉపకరించింది. కొద్ది సంవత్సరాల్లోనే పలు భాషల్లో ప్రావీణ్యం సంపాదించింది మాయా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here