[శ్రీమతి నారుమంచి వాణీ ప్రభాకరి రచించిన ‘చిత్రలేఖ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]సూ[/dropcap]ర్యోదయానికి ముందే వెంకట రమణమ్మ పూలు కోయడానికి మేడ పైకి వెడుతోంది. అప్పటికే మనుమరాలు చిత్రలేఖ పెయింటింగ్ మొదలు పెట్టింది. మిద్దె తోటలో హైబ్రీడ్ మొక్కలు బోన్సాయ్ మొక్కలు లిల్లీ రంగులు పూస్తాయి. వాటితో పాటు గులాబీ మల్లె లిల్లీలు ఉంటాయి. కింద దొడ్లో మందార, గన్నేరు, కరి వేప, రామ బాణం పువ్వుల గుత్తులు రంగురంగులలో విర బూసి ఉంటాయి. అవి పాలేరు కోసి ఇస్తాడు. పెద్ద మొక్కలు మనుమరాలు అభిరుచికి తగ్గట్లు నర్సరీ నుంచి హైబ్రీడ్ మొక్కలు తెచ్చి పెట్టెల్లో తొట్టిలో పెంచుతున్నారు.
“మనకి నేల ఉన్నది పెరడులో చాలు” అంటే, “కాదు నేను పైన మిద్దె మొక్కలు పూల మొక్కలు పెంచుతాను” అన్నది.
‘సరే, అది చిత్రకారిణి, ఆహ్లాదకరమైన వాతావరణం అనుకూలంగా ఉండాలి, అప్పుడే బాగా చిత్రాలు వేస్తుంది’ అనుకుంటూ మనమరాలి ప్రజ్ఞకు పట్టం కట్టారు. కొందరు విమర్శించారు. అది సహజమే కదా. ప్రశంస ప్రక్కన విమర్శ కూడా.
సూర్యోదయ శుభ వేళ అందమైన ఆకాశం రంగు రంగు మబ్బులతో నిండి ఆనందాన్ని ఆహ్లాదాన్ని అందిస్తూ ఉంటుంది. చిత్రలేఖ ఆ అందాల్ని చూస్తూ అందంగా బోర్డ్ పై చిత్రాలు వేస్తోంది. కాన్వాస్ అద్భుతంగా తయారు అయ్యింది. ఉదయమే మేడ పైకి వచ్చి ఇలా చిత్రాలు వేస్తుంది. దీనివల్ల నిదానం, స్థిర చిత్తం వస్తుంది. ఇది ఒక రంగుల యోగం. అందరికీ రాదు.
కింద నుంచి చిత్ర లేఖను అమ్మమ్మ పిలుస్తోంది.
“రావే టిఫిన్ రెడీ అయింది. నీకు ఉదయం రంగులు ఉంటే చాలు ఆహారం అక్కరలేదు” అంటూ సూక్తి ముక్తావళి మొదలు పెడుతుంది. ఇది తాత ఇంటి గారం కదా. అమ్మా వాళ్ళ ఇంట్లో కుదరదు. బామ్మకి అమ్మని సాధించడానికే సమయం చాలదు, ఇంక మనుమరాలి కళలకి విలువ లేదు. అందుకే ఇక్కడ కాలేజీలో డిగ్రీ చదువుతోంది చిత్రలేఖ. నచ్చిన కళలో సాధన చేస్తోంది.
పుట్టుకతోనే కొన్ని విద్యలు వస్తాయి. పలక పై బొమ్మలు వేయడం, గోడలపై బొమ్మలు వేయడం, ఆసక్తి చూసి రంగు పెన్సిల్ తెచ్చి ఇచ్చారు. క్రేయన్స్, ఇతర రకాల రంగుల పెట్టెలు బ్రష్‌లు తెచ్చి ఇచ్చారు. అలా ఇంప్రూవ్ చేసుకున్నది. హై స్కూల్ నుంచి కొందరు పిల్లలు డ్రాయింగ్ మాస్టారు దగ్గర ప్రత్యేక క్లాసులు నేర్చుకోవడం చూసి చిత్రలేఖ కూడా వెళ్లి నేర్చుకున్నది.
అక్కడ ఆబ్జెక్ట్ డ్రాయింగ్ నేర్పారు. ఒక ప్రక్క బొమ్మ వేసి ఇచ్చి రెండో ప్రక్క పూరించాలి అనేవారు. అలా అన్ని నేర్చుకున్నది. విద్యార్థుల చేత డ్రాయింగ్ వేయించి ఎగ్జిబిషన్ పెట్టి, అందులో బహుమతులు గెలుచుకునే అవకాశం ఉందని విద్యార్థులను ప్రోత్సాహించేవారు. అలా చాలామందికి నేర్పి ఆసక్తి పెంచేవారు డ్రాయింగ్ మాస్టారు.
చిత్రలేఖనం కూడా ఒక యోగ విద్య. ప్రకటన బోర్డ్‌లు, నేమ్ ప్లేట్స్, బ్యానర్స్, వెడ్డింగ్ కార్డ్‌లు, గ్రీటింగ్ కార్డ్స్ చక్కగా చిత్రాలు వేసి వాటిని ప్రింట్ వేసే బిజినెస్ అబ్బాయిలు చెయ్యవచ్చును. ఇప్పుడు అంతా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినా డిజైన్ రూపుదిద్దకుని స్పీడ్‌గా వేల కొలది ఐటమ్స్ చెయ్యడానికి అవకాశాలు మిషన్ ద్వారా వచ్చాయి. గతంలో ఇంత ప్రాచుర్యం లేదు. ఇప్పుడు అంతా ఎక్కువ మంది ఈ తరహా పబ్లిసిటీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. మగ పిల్లలు అయితే ఎలాగైనా బిజినెస్ చెయ్యగలరు. అదే ఆడపిల్లలు అయితే ఇంట్లో వాళ్ళు అంగీకరించాలి.
ఇప్పుడు చిత్రలేఖ విభిన్న పరిసరాలు చూసి చిత్రలేఖనం చేస్తే బాగుంటుంది అని ఆశ పడింది కానీ ఇప్పుడు కంప్యూటర్‌లో ఎన్ని వేల డిజైన్స్, సీనరీలు కూడా ఎంతో బాగా సేకరించి దాచి ఉంచారు. ఇంకా ఇంటర్లో బై.పి.సి. చదువు వల్ల మరి కొంత ఇంప్రూవ్ అయ్యింది. అందులో మొక్కలు, జంతువులు, పక్షులు, సీనరీలు కొంత వెయ్యడం వచ్చాయి. ఇలా చదువుతో పాటు చిత్రలేఖనంలో కూడా సాధన చేసి ఎంతో బాగా బొమ్మలు వెయ్యడం అలవర్చుకున్నది. దానికి ఇంట్లో వాళ్ళు కూడా కావల్సిన వస్తువులు రంగులు కొని ఇచ్చి ఆసక్తి కనబరిచారు.
అలా కొంత వృద్ధి చేసింది. ఓ వంద డ్రాయింగ్ షీట్స్ కొని చిత్రాలు వేసి భావ కవితలు రాసింది. అలా కొంత సాహిత్యం కూడా అలవాటు చేసుకున్నది. వాటిని కాలేజీ ఫంక్షన్స్‌లో ‘వన్ ఊమెన్ ఆర్ట్ షో’గా ఏర్పాటు చేసి కాలేజీ అధ్యాపకులు కూడా ప్రశంసించారు. ఆమెలో ఉన్న స్థిర చిత్తం, కళా కృషిని, సాధన ప్రజ్ఞను బాగా పొగిడి కాలేజీలో చదువుకుంటు ఇంత బాగా ఎదిగినందుకు ఎడ్యుకేషన్ డైరెక్టర్ వచ్చినప్పుడు ఈ ఆర్ట్ షో ఏర్పాటు చేసి ఆయన ద్వారా ప్రారంభించి ఆమెకు మంచి ప్రశంసా పత్రం, మెమెంటో ఇప్పించారు. కాలేజీలో వుండగానే ఇంత ప్రతిభ కనపరచిన ఆమెను ఆకాశం లోకి ఏత్తేసి, పిజి కోర్స్ కూడా చేసి మంచి ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందాలి అని చెప్పారు
ఆ మీటింగ్ కి వచ్చిన ఇంటి వారు కూడా ఎంతో ఆనందించారు.
కానీ ఆ చదువు వేరే ఊరిలో, హాస్టల్‌లో జాయిన్ చేసి చదివించాలి. అందుకు పెద్ద వాళ్ళు అమ్మమ్మ తాత వప్పుకోరు.
చిత్రలేఖది పుట్టుకతో వచ్చిన కళ. అరవిరిసిన అందం. ఎంతో బాగుంటుంది. ఆమె బొమ్మలు కూడా ఆమె లాగానే అందంగా ఉంటాయి. ముఖ్యంగా బొమ్మలు అన్ని భారతీయ సంస్కృతి సంప్రదాయాల కొలువుగా ఉండి ప్రముఖుల చిత్రాలతో పోటీ పడతాయి. స్వతహగా నెమ్మదస్థురాలు. దానికి తోడు, ఎంతో బాగా చిత్రాలు వెయ్యడంలో సిద్ధహస్తురాలు. మాటలు సున్నితంగా ఉంటాయి, తక్కువ మాట్లాడుతుంది.
చిన్నప్పుడు ఒకసారి ఒక పెద్ద ఆర్టిస్ట్ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వ్యక్తి వారి ఇంటికి తాతగారు దగ్గరకి ఒక మీటింగ్‌కి వచ్చినప్పుడు కలిశారు. ఆయన్ని తాతగారు ఇంటికి టీకి ఆహ్వానించి మనవరాలి చిత్రలేఖనం చూపి దీవించమన్నారు. ఆయన ఏమి తింటారు అని ముందే అడిగితే కళాకారులకి పులుపు ఇష్టం ఉంటుంది, మామిడికాయ పులిహోర చెయ్యమన్నారు. కళాకారులకి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ కళాకారులు శుక్ర గ్రహం వల్లే ఉన్నతి పొందుతారు అని చెప్పారు. ఆ రోజు వాళ్ళింటికి ఆయన రావడంతో చిత్రలేఖ తాను వేసిన చిత్రాలను చూపించింది.
చిన్నప్పటి నుంచి గీసిన చిత్రాలు ఒక ఫైల్‌లో పెట్టి దాచుకుంది, కొన్ని చిత్రాలు గోడలకి ఉంటాయి. ఒక విధంగా బాల్యం నుంచి పలకపై చిత్రాలు పట్టక నేలపై సుద్దలతో వేసేది. అది చూసి రంగు పెన్సళ్ళు కొని ఇస్తే గోడలపై ఎన్నో చిత్రాలు గ్రామీణ జీవితసరళి విన్యాసాలు భాగాలుగా చిత్రించింది. చిన్నప్పుడు బాలమిత్ర, చందమామలో చిత్రాలు కూడా చూసి వేసేది అని ఇంట్లో వాళ్ళు చెపితే ఆయన ఆనందపడి మెచ్చుకున్నారు.
ఆయనకి ఎవరు ఉత్తరం రాసినా ఆ ఉత్తరంపై బొమ్మ వేసి సమాధానం ఇచ్చేవారు. అలా ఆయన హిమాలయ శిఖరాలు కూడా చూసే అక్కడి అందాలను తన కాన్వాస్‍పై చిత్రించారు, ప్రభుత్వం నుంచి డాక్టరేట్ మొదలు అత్యంత ఘనంగా ఎన్నో రకాల పురస్కారాలు, ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డ్స్ పొందారు.
“మీరు మా మనుమరాలికి సూచనలు సలహాలు ఇవ్వండి” అని అంటే ఆయన నవ్వి “ఆమెకు ఆమే సాటి. ఎటువంటి సూచనలు అవసరం లేదు. స్వయం ప్రతిభ కలధి. దీనికి చదువుతో పని లేదు. అయినా ఆమె గొప్ప విద్యావంతురాలు అవుతుంది. చిత్రలేఖనానికి ఆ తరహ విద్య కాదు, ప్రపంచం, ప్రకృతి పరిశీలన అవసరం” అని చెప్పారు.
అలా విద్యకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేస్తూ చిత్రలేఖనంలో విలువలు వృద్ధి చేసింది. డిగ్రీ తరువాత పీజీ సైన్స్ కాకుండా, పెయింటింగ్‌లో చెయ్యలి అనుకున్నది. కానీ వేరే ఊళ్ళో హాస్టల్‌లో ఉండాలి. అందుకు ఇంట్లో వప్పుకోలేదు. బి.ఎమ్.ఎస్. చేస్తే కానీ ఎమ్.ఎస్.లో సీటు ఇవ్వరు. ఒక డిగ్రీ ఎలాగూ ఉన్నది, మళ్లీ బిఎమ్‌ఎస్ అనవసరం అన్నారు. కాని బ్యాచిలర్ ఆఫ్ అప్లయిడ్ ఆర్ట్స్ చేస్తే మంచిదే, డబుల్ డిగ్రీ పిజి ఉంటాయి కానీ ఈ సృజనాత్మక విద్యకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేస్తూ చిత్రాలు చిత్రంచాలి. దీనికి డిగ్రీలు కాక సాధన, శోధన ఎక్కువ ఉండాలి. అప్పుడే ఈ విధ్య రాణిస్తుంది అని పెద్దలు అంటారు. ఇది సత్యమే కదా.
ఈ విద్యలో కొన్ని చరిత్రలు ఉంటాయి కానీ అవి బిజినెస్ పరంగా కాక కేవలం జ్ఞాన అభివృద్ధికి మాత్రమే. క్యుబిజం, సర్రిలిజం, రియాలిటి, ఫాంటసీ వంటి పేర్లతో చిత్రాలు ఉంటాయి. ఆ టెక్నాలజీ అందులో చెపుతారు కానీ ప్రాక్టికల్ వర్క్ వేరు అంటూ ఈ విద్య అంశాలు చర్చించారు.
ఆడపిల్ల జీవితంలో ఎదగాలి అంటే చాలా మంది ఒప్పుకోవాలి. బంధువుల విమర్శలు వేధింపులు ఉంటాయి. అవన్నీ ఎలా మార్చుకోవాలి అన్నది చాలా కష్టం. అదే మగ పిల్లాడు అయితే ప్రయోజకుడు కావాలి అంటూ బాగా చదివించండి, విదేశాలకు పంపండి, మీకు పిల్లల్ని గొప్పగా చెయ్యాలని లేదా అంటూ విమర్శలు చేస్తారు. అదే ఆడపిల్లల్ని అయితే ఎంత చదివినా ఆకాశంలో విహరింప చేస్తున్నారు, పెళ్లి చెయ్యరా అంటారు. పెళ్లి చేస్తే అక్కడ వేరే ప్రపంచం ఉంటుంది. పెళ్లికి ముందు డాన్స్ కూడా కావాలి. మా కోడలు అద్భుతంగా డాన్స్ చేస్తుంది అంటారు. పెళ్లి తరువాత – “ఏమిటి మా ఇంటా వంటా లేని వేషాలు? మా అల్లుళ్ళు ఒప్పుకోరు. నా కూతురి అత్తగారు పెళ్ళిలో అడిగింది, పెళ్లి తరువాత నీ కోడలు గిన్నెలు చెంబులు పళ్ళాలు గరిటెలు, చెంచాలతో డాన్స్‌లో అవధానం చేసి గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతుందా ఏమిటి, వదినను చూసి ‘రేపు మా కోడళ్ళు అన్ని నేర్పించు అంటారేమో నా కొడుకుల్ని’ అంటూ వెటకారం చేస్తే కష్టమండి అంటూ కోడళ్ళ ముందే విమర్శలు చేస్తారు అంటూ అత్తగారు అసహనం ఈర్ష్య, ద్వేషం చూపుతారు” అంటూ ఇంటివాళ్ళు కన్నవాళ్ళు ఆడపిల్ల జీవితాన్ని బోన్సాయ్‌గా మార్చేస్తారు. సంకుచితమైన ఎన్నో భావాలు చూపుతారు. ఇదండీ ఆడపిల్ల విద్య విజ్ఞానము.
ఏదో ఇష్టంతో నేర్చుకున్నది కానీ ఉద్యోగాలు, ఊళ్ళు, బిజినెస్‌లు – ప్రత్యేక శ్రద్ధ ఉంది కదా అంటూ ఇంట్లో అమ్మకాలు, నేర్పడానికి కుదరదు అంటూ స్ట్రిక్ట్‌గా చెప్పారు అందరూ. ఇంక కన్నవారే ఇలా అంటే అత్తవారు ఒప్పుకుంటారా చెప్పండి? అత్తారింట్లో వాళ్ళు కూర్చుని నువ్వు తెచ్చే డబ్బుతో జల్సా చేస్తారు. అటువంటి పరిస్థితులు వద్దు, అటు వంట ఇటు ఉద్యోగం చేస్తున్నా సరే అన్నిటా సమస్యలు కదా చెప్పండి. మీరు కూడా ఒప్పుకుంటున్న అంశాలు ఉన్నాయి.
పెద్దవాళ్ళు కలుగ చేసుకోకపోతే పిల్లల జీవితంలో ఎదుగుదల ఎప్పటికీ లేదు. అదీకాక కొన్ని కుటుంబాలు మాత్రమే ఆడదాని ఉన్నతి కోరుతాయి.
చిత్రలేఖ స్నేహితురాలు ధీర జర్నలిజం కోర్స్ చేసింది. వెంటనే ఒక పేపర్లో సబ్ ఎడిటర్‌గా జాయిన్ అయ్యింది. మళ్లీ అక్కడి అనుభవంతో రేడియో ప్రసంగాలు ఇంటర్వ్యూలు రాస్తూ అటు రేడియోలో పార్ట్ టైమ్ వర్క్ చేస్తూ ఉండేది. అక్కడికి వచ్చే ప్రముఖులు టివి ద్వారా ఇంకా మంచిది అనే అభిప్రాయం వ్యక్తీకరించుట వల్ల డీడీ 8, సప్తగిరి ఛానెల్ ద్వారా కొన్ని ఇంటర్య్వూలు చేసేది. ఆదే టైమ్‌లో తల్లి తండ్రి సంబంధాలు చూశారు. అయితే మీడియాలో పని అనగానే కొందరు వెనక్కి వెళ్లారు. ఆ విషయం అందరికి తెలిసిందే. అయితే కొందరు ఇష్టపడతారు. సృజనాత్మకత అందరికీ రాదు కదా. అందుకని ఒక ఛానెల్‌లో పనిచేసే వ్యక్తి “నేను చేసుకుంటాను. మీకు ఇష్టముంటే మీకు కూడా నేను మా ఛానెల్ లో జాబ్ వేయిస్తా. నాకు మీ టేలెంట్ బాగా తెలుసు” అన్నాడు. “నా పేరెంట్స్‌కు చెప్పి మీకు చెపుతాను” అన్నది. “అలాగే మా ఇంట్లో చెపుతాను. మా ఇంట్లో మహా చాదస్తం. అదీకాక ఇంట్లో పెళ్లి కాని అక్క ఉన్నది. ముందు ఆమె పర్మిషన్ కావాలి” అన్నాడు. సరే అన్నది.
ధీర ఆలోచనలో పడింది. ఓకే అని ఉరుకున్నది.
ధీర అక్క ఒక ఫోటో స్టూడియో నడుపుతోంది. తండ్రి పేరున్న ఫోటోగ్రాఫర్. భర్త దుబాయ్‌లో ఉన్నాడు. పెళ్లి తరువాత కొన్నాళ్ళు దుబాయ్‌లో ఉండి పిల్లలు చదువుకి రాగానే ఇండియా వచ్చింది. అయితే అప్పటికే తండ్రికి వృద్దాప్యం వచ్చింది. సరే భర్తతో ఆలోచించి తను ఒక పెద్ద ఫోటో ప్రింట్ లాబ్ పెట్టింది. పెళ్లి నాటికే డిజిటల్ ఎఫెక్ట్ వర్క్ కొంత వచ్చు. దాన్ని ఇప్పుడు వృద్ధి చేసుకుంది.
ఫోటో డిజిటల్ స్టూడియో. శ్రీ వేంకట సాయి డిజిటల్ స్టూడియో పెట్టింది. కౌంటర్లో తను కానీ తండ్రి కాని కూర్చుంటారు. దగ్గరలో పల్లెల నుంచి ఫోటోగ్రాఫర్‌లు వచ్చి ఇక్కడ పెళ్లి ఆల్బమ్స్ డిజిటల్‌గా చేస్తారు. బేనర్‌లు, విజిటింగ్ కార్డ్, ఫ్లెక్సీలు, ఫోటో లామిబేషన్‌లు, సన్మాన పత్రాలు ఒకటేమిటి రక రకాల పనులు. వెడ్డింగ్ కార్డ్స్ అన్నీ చేస్తారు. అలా వర్కర్స్‌ను పెట్టి బిజినెస్ చేస్తోంది.
పిల్లను డాక్టర్, పిల్లాడిని ఇంజినీర్ చదివించింది, మళ్లీ సినీ డైరెక్టర్ కోర్స్ చేయిస్తోంది. అంతా మీడియా వైపు ఎదగాలని ఆకాంక్ష. అయితే అక్కను అడిగితే మంచిదే నీ ఇష్టం అంటుంది. చిత్రతో సంప్రదించింది.
“చిత్రకి ఏమి తెలుసు” అంటూ వాళ్ళ అమ్మమ్మ అందుకుంది.
“మా చిత్రకి పెళ్లి విషయాలు అంతా బాగా తెలియవు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఆడపిల్ల పుట్టిందని కొన్నాళ్ళు వాళ్ళ అమ్మని వేధించే వాడు. అందుకని దీన్ని ఇక్కడే ఉంచి పెంచాను. మగ పిల్లాడిని గారంగా చూస్తాడు. దీనికి చదువు వద్దు, టెన్త్ కాగానే పెళ్లి చెయ్యాలని పట్టు బట్టాడు. కానీ నేనే ఒప్పుకొక నా దగ్గర ఉంచి చదివిస్తున్న సంగతి మీకు తెలియదు. ఆడపిల్లగా పుట్టిన మా చిత్రలేఖ నాకు నాలుగో కూతురు అనుకున్నాను. మా పెద్ద పిల్ల భర్త మిలటరీ ఆఫీసర్. అతను పెద్ద పిల్లను ఇక్కడే ఉంచి వస్తూ పోతూ ఉంటాడు. దానికి ఒక కొడుకు. వాడితో పాటు దీన్ని చదివించారు. దానికి ఆడపిల్ల అంటే ఇష్టమే కానీ ఎప్పుడైతే చెల్లెలు జీవితం ఇలా తారుమారు అయిందో అది దీన్ని కూతురుగా పెంచింది. అందుకే నా దగ్గర దాని దగ్గర చనువు. తల్లి తండ్రి అతిథులు. అయినా వాళ్ళ నాన్న ఆడవాళ్ళకి చదువులు ఉద్యోగాలు ఎందుకు,? గరిటె తిప్పడానికి డిగ్రీలు కావాలా? అంటాడు. అతనో శాడిస్ట్. మన టివి సీరియల్స్‌లో ఆడదాని పాత్రలు మాదిరి మా ఇంట్లో అన్ని సమస్యలు ఏదో చదువుకొన్నది. చిత్రాలు బాగా వేస్తోంది. ఇప్పుడు శారీ పెయింటింగ్ కోర్స్ కూడా చేస్తోంది. అన్ని కరెస్పాండెన్స్ కోర్స్‌లు గుమ్మం ముందుకు వచ్చి అన్ని యూనివర్సిటీ కోర్సులు ఉన్నాయి కదా, అవి చుదువుకుంటుంది చాలు” అన్నది.
కొన్ని కుటుంబాలలో ప్రపంచం ఎంతమారినా వారి జీవిత శైలి ప్రత్యేకం. కుటుంబ వ్యవస్థకే అంకితము. చిత్రలేఖ లాంటి అమ్మాయిలు ఇప్పటికీ ఎందరో ఉన్నారు. అయితే శాంతంగా సహనంగా జీవితం వెళ్లిపోతే, అనందం పొందడానికి చిత్రాలు చాలు అనుకున్నది చిత్రలేఖ.
2
చిత్రలేఖ అతి గొప్ప వ్యక్తిగా జీవితంలో ఎదగాలి అనే పద్ధతిలో ఎంతో తపన పడేది. కానీ పెద్దవాళ్ళు ఇంట్లో ఇష్టత చూపేవారు కాదు. ఆడపిల్ల అనే చిన్న చూపు ఉన్నది. తన స్నేహితులు ధీర, శౌరి, సృజన, రమ్య, విరజ ఎంతో బాగా మీడియాలో కృషి చేస్తున్నారు. విదేశాలలో పేరు సంపాదించారు.
చిత్రలేఖ స్నేహితులు శౌరి, లలిత ధీర, స్వప్న వీరంతా మీడియా రంగంలో కోర్స్‌లు చేసి ఛానెల్స్‌లో పని చేస్తున్నారు. ఇప్పటి తరం మారింది. కుటుంబాలలో ఆడపిల్లలు స్వతంత్రంగా బ్రతకడం ప్రారంభించి, సమాజానికి కొంత మేలు చేసే రీతిలో ఎదుగుతున్నారు. నేటి పిల్లలు ఇలా ఎదగడం ఎంతో గర్వకారణం అని తల్లి, తండ్రి, కుటుంబ సభ్యులు ప్రోత్సాహించాలి.
కానీ చిత్రలేఖ కుటుంబంలో తండ్రి వల్ల అన్ని సమస్యలు వస్తున్నాయి. అతనిది పల్లెటూరి మనస్తత్వం. ఆడవాళ్ళను హింసిస్తూ, ఎదుగుదల ఉండకూడదు, వంటింటికే పరిమితం. అదే మీకు మాకు హితం అంటాడు. బయటికి వెళ్ళిన ఆడపిల్ల ఇంటికి వచ్చేదాకా అంతా భయమే. ఎంత డబ్బు ఉన్నా సమస్యలపై అవగాహన అవసరం. అది లేని కుటుంబాలలో ఇలాగే ఆడపిల్లకి ఆంక్షలు పెడతారు. కానీ చిత్రలేఖ స్నేహితుల ఉన్నతి చూసి ఆనందపడింది కానీ ఈర్ష్య పడలేదు. వారు అంతా మంచి వాళ్ళు. చిత్రలేఖ మంచి చిత్రకారణి. ఆమెను కూడా ఎంతో పెంచాలని ఆశ. వారంతా ధైర్యంగా ఉద్యోగాలు చేస్తున్నారు. విదేశాలలో కూడా కొంతమంది వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ మన చిత్రలేఖ తల్లి పరిస్థితులు తండ్రి వేదింపులు వల్ల – తండ్రితో భాధ పదుతున్న కుటుంబ సభ్యులు ఎంతో అవేదనకు గురి అవుతూ పెద్దలు చెప్పినట్లు నడుచుకుంటూ ఉండిపోయింది. అయినా తన కళను వదలలేదు. యోగా లాంటి రంగుల కళ అద్భుత విద్య. అదే రాణిస్తుంది అన్న దృఢ సంకల్పంతో సంతోషంగా జీవిస్తోంది. మంచి రోజులు వస్తాయనే ఆశ.
3
ఈ సమాజంలో తల్లితండ్రులు పిల్లల జీవితానికి బాధ్యులు. వారు ఎంత ఎదగాలి అన్నది వారి అభిరుచికి సరిపడా కృషికి సహకరిస్తేనే జీవితము. చిత్రలేఖ టెన్త్ నుంచి బంధువులు స్నేహితులు సంబంధాలు చెప్పారు. తండ్రి మీకు సహకరించడు కనుక మా పిల్లాడికి చేసుకుంటే మేము అందర్నీ చూస్తాము అన్నారు.
ఎవరు అందరూ? అప్పని చూస్తే చాలు అన్నారు. అదే ఈ రోజు భార్యకి అన్నం పెట్టే వాళ్ళు లేరు. నీ ఉద్యోగం నీది, నీ సంపాదనతో తిను అనేవారు ఎందరో ఉన్నారు. అమ్మమ్మ బంధువులు. నాన్న తరుపు బంధువులు ఇంచుమించు అంతా ఒకటే. అమ్మకి నాన్న దూరపు మేనమామ వరుస అవుతారు. కనుక బంధువులకు నాన్న చరిత్ర తెలుసు అన్నారు. కానీ ఎవరూ ముందుకు వచ్చి కట్నం లేకుండా పెళ్లి చేసుకోరు.
అలాగని చదువుకోవడం కుదరదు, కళలు కూడు గుడ్డ పెట్టవు, డబ్బు దండుగ విద్యలు అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చి అసంతృప్తిగా మాట్లాడుతారు. అది వాళ్ళకి ఎంతో ఆనందం.
చిత్రలేఖ తండ్రిని సంబంధాలు చూడమంటే – “అబ్బే డాక్టర్స్ పేషంట్స్ బిజీ. ఇంజనీర్స్ వర్క్ బిజీ. టీచర్స్ అయితే ట్రాన్స్‌ఫర్స్ బిజీ. లెక్చరర్స్ అయితే కాలేజీలో సదా గొడవలు, గందర గోళం కదా” అంటూ తప్పించుకొనేవాడు.
అందరికీ వంకలు పెట్టీ ఊరు కొనేవాడు. “పిల్ల ఎదిగి డిగ్రీ పుచ్చుకుని ఉన్నది పెళ్లి చెయ్యరా” అంటే ఇదీ వరుస. అయిన సంబంధాలకు వంకలు పెడుతూ పిల్ల అత్తకి మామ్మకి పిఎలా ఉండాలి, అంతే కాని బొమ్మలు మీటింగ్‌లు అంటే కుదరదు. ఇది ఏమైనా డబ్బు సంపాదన రంగమా అంటూ విమర్శ చేసేవారు.
అలా దగ్గర సంబంధాలు వంటింటి సేవ మాత్రమే మాకు ఇష్టం అంటూ కట్నం కోసం ఆశపడి బయటి సంబంధాలు చేసుకున్నారు. విధి రాత పుట్టినప్పుడు ఎలా ఉంటే అలా జరుగుతుంది. మావి మంచి మనసులు మంచిగా జరుగుతుంది కాబట్టి మనం ఆలోచించి పిల్లని ఆందోళన పెట్టవద్దు అంటూ ధైర్యాన్ని ఇచ్చారు.
4
సూర్యోదయ శుభవేళ కళాకారులకి చాలా ఆనందం ఎంతో సంతృప్తి ఉంటుంది. మనిషి ప్రకృతి ఒడిలో చంటి బిడ్డ. ఆరోగ్యంగా ఆనందంగా ఉండే పాఠాలు అన్ని ప్రకృతి మాత ఒడి నుంచే వస్తాయి. అవి పద్ధతిగా నేర్చుకుని
జీవిత సాగరాన్ని మథించి ఉన్నతంగా ఎదగాలి. శౌరి బాగా తెలివైన పిల్ల. నలుగురు అక్క చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. నలుగురు తరువాత పుట్టిన పిల్లాడు. నట్టింట అంతా బంగారం. అక్కలు అందరూ ప్రేమగా చూస్తారు. ఈ రోజుల్లో ఇంత మంది పిల్లలా అనకునేరు, కాని వాళ్ళకి ఎంతో డబ్బు ఉన్నది. అది టాక్స్ కట్టే కన్నా పిల్లల్ని ఎక్కువ మందిని కని పెంచితే సీలింగ్‍లో పోదు అనే భావన ఉన్నది. నా పిల్లలు తింటారు అనే భావన కలుగుతుంది
సరే శౌరీ తండ్రి శాస్త్రి గారి స్నేహితుడు యాభై ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. అందర్నీ చదివించే పెళ్ళిళ్ళు చేశాడు.
అయతే ఆయనకి కొడుకుల సంపాదన, ఆయన సంపాదన కూడా కోట్లు దాటిపోయింది. దానితో ఇద్దరు అనాథ పిల్లలు మగ ఆడ తెచ్చుకుని పెంచడం మొదలు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు డిగ్రీలు అయ్యి పెళ్లీడుకు వచ్చారు. ఇద్దరు కూడా కొన్ని మెడికల్ కోర్సులు చదివారు. వాటికి మంచి డిమాండ్ ఉన్నది. కొన్ని అనాథ సంస్థలకి డొనేషన్ కూడా ఇస్తాడు.
పిల్లలని మనం పెంచుకుంటే ఆ ప్రేమ వేరుగా ఉంటుంది. అందుకని శౌరీ తండ్రి సొంత పిల్లలు ఉంటే మంచిది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా ప్రతిదీ ఋణం ఉంటే కానీ లభ్యం కాదు వాళ్ళు పెట్టి పుట్టారు. ఇండియాలో డబ్బు కూడా విదేశాలకే పంపుకున్నారు. బ్యాంకులు నిండే సొమ్ము. ఒక ఫ్యాక్టరీ పెట్టవచ్చును కాని ఈ వయసులో అనవసరం. పోనీ స్నేహితులు ఇద్దరు సంబంధాలు కలుపుకుందా మా అంటే వయసులలో బాగా భేదం వచ్చింది.
ప్రేమిస్తే సరి కానీ ఇవి పెద్దల నిర్ణయాలు తీసుకుని చేసే పెళ్లి ఏదో నాలుగేళ్ల తేడా పర్వాలేదు. మరీ బొత్తిగా పది ఏళ్ళు తేడా ఉన్నాయి. పెంచుకున్న పిల్లలు మరీ చిన్నవాళ్ళు. మనిషి పుట్టే ముందు విధి రాత ఉంటుంది. అది ఎలా ఉంటే అలా జరిగి ముందు జివితముంటుంది. వద్దు అంటే కుదరదు.
మిగిలిన పిల్లలు ఇద్దరు డాక్టర్స్, ఒకరు ఇంజినీర్, కొడుకు ఎమ్.బి.ఎ చదివాడు. ధీర నాలుగవ పిల్ల.
జర్నలిజం ఇష్టంతో చేసింది. ఛానల్స్ వైపు వెళ్ళాలి అన్నది ఆమె అభిలాష. దానికి కొంత అనుభవం ఉండాలి. అందుకే ముందు ప్రింట్ మీడియాకి వచ్చింది. ఆ సమయంలో ఎంతో అనుభవాలు పొంది ఎలక్ట్రానిక్ మీడియాకి రావాలని కోరిక ఉన్నది.
ఆడపిల్లలు నేడు ఈ రంగంలో ఎక్కువ మంది ఉంటున్నారు. కేవలం యాంకర్స్, న్యూస్ రీడర్స్, యాక్టర్స్, ఈవెంట్స్ మానేజర్స్, ఎడిటర్స్ ఇవి కాక మేకప్ కళాకారులు. వస్త్ర కళాకారులు, సెట్టింగ్ అలంకరణలో ఇలా ఒకటేమిటి అన్నీ కూడా వీరే ఉంటున్నారు.
వంట వార్పు తగ్గి కర్రీ పాయింట్స్, క్యాటరింగ్ వంటలు, రెస్టారెంట్స్, హోటల్స్ ఎక్కువ అవడంతో వండి పెట్టడం మానేసి కొని తినడం అలవాటు చేసుకున్నారు. అలా తినలేక పోతే బ్రతకడం కష్టం అంటున్నారు. ధీర చెప్పింది ఒకసారి:
“మాకు తెలిసిన కుటుంబం వాళ్ళు భోజనానికి పిలిచి రమ్మన్నారు. సరే అంటూ ఆరుగురు కార్లలో వెళ్ళాలి కదా అంతా రెడీ అయి రెండు కార్లలో వెళ్లాము. పన్నెండు గంటలు అయింది. ఇంట్లో ఎక్కడ వంట జాడ లేదు. ఘుమ ఘుమ లేదు. అంద్రా వంటకాలు అంటే ఇంగువ పోపు వాసన రావాలి. ఏమి లేదు, సిటీ జీవితం కదా. ఆయనో పెద్ద ఆఫీసర్, దూరపు బంధువు. అయితే స్నేహం ఎక్కువ. వెళ్ళడం తప్పలేదు. ఆయన కార్లో వచ్చి ఆ ఆ అంతా వచ్చారా బావున్నరా అంటూ క్షేమ సమాచారం అడిగి ఆయన జ్యూస్ తెచ్చారు, అందరికీ పోసి ఇచ్చారు.
ఆవిడ గెస్ట్‍౬లా నిల్చుంది. నాకు కావాల్సిన వారు నేనే ఇస్తాను అంటూ అందరికీ ఇచ్చారు. ఆ తరువాత పిచ్చాపాటి మాట్లాడారు. ఒక ఫోన్ వచ్చింది వెంటనే రండి అని. అందర్నీ బయటకు వెళ్లి తినడం మంచిది, ఇల్లు సరిపోదు అంటూ ఒక ఫంక్షన్ హల్ బుక్ చేసి ఇంకా ఐదుగురు కుటుంబాలు పిలిచి అందరికీ పరిచయం చేసి భోజనాలు ఏర్పాటు చేశారు. ఏమిటి ఇంత హడావిడి? ఏదో కూర చారు చాలు కదరా అని నాన్న అంటే కాదు కాదు చాలా కాలానికి కలిసాము ఇక్కడి వారికి నిన్ను చూపించాలి అని ఇలా ఏర్పాటు చేశాను అన్నారు.
చపాతీ కావాల్సిన వారు అది తినండి. లేదా రెండు కూడా తినవచ్చును అన్నారు. సిటీలో డబ్బు ఉండాలి, ఖర్చు పెట్టే గుణం ఉండాలి, అన్ని అందుబాటులో ఉంటాయి. ఆప్యాయత ఆదరణ ముఖ్యం. కొందరు మగవాళ్ళు అయినా అన్ని పద్ధతిగా చేస్తారు. అయితే వాళ్ళ అవిడ ఇంట్లో వంట వండదు. ఆయనే ఏదో తంటాలు పడి చేస్తారు. కూరలు ఆర్డరు పై ఇంటికి వస్తాయి. ఇదొక రకం తెలివి. ఆమెకు ఆయన ఫ్రెండ్స్ వస్తే ఇంకా అసలే ఇష్టం ఉండదు. ఒకసారి అన్నగారి భార్య విదేశాల నుంచి వచ్చింది. ఆమెకి హోటల్ నుంచి టిఫిన్ తెప్పించి పెట్టమని చెప్పింది. ఇంటిల్లి పాదికి ఆమె చెల్లెలు తమ్ముడికి కూడా మైసూర్ బజ్జీ ఇడ్లీ తెప్పించి పెట్టింది. ఇంకా భోజనం అంటే హోటల్‌లో టేబుల్ బుక్ చేశారు. ఇక్కడ ఒక మంచి గుణం ఆమె వండక పోయినా భర్త హోటల్‌లో బుక్ చేస్తే ఏమి అనదు, ఊరుకుంటుంది. ధనవంతుల బిడ్డ అనే గర్వం కట్నం బాగా ఇచ్చింది. ఉద్యోగంలో ప్రమోషన్ ఇప్పించి ఇల్లు కొని అన్ని మామగారే ఇచ్చారు. పిల్లల్ని హాస్టల్‌లో పెట్టారు. ఇంకా ఏమి పని? అంతా టివితో ఎంతో టిప్ టాప్. మిఠాయి జీవితము.”
~
చిత్రలేఖ అమ్మమ్మ ఆలోచనలు సాగుతున్నాయి. ఏవేవో సంఘటనలు జ్ఞాపకం వస్తున్నాయావిడకి
ఆకాశంలో ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. వంటలు వండి వార్చే వారి సంఖ్య తగ్గింది. సిలిండర్ ధర పెరిగింది. కూరలు అలాగే ఉన్నాయి. ఇంకా వేసవిలో కరెంట్ యూనిట్ పెరిగి ఎలక్ట్రికల్ కుక్కర్, ఇండక్షన్ స్టవ్‌కి కూడా ధర పెరిగింది. మళ్లీ ఆ గిన్నెలు మూకుడు గరిటెలు పాత్రలు అన్ని కొత్తవి కొనాలి. ఈ బాధలు ఎందుకు, హాయిగా కొని రుచి చూస్తే పోలా. రోజుకో హోటల్‌లో కొత్త వంటకాలు తినవచ్చును ఇది కొందరు అనే వేదవాక్కు అని చెప్పాలి.
పొరుగింటి వంట ఎప్పుడు ఆనందమే. పుల్ల కూర రుచి ఎంతో బాగుంటుంది. అది పొరుగు ఇల్లు అయితేనే మన ఇంట కాదు కదా మరి. వంటకి కుక్కర్ చాలదు. కొందరు బద్దకం వాళ్ళు ఉంటారు, మేము కూర పంపుతాను వండి మీరు కొంత తీసుకుని ఇవ్వండి అంటారు. అవతలి వాళ్ళకి ఓపిక ఉండవద్దా? ఈ మధ్య ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఇంట్లో మా ఆడవాళ్ళు సరిగా చెయ్యలేరు. మా పిల్లలు ఇద్దరు ఉద్యోగాలు. మేము మా చెట్టు మామిడికాయలు పంపుతాను. సరుకులు పంపుతాను. ఆవకాయ పెట్టివ్వమని ఒకళ్ళని అడిగారు.
అప్పుడు ఆమె “అయ్యో అన్నయ్య గారు. వదిన గారిని ఎంత ప్రేమగా అలవకుండా చూస్తున్నటున్నారు. ఈ రోజుల్లో మీలాంటి వారు ఉండరు. కానీ మా పిల్లులకి, భర్తకి తెలిస్తే మా ఇంట్లో గందరగోళం అవుతుంది. మీరు మనిషిని పెట్టుకుని పెట్టించికొందురు. నేను తగిన పాళ్ళు రాసి ఇస్తాను, డబ్బు ఉన్నది కదా ఇంటి కాయలు పెట్టుకుంటే బావుంటాయి” అని చెప్పింది.
ఎవరు కూడా ఈ విధంగానూ వంట పని ఇష్టపడి చెయ్యరు, ఇది సత్యమే కదా మరి. ఇదే నేటి తరం మాట బాట కూడా.
అంతా కూడా స్వతంత్ర భావాలు, ఎదగాలి అనే భావన తప్ప మంచి చెడు ఏమి లేవు.
4
ధీర ఓ శీర్షిక కోసం ఆర్టికల్ రూపొందించాలి. దానికి సంబంధించిన కాన్సెప్ట్ మీద పని చేస్తోంది.
ఈ మధ్య మహిళామణులు వంటని ఎందుకు ప్రక్కన పెట్టారు అనే కాన్సెప్ట్‌తో ఒక ఫీచర్ నిర్వహించింది ధీర. దానికి కొందరు తమ అభిప్రాయాలు ఈ విధంగా పంపారు:
ఒకావిడ భర్త విద్యాశాఖలో ఆఫీసర్. ఆ విషయం దృష్టిలో పెట్టుకుని ఆవిడ టీచర్స్‌కి ఫోన్ చేసి నాకు బాగా లేదు, పిల్లలకి నాకు క్యారేజ్ పంపండి అని చెప్పింది. సరేనని రెండు మూడు రోజులు పంపారు. ఆయన క్యాంప్‍కి వెళ్లి అక్కడ తింటాడు. అలా డబ్బు ఖర్చు లేకుండా భర్త వెళ్ళాక ఆవిడ కాలం గడిపేస్తుంది.
ఒక సారి ఒక మీటింగ్‌లో ఒక సంఘసేవకురాలితో పరిచయం చేసుకున్నది. ఆ తరువాత ‘మీ ఇంటికి వస్తాను’ అన్నది. ‘సరే రండీ’ అన్నది.
‘అయితే మీరు నాకు మంచి టిఫిన్ చెయ్యాలి’ అన్నది. ‘అలాగే రండి’ అంటే ‘మీరు పులిహోర, దద్దోజనం, లడ్డూలు, చక్కెర్పొంగలి వంటివి చెయ్యాలి. ఏదో ఉప్మాతో సరిపెట్టకూడదు’ అన్నది.
‘అలాగే రండి. శనివారం ఎలాగ రెండవ శనివారము కదా. మా ఇంట్లో ఇలవేల్పు శ్రీ వేంకటేశ్వర స్వామికి పులిహోర చేసి నైవేద్యం పెడుతూ ఉంటాము. బ్రేక్‌ఫాస్ట్‌గా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటూ ఉంటారు. ఇలా బంధువులు వస్తే అప్పుడప్పుడు నైవేద్యం పెట్టి పులిహోర తింటారు, మీరు రండి’ అని చెప్పింది. ‘అది కాక పులిహోర చల్లారినా బాగుంటుంది’ అని అంది.
అలాగే అన్న మనిషి ఉదయం లేదు, మధ్యాహ్నం లేదు, సాయంత్రం ఆరు అయినా రాలేదు. అప్పుడు ఫోన్ చేస్తే ‘అలాగా, చేశారా మా పిల్ల’ అంటూ ఏదో కుంటిసాకు కబుర్లు చెప్పింది. విసుగు అనిపించింది. సాయంత్రం వాచ్‌మాన్‌ని పిలిచి పులిహోర ఇచ్చేసింది. ఇలా ఉంటారు కొందరు.
మళ్లీ ఇంకోసారి మెసేజ్ పెట్టింది – ‘మాకు ట్రాన్స్ఫర్ అయింది. వెళ్లిపోతాము. మీ ఇంటికి లంచ్‌కి వస్తున్నాము’ అంటూ. ‘ఎంత మంది వస్తారు, ఎప్పుడు, ఏ టైమ్‌కి వస్తారు’ అని ఈమె మెసేజ్ చేస్తే, దానికి ‘నేను మీ స్నేహం కోరి అడిగాను, కనుక లోకువ అయ్యాను. నా లాంటి వ్యక్తి అభిమానం మీకు దొరకవద్దా’ అని మేసేజ్ పెట్టింది. ఇదేమి మనిషి అనుకున్నది ఆ మిత్రురాలు.
మళ్లీ ఇంకోసారి గుడ్ మార్నింగ్ పెట్టి, ‘మీరు ఈ విషయం గురించి చెప్పలేదు’ అన్నది. ‘మేం ఎప్పుడు రావాలో మీరు చెప్పండి’ అన్నది. ఇలా విసిగించామె.
అయినా ఆమె భోజనికి రావడానికి ఫోన్ చేసి మాట్లాడాలి అంతే కాని మెసేజ్ పెట్టే పద్ధతి సరికాదు కదా.
ఇవ్వాళ ఆహారానికి ఎన్నో హోటల్స్ ఉన్నాయి. వాళ్ళ పర్స్‌లో డబ్బు ఖర్చు అవకుండా ఉంటే చాలు, ప్రక్క వాళ్ళ ఖర్చు అయితే బాగుంటుంది. వండి వార్చి పెట్టాలి అంటే నలుగురికి ఎంత కష్టం? ముందు ప్లాన్ చేసుకుని వండాలి. మిగిలితే ఎలా చెప్పండి? ఇటువంటి వాళ్ళు ఇంటికి వెడితే కాఫీ కూడా ఇవ్వరు. ఇదండీ కొత్త మనుష్యులు స్నేహాలు ఇలా ఉన్నాయి. వాళ్ళకి ఫోన్ కాల్ ఖర్చు ఉండకూడదు, కానీ రెడీ చేసి ఘనంగా మనం విందు భోజనం పెట్టాలి. ఎంత స్వార్థం మనిషిలో ఉన్నది!
మరి కొందరు తన అభిప్రాయాలు ఈ విధంగా పంపారు:
సహజంగానే వంట వండటం తగ్గింది. దానికి తోడు బద్ధకస్తులయిన స్త్రీలు వంట మానేసి పొరుగు ఇరుగు ఇళ్లపై దాడి చేసి తింటున్నారు, పచ్చడి రుచి చూపించండి అంటూ. ఇది మీ అబ్బాయికి పెట్టండి, కోడలికి కాదు అంటూ అక్కడ రూల్స్. పొద్దున చేసిన కొబ్బరి పచ్చడి గంట అయేటప్పయికి కొంత నూనె వాసన వస్తుంది. ఇంకా మధ్యాహ్నం తరువాత సాయంత్రం తెచ్చి ఇస్తే ఇంకా ఏమి బాగుంటుంది? పొరుగింటి అబ్బాయి చేత ఆంటీ పొగిడించుకోవాలి.
ఇదే అతని భార్య ముందు విమర్శగా ఉండాలి. లొట్టలు వేస్తూ ఎంత బాగా చేసింది అని పొగడాలి. ఇది స్త్రీ సహజ పొగడ్తల లక్షణము.
పొగడ్త కైనా అర్థం ఉండాలి. ఈవిడ అధిక కోరికలకు ముగ్గురు కొడుకులకి ఒక్క పెళ్లి కూతుర్ని దొరకలేదు. మ్యారేజ్ బ్యూరోకి వెళ్లి భోజనం చేసి కిళ్ళీ వేసుకుని పార పళ్ళు పైకి పెట్టుకుని ‘అబ్బే ఒక్క పిల్ల బాగాలేదు’ అంటూ వస్తుంది. ఎంత తప్పు? మీరు ఏదో గొప్ప అందగత్తెను దృష్టిలో పెట్టుకొని కోడల్ని వెతుకుతున్నారు.
ఒక జమీందారీ కుటుంబంలో నలబై ఏళ్లు వచ్చిన పెళ్లి కొడుకుకి తల్లి ఒక హిందీ సినిమా హీరోయిన్ లాంటి కోడలు కావాలి అన్నది. సున్నితంగా నాజూకుగా సన్న జాజి మొగ్గలా ఉండాలి. అవిడ కొడుకు ఆఫీస్‌లో రివాల్వింగ్ చైర్‌లో కూర్చుని ఎటువంటి ఎక్సర్‌సైజ్ లేక ఫ్రిజ్‌కి ప్యాంట్ షర్ట్ వేసినట్లు ఉంటాడు. తన కొడుకు ఎలా ఉన్నా కోట్లు ఉన్నాయి అనే గర్వంతో ఉన్నది. అలాంటప్పుడు ఎంత మంది పిల్లల్ని చూపినా ఎలా నచ్చుతుంది?
ఈ రోజుల్లో వంట వార్పు చేసే మనుష్యులు లేరు. బాగా తగ్గి పోయారు. ఏదో ఉద్యోగం చేసే డబ్బు సంపాదించే ఉద్దేశ్యంతో ఉన్నారు. కాని వారికి ఏ మాత్రం సామాన్య జీవితం ఇష్టం లేదు. మేము వంటింటి కుందేళ్ళం కాదు అంటారు. ఇది నేటి తల్లి తండ్రి భావన కూడా.
ఇలా వచ్చిన అభిప్రాయాలని క్రోడీకరించి కంక్లూజన్ ఇచ్చింది ధీర.
~
దీన్నంతా ఓ ఆర్టికల్‌గా రాసి చిత్రలేఖకు పంపి “మీ ఇంట్లో వాళ్ళని చదవమని చెప్పు” అన్నది ధీర ఫోన్ చేసి.
“ఏమిటి? వాళ్ళు ఏమి మారరు” అన్నది చిత్రలేఖ.
“నాతో పాటు నా పత్రికలో వర్క్ చెయ్యి, చిత్రాలు వెయ్యవచ్చును” అన్నది ధీర.
“ఒప్పుకోరు.”
“వడ్డాది పాపయ్య గారు, చంద్ర,, వీరి ఫొటోస్ చూసావు కదా. కథలకి చిత్రాలు వెయ్యి, నవలల అట్టలకి వెయ్యి” అన్నది ధీర. “ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్‌గా చెయ్యి, అసోసియేషన్‌లో రిజిస్టర్ చెయ్యి” అన్నది.
“కొన్ని చిత్రాలు ఆన్లైన్‍౬లో పంపు. అవి చూపించి నేను నీకు ఏ విషయం చెపుతాను. ఎలాగో ఒప్పించి మొదలుపెట్టు” అన్నది ధీర.
“ఎవరే, అన్ని గంటలు ఫోన్‍లో ఆలా సమయం చూడకుండా మాటలాడుతున్నావు” అంటూ అమ్మమ్మ వార్నింగ్ బెల్‌లా అడిగింది నవ్వుతూ.
“ఎప్పుడు ఇంతే. ఆ ధీరేనా? అవునా?” అన్నది అమ్మమ్మ.
“సిఐడిలా భలే చెప్పావు. అవును ధీరే ఫోన్ చేసింది” చెప్పింది చిత్రలేఖ. కాసేపటికి సంభాషణ ముగించింది.
అమ్మమ్మ మాత్రం ధీర గురించి ఆలోచించసాగింది.
అహ ఏముంది చేతి నిండా డబ్బు ఉన్నది. వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నా పిల్లల్ని ఉద్యోగాలలో పెట్టారు. పిల్లని స్వతంత్రంగా పెట్టారు. నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నా ఏమి అనరు.
ఒక ప్రక్క హోటల్ మేనేజ్‌మెంట్‌లో లక్షలు పోసి మగ పిల్లలు చదువుతున్నారు. నాకు తెలిసిన బ్యాంక్ మేనేజర్ కొడుకు పట్టు పట్టి ఇంటర్ తరువాత ఈ కోర్స్‌లో చేరాడు. తల్లి తండ్రి ఇద్దరు బ్యాంక్ మేనేజర్ జాబ్‌లో ఉన్నారు. అక్క ఫారిన్‌లో ఇంజినీర్. అయినా ఆ అబ్బాయి హోటల్ కీపింగ్‌లో స్పెషల్ కోర్స్ చదివాడు. కానీ తల్లి మాత్రం వంటలు అయితే నాన్ వెజ్ కూడా నేర్చుకోవాలి కనుక ఈ కోర్స్ చేస్తే మంచిది అని ఒప్పించ్ చేర్చారు. ఇప్పుడు ఆడపిల్లలు జర్నలిజం అంటే ఇష్టపడుతుంటే, మగ పిల్లలు హోటల్ కోర్స్‌లు ఇష్ట పడుతున్నారు. విద్యా రంగ పరిస్థితులు మారాయి. అమ్మాయిల పని అబ్బాయిలు. అబ్బాయిల పని అమ్మాయిలు చేస్తున్నారు. విదేశాలలో వర్కు పంచుకున్నట్లు ఆ దేశం ప్రకారం మన దేశంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి.
అంతరంగ భావాలు వ్యక్తీకరణలో స్పష్టత ఉన్నది. ఆడ పిల్లలు ధైర్యంగా వారికి నచ్చిన జీవితాలు ఎంచుకుని మార్గాన్ని సుగమం చేసుకుంటున్నారు. అందుకు తల్లి తండ్రి ఇంట్లో వాళ్ళు అంతా ఒకటిగా ఉండి ప్రోత్సాహిస్తున్న శుభ సమయము వచ్చింది. అందుకే ధీర లాంటి వనితలు నేటి తరంలో ఆదర్శం. ఆ దేశం కూడా తమ తెలివికి పట్టం కట్టి ప్రజా సేవ అనేకంటే తన వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుందని వీరు అంటున్నారు.
అమ్మమ్మ ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి.
5
ప్రకృతి అందాలు ఎన్నో. కళకారుడి కుంచెకు రంగుల ఇంద్రధనుస్సులు ఎన్నో.
అయితే చిత్రలేఖ ఎక్కడికి వెళ్లదు. ధీర ఎలాగైనా లాంగ్ ట్రిప్ వెళ్ళాలి, ప్రకృతి ఆరాధకులు తప్పక శాంతినికేతన్ చూడాలి అని ఆలోచించి చిత్రలేఖ అమ్మమను అడిగింది.
“వాళ్ళ నాన్న శాడిస్ట్. ఎక్కడికి పంపడు. నేను పంపితే ఊరుకోడు”అన్నది అమ్మమ్మ.
“ప్రపంచం మారింది, మీరు మారలేదు” అంటూ “మా అక్క ఇంటికి నేను కలకత్తా వెడుతున్న సంగతి మీకు తెలుసు. చిత్రని నాతో పంపండి. అన్ని కాకపోయినా శాంతి నికేతన్ చూస్తుంది, భయం లేదు మేము ఉంటాము” అన్నది ధీర.
“నాతో ఇంకా నలుగురు అమ్మాయిలు వస్తున్నారు. మా యూనిట్ మా అక్క ఇంట్లో ఉంటాము. ఎలాగా మాకు నాలుగు రోజులు మాకు సెలవు ఇచ్చారు” అన్నది
ఈలోగా చిత్ర వాళ్ళ పెద్దమ్మ పూర్ణ వచ్చి “నేను వస్తాను, అక్కడ చూడలేదు” అంటూ తల్లిని ఒప్పించి ప్రయాణానికి రెడీ చేసింది.
రైలు అయితే బాగుంటుంది, సీనరీస్ ఉంటాయి అంటూ రైలు బుక్ చేశారు. అంతా బయలు దేరారు.
***
రైలు స్టేషన్‌లో ఆగేటప్పటికి అక్క కొడుకు, పోర్టర్ రెడీగా ఉండి సామాన్లు దింపుకున్నారు. పట్టుకెళ్ళిన ఊరగాయలు, మినప సున్ని డబ్బాలు అన్ని సర్దారు. ఒక గంట ప్రయాణం తరువాత ఇల్లు చేరారు. పెద్ద ఇల్లు. ఎప్పుడో వెళ్లి అక్కడ సెటిల్ అయ్యి బెంగాలీ వాళ్ళు అయిపోయారు. అయినా ఆంధ్ర ప్రేమ ఉన్నది. అందుకే కొడుక్కి ఆంద్ర పిల్లని చెయ్యాలని ఆత్రుత పడ్డారు. భగవంతుడు అలాగే మంచి పిల్లని చేస్తాడు .
సరే అందరికీ వాళ్ళ ఇంట్లో గెస్ట్ రూంలు చూపించింది. వంట మనిషి ఉన్నది. కూతురు దుబాయ్‌లో ఉంటుంది. తెల్లగా ఎత్తుగా అందరూ బాగున్నారు. ఫ్రెష్ అయి అంతా టేబుల్ దగ్గరికి వచ్చారు.
హాట్ ప్యాక్ లలో గారె, ఇడ్లీ, దోసె, మిరియం పొంగలి, స్వీట్ పొంగలి పనీర్ స్వీట్ పెట్టారు. అక్కడకి పట్టుకెళ్ళడానికి పూరీ కూర, ఆవడ చేశారు. ఇన్ని రకాలా అంటే అవును అంటూ కొబ్బరి చట్నీ అల్లం చట్నీ కూడా పెట్టరా లేదా అంటూ అన్ని కూడా రుచిగా ఉంటాయి అని చెపుతూ హాట్ బాక్స్‌లో సర్దారు.
అంతా ఆత్రంగా టిఫిన్లు తిన్నారు. కాఫీ తాగి బయలుదేరారు. ధీర వాళ్ళ అక్క రూప కూడా బయలుదేరింది. బావగారు కంపెనీకి వెడతారు, అక్కడే లంచ్ చేస్తారు. “నా కొడుకు మనతో వస్తాడు” అన్నది. అందరూ ఆనందంగా పెద్ద కారులో బయలుదేరారు. విశాలమైన రహదారి. స్వాగతం చెప్పే పూల మొక్కలు. ఒక సినిమాలో అందమైన అద్భుతమైన పాట జ్ఞాపకం వస్తుంది అందరికీ. ప్రకృతి అలాంటిది కదా. కవి హృదయం పులకిస్తుంది.
శాంతినికేతన్ చేరారు. అక్కడ చెట్లు అన్ని కూడా యోగుల మాదిరి ఉన్నాయి. అలాంటి ప్రశాంత వాతవరణానికి వెళ్లి చదువుకునే అదృష్టం కొందరికే ఉంటుంది. పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఇక్కడ శ్రీ రవీంద్రనాథ్ ఠాకూర్ చిత్రం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఆయన తన డెబ్బై సంవత్సరంలో చిత్రకారుడిగా మారాడు. ఎలా అంటే రాసిన రచనలు దిద్దుబాటులో అందమైన చిత్రాలుగా మారాయి. అలవాటు ప్రకారం అవి చిత్రాలు అయ్యాయి. సాధన స్ఫూర్తితో ఆయన ఈనాడు ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆ విధంగా ఈ శాంతినికేతన్ ఆవిర్భావం జరిగింది అని ఒక పుస్తకంలో చదివిన జ్ఞాపకంగా ఉన్నది అని చిత్ర అన్నది
వడి వడిగా కెమెరాలు పని మొదలు పెట్టాయి. అక్కడ గైడ్ ఉండి పెర్మిషన్ లెటర్ ఉండి పని చెయ్యడం సులభం అయింది. ఇద్దరు కళాకారులు కనుక అంతా కెమెరాలలో బంధించి తెచ్చారు.
చాలా ఆనందం సొంతం అయింది. ఇంటికి వచ్చాక రాత్రి హోటల్ డిన్నర్. అవి కూడా బెంగాలీ వంటలతో రుచికర భోజనం చేశారు. రాత్రి కబుర్లతో ఎప్పుడో ఎవరికి వారు నిద్రలో జారుకున్నారు.
మర్నాడు అన్ని షాపింగ్‍లు అని చెప్పి బెంగాలీ చీరలు, డ్రెస్సులు రక రకాల చెప్పులు, అక్కడి గాజులు ఇలా అందరూ అన్ని కొనుకున్నారు. ధీర వాళ్ళ అక్క అందరికీ మంచి ఖరీదు అయిన బెంగాలీ సిల్క్ చీరలు పెట్టింది. పూర్ణ వాళ్ళు కూడా అమ్మకి వాళ్ళకి మంచి బట్టలు కొన్నారు. బెంగాలీ స్వీట్ ప్యాకెట్లు ఇచ్చింది ధీర అక్క.
“పిల్లాడి పెళ్లి అంద్రలోనే చేస్తాను, అందరూ రావాలి” అని చెప్పింది. “అయితే మేము మంచి పెళ్లి కూతుర్ని వెతుకుతాము సరా” అన్నారు.
“అప్పుడే వెళ్లి పోతున్నారా?” అని అక్క బాధపడితే,
“అవును మాకు రూకలు అక్కడ సృష్టి చేసి ఉన్నాయి. అందుకే అప్పుడప్పుడు ఇక్కడే నూకలు ఋణం ఉన్నాయి” అని పూర్ణ నవ్వుకున్నది
రైలు ఎక్కించి వచ్చారు. వేగంగా ఆంద్ర వైపు బయలుదేరింది రైలు.
***
చిత్రలేఖ పెద్దమ్మ పూర్ణ గతంలో డిల్లీకి వెళ్ళినప్పుడు తీసుకు వెళ్ళి అన్ని చూపించింది.
ఆఫీస్ కార్లో అన్ని తిప్పింది. ముస్సోరి మాత్రం ఇంకా ఇద్దరు ఆఫీసర్స్ కుటుంబాలలో కలిసి సదరన్ ట్రావెల్స్‌లో బుక్ చేసుకుని వెళ్లారు. డెహ్రాడూన్ దగ్గర మలుపులు అక్కడి మొక్కలు చూస్తూ ఉంటే ఆ దారి ఎంతో అందంగా ఉన్నది. రాత్రి నిద్ర పోకుండా ఆ లైట్స్ అందాలు చూసింది. అప్పుడు చిత్రలేఖ ఇంటర్ చదువుతోంధి. అప్పటికే చిత్రాలు వేస్తోంది.
ముస్సోరిలో ప్రకృతి అందాలు ఘన్ హిల్, కేమిల్ రాక్ ఇవన్ని అద్భుత దృశ్యాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేసుకుని కెమెరా పట్టుకుని వెళ్లారు. అక్కడ రోపే వే ద్వారా మూడు వేల కిలో మీటర్ల ఎత్తులో ఘన్ హిల్ ఉంటుంది అక్కడనుంచి కైలాస వెండి కొండ దర్శనం, శివపార్వతులు దర్శనం అవుతుంది అని చెపుతారు. ఆకాశం అక్కడ వెండి రంగులో మెరుస్తూ ఉంటుంది, అదొక దివ్యానుభూతి అంటారు, అచ్చు ఒంటె ఆకృతిలో ఆ రాయి ఉంటుంది కనుక కేమిల్ రాక్ హిల్ అంటారు. అక్కడ ఆడవారు ఇత్తడి బిందెలు పూల బుట్టలతో ముఖమల్ కాశ్మీరు వనిత డ్రెస్ వేసుకుని ఫోటోలు దిగుతారు.
ఆరోజు అక్కడ ఎరుపు ఆకుపచ్చ నీలం తెలుపు కాఫీ రంగు దుస్తులు ఉన్నాయి. రెండు రంగుల నచ్చినవి అందరం వేసుకుని పూలబుట్టలు పట్టుకుని ఫోటోగ్రాఫర్‍తో ఫోటో ప్రింట్ చేయించుకుని అక్కడే తెచ్చుకోవాలి. మగ వారికి డ్రస్‍లు ఉంటాయి. అదొక అద్భుత అనుభూతి.
తరువాత అందరూ కలిసి హోటల్‍కి వెళ్ళారు. అక్కడ చపాతీ పురి అంటూ గోధుమ వంటలే ఉంటాయి. కానీ అక్కడ ఏమి కావాలి అన్న మెనులో ఇడ్లి అన్నాడు. దానితో ఆంద్ర వాళ్ళు ఇడ్లీ అన్నారు. వాడు అరగంట తరువాత ఉడికి ఉడకని ఇడ్లీ ప్లేట్లు ఏదో పచ్చడి వేసి తెచ్చి ఇచ్చాడు. చాలా రేటు ఎక్కువ. ఉన్నది పారేయ్య లేక తినలేక ఇబ్బంది ముఖాలు పెట్టుకుని తిన్నారు. అందుకే ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం తిండి కావాలి అనకుండా ఎక్కడ దొరికే తిండి తినాలి. ఇదో విచిత్ర అనుభూతి అని చెప్పాలి.
ఆ తరువాత ఇంకా ఎక్కడికి పంపలేదు. ఇక్కడ చదువు చాలు. మీ నాన్న కోప్పడతాడు అని ఊరుకున్నారు. “అన్ని వింత అనుభూతులు ఇంట్లోనే ఉన్నాయి; పెళ్లి చేసుకున్న తరువాత మీ ఇష్టం” అన్నారు
‘మా నాన్న లాగా అందరూ ఉండరు. ఈ రోజుల్లో ఆడపిల్లే నయం అంటున్నారు’ అనుకుంది చిత్రలేఖ.
***
ధీర పెళ్లికి తల్లితండ్రుల ఇష్టంతో తనకి తన కెరియర్ ముఖ్యం అంటూ పెళ్లి చేసుకున్నది. ఒకటి ఆడపిల్ల ఎంత మేధావి అయిన కొందరు అత్తింట పరిస్థితిలో నెగ్గుకు రాలేరు. ఆ అత్తింటి తెలివి ముందు వీరు ఐ.ఎ.ఎస్.లు అయినా తప్పదు, ఇంటికి రాగానే ఇంటి బాధ్యతలు చూడాలి. అత్త అడబడుచుల మెప్పు పొందాలని అంటే మహా కష్టమే. ఎదురు తిరిగితే అన్ని సమస్యలు వస్తాయి.
ఆడపిల్ల అంటేనే ఆడ పిల్ల. ఈ తరంలో కూడా చిత్ర తల్లి లాంటి వారు చాలా మంది ఉన్నారు. పెళ్లికి ముందు అహ ఓహో అంటూ కబుర్లు చెప్పి మీ పిల్ల అంతటిది లేదు అంటారు, పెళ్లికి ముందు అన్ని మంచిగా గొప్పగా పొగుడుతారు. పెళ్లి తరువాత అన్ని తప్పులే. ఎంత బాగా చేసినా నచ్చదు. అస్తమానం వంకలు పెడతారు, విసిగిస్తారు. విద్యావంతురాలు అంటూ గర్వంగా ఉంటుంది, ఏమి వచ్చు? అన్ని వచ్చు అనుకోని చేసుకున్నాము అంటూ విమర్శిస్తారు.
ఇవన్నీ ప్రతి అత్త ఇంట మామూలే అని చెప్పాలి. వంట వాళ్ళకి పని వాళ్ళకి భయపడి వారి దగ్గర విమర్శిస్తారు. అయ్యో కోడల్ని లోకువ చేస్తున్నాము అనే భావన ఉండదు. జీవితంలో కొందరికి కోడళ్ళు కంటే పనివాళ్ళే ఎక్కువ. అతని అక్క ముఖం ప్రక్కకు తిప్పుకున్నా, మరదలు మంచి శాలరీ తెస్తోంది కనుక ఊరుకొన్నది.
~
చిత్ర పలుకు తేనెల తల్లి పవళించేను అన్న పాట వింటూ చక్కగా చిత్రాలు వేస్తు ఆనందంగా జీవితం సాగిస్తోంది. ధీరలా ధైర్యంగా పెళ్లి చేసుకోలేదు. ఇంట్లో వాళ్ళ పరిస్థితి, అమ్మ పరిస్తితి జ్ఞాపకం వచ్చి పెళ్లిని పక్కన పెట్టేసింది.
ఈలోగా చిత్ర తను వేసే చిత్రాలు అన్ని కూడా వస్త్రాలపై ప్రాక్టీస్ చేసింది. ఏముంది రంగులో కెమికల్స్ మారుతాయి, అవి కొని చేసింది. ముఖ్యంగా ఎన్నో అందమైన బంజారా బొమ్మలు, చక్కని సీనరిస్, ముగ్గులు, అక్షరాల ముగ్గులు, ఇలా బిన్న విభిన్న చిత్రాలు వేసి పెట్టింది. ఇది ఒక ఆనంద అనుభూతి.
అది దీరకు ఫోన్‍లో పెట్టింది. ఆమె లోకల్ కెమెరామెన్‌కు చెప్పి వీడియో చేసి వెబ్‌సైట్‌లో పెట్టింది. అంతే కాదు, ఇంటర్వ్యు చేసి ఛానెల్‌లో ప్రసారం చేసింది.
అరె ఎక్కడో చిన్న పట్టణంలో ఉన్న యువతికి ఇంత ప్రజ్ఞా అంటూ ఆశ్చర్యపోయారు. మిగతా ఛానెల్స్ వారు కూడా వచ్చి అడిగారు. అమ్మమ్మ మురిసి పోయింది. కానీ వాళ్ళ నాన్న చూస్తే గొడవ చేస్తాడు అనుకున్నది.
కానీ “తరం మారింది అమ్మమ్మా, నువ్వు భయపడి చిత్రను భయపెట్టవద్దు” అంటూ ధీర ఫోన్‌లో మాట్లాడింది.
“ఏమోనమ్మా, నాకు దాని పెళ్లి బాధ్యత ఉన్నది. ఇలాంటివి మా ఇంటా వంటా లేని ఉద్యోగాలు, వ్యాపకాలు” అంటూ నసిగింది.
చిత్ర మాత్రం “నేను చాలా ఆనంద పడుతున్నాను” అన్నది.
“ఏమో ఈ ఏడాది పెళ్లి చేసెయ్యాలి” అంటూ అమ్మమ్మ దూరం చుట్టం ఒకర్ని చూసింది. అతను బ్యాంక్ ఆఫీసర్. మాకు అది చాలు. మీడియా పరుగులు అంటే కుదరదు అన్నది. కడుపు నిండా తిండి పెట్టి ప్రేమగా చూస్తే చాలు అన్నది. కొన్ని ఇళ్ళల్లో అలా సరిపెట్టుకుంటారు.
అయితే ఆ పెళ్ళివారు చిత్రని టివి ఛానల్‌లో చూశారు కనుక తన విద్య, విషయాలు అన్ని మాకు బాగా తెలుసు అన్నారు. ప్రతిభను ఇంటికే పరిమితం చేస్తే ఎలా అంటూ వారు ఆసక్తిగా కళల గురించి మాట్లాడారు. అసలు ఇల్లు చూడగానే కళాకారిణి ఇల్లు అన్నట్లు ఉంటుంది. ఆ నెలలో పెళ్లి ముహూర్తం పెట్టారు. తండ్రికి అమ్మమ్మకి మనస్సు స్థిమితపడింది.
పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అంటూ గట్టి మేళం వాయించారు. పెళ్లి కూతుర్ని అత్తవారి ఇంటికి పంపారు.
శ్రావణంలో పెళ్లి ఘనంగా చేశారు, అటు శ్రీ వరలక్ష్మీ పూజ ఘనంగా చేశారు. అటు పోలేరమ్మ పూజ చేయించి పంపారు. ఇంకా భాద్రపద మాసంలో వినాయక చవితి పూజ ఎంతో బాగా అత్తవారింట చేశారు. రక రకాల వినాయక చిత్రాలు అన్ని కలిపి అందంగా అమర్చి తన కళకు మెరుగులు దిద్ది పాలవెల్లి అన్ని కొత్త పద్ధతిగా అలంకరించి పూజ చేసారు.
చిత్ర – అమ్మమ్మకి వీడియో పంపింది, అమ్మమ్మ సంతృప్తి పడి దీవించింది. “దీర్ఘ సుమంగళి భవ, కుటుంబ వృద్ధి, అనందం నీ సొంతం కావాలి” అని ఫోన్‌లో అమ్మమ్మ తాత దీవించారు.
భవిష్యత్తులో చిత్ర భర్త, అత్తింటి సహకారంతో ఎన్నో అవార్డ్స్ పొందాలని మనమూ దీవిద్దాం.
శాంతి శుభము