[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘తెల్లని మెలుకువ కప్పుకుని’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]మ[/dropcap]నిషి మనిషిలో నల్లని స్పర్శకు
తప్పుకు తిరుగుతూ
ముఖం చిట్లి
చూపు పీలికలు కాకుండా
నాలుకపై ఎగుడు దిగుడు శబ్దంతో
అర్థం ముక్కలు కాకుండా
అసూయ తాపానికి
పగ రాజుకోకుండా
కలను కూర్చే
కోరికల అడుగు మెలిక పడకుండా
తెల్లని మెలుకువ కప్పుకుని
తనకు తాను గుచ్చుకోకుండా
మెత్తని మచ్చికతో
మనసు మెల్లగా నడవాలి.