[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘రైతే రాజు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]మే[/dropcap]ఘావృతమైన ఆకాశం
చిరుజల్లులతో
పుడమికి అభిషేకం చేస్తున్న
శుభసమయాలు
రైతన్నల నయనాలలో ఆనందబాష్పాలు
సరికొత్త ఉత్సాహాన్ని గుండెలనిండా నింపుకుని
వ్యవసాయం ప్రారంభించే శుభఘడియలు
రైతన్నల సంతోషాల సంబరాల నడుమ
పొలాలలో కదిలే అరకలు,
వరి నాట్ల కోలాహలాలు,
పండే పసిడి పంటలు రైతును రాజుగా చేస్తుంటే..
దేశానికి ఆహారాన్ని అందిస్తూ..
అతడు చేసే కృషి వెలకట్టలేనిది!
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకై నిలిచే
అతడిని మనం సదా ప్రశంసించవలసిందే!