దేశ విభజన విషవృక్షం-58

0
4

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

ఖిలాఫత్ ఉద్యమం సమయంలో ముస్లిం నేతల ఎత్తుగడలు ఏమిటన్నది స్పష్టంగానే తేలిపోయింది. కానీ కాంగ్రెస్‌కే అర్థం కాలేదు. ఇవాళ్టికి కూడా కాంగ్రెస్ పార్టీ అదే భ్రమలో ఉండిపోయింది. ముస్లిం నేతలు మొదట్నుంచీ కూడా తమ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు మాత్రమే కాంగ్రెస్‌ను వాడుకున్నారు తప్ప వాళ్లకు దేశమూ.. స్వాతంత్ర్యమూ అన్న దిశగా ఆలోచన ఎన్నటికీ లేదు. వాళ్ల ఉద్దేశం మొదట్నుంచీ కూడా స్పష్టంగానే ఉండింది. ఖిలాఫత్ నాయకులు.. తమ ఆందోళన జరుగుతున్న కాలంలోనే కాంగ్రెస్ లోనే అంతర్భాగంగా నేషనలిస్ట్ ముస్లిం పార్టీ అనే ఒక విభాగాన్ని ప్రారంభించారు. ప్రముఖ ఖిలాఫత్ నాయకుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ దీనికి మద్దతు పలికారు. ఈ దేశంలో ముస్లింల గురించి.. వారి భవిష్యత్తు గురించి ఆయన స్పష్టంగానే ఆ సందర్భంలో చెప్పారు. ‘Democracy is un-Islamic. And like Muslim leaders are strong headed minorities. In day in a longer run they will become majority by means of conversions, and a higher demographic growth.’ మొదట్నుంచీ కూడా వాళ్ల లక్ష్యం ఒక్కటే. 1930లో కూడా తొలిసారి పాకిస్తాన్ పదం వినిపించిన సందర్భంలో ఆయన చాలా చాలా స్పష్టంగా తమ గమ్యం ఏమిటో, లక్ష్యం ఏమిటో స్పష్టంగానే చెప్పారు.

Making of Pakistan from Islamic view point is only temporary tactic. On the way the ultimate goal is the islamisation of India. అందుకే స్వాతంత్ర్యం వచ్చిన రెండు నెలల్లోనే పాకిస్తాన్ భారత్‌పై తెగబడింది. ఇప్పటికీ యుద్ధాలు చేస్తూనే ఉన్నది. కాశ్మీర్ చితిని రావణ కాష్టంలా కాలుస్తూనే ఉన్నది. ఈ దేశంలో ముస్లిం నేతల లక్ష్యానికి, ముస్లిం ఓటు రాజకీయాలకు, భారతీయ ధర్మంపై, భారతీయ జీవన విధానంపై విశృంఖలంగా కొనసాగుతున్న దాడులకు వెనుక అంతిమ, పరమ ప్రయోజనం భారతదేశ ఇస్లామీకరణ కాక మరేముంటుంది?

బ్రిటిష్ పాలకులు ‘విభజించి పాలించు’ అన్న విధానాన్ని కచ్చితంగా అమలు చేయడం వల్లనే హిందూ ముస్లింల మధ్యన వైరుధ్యం ఇంకా కొనసాగుతున్నదనే చిత్త భ్రమల్లో కొందరు హిందువులు ఉన్నారనుకొంటే అంతకంటే పొరపాటు మరొకటి లేదు. హిందూ ముస్లిం వైరుధ్యం అన్నది బ్రిటిష్ వాళ్ల వల్ల వచ్చింది ఎంతమాత్రం కాదు. దాదాపు ఆరు వందల సంవత్సరాల పాటు అత్యంత అమానుషంగా, నిరంకుశంగా, పైశాచికంగా సాగిన దమన కాండ నుంచి పుట్టుకొచ్చింది. ఇది మత సిద్ధాంత వైరుధ్యం వల్ల వచ్చింది కాదు. మతం చేసిన మారణకాండ నుంచి పెరిగిన తీవ్రమైన అంతరం పెరిగి పెరిగి పూడ్చలేనంత అగాధం ఏర్పడింది. హిందూ ముస్లింల మధ్యన శాశ్వతమైన, పరిష్కరించలేని వైరుధ్యం.. చారిత్రక, మత, సాంస్కృతిక, సామాజిక కారణాలు అనేకం వల్ల కలిగిందే. ఈ మాటలు సాక్షాత్తూ అంబేద్కర్ తన దేశ విభజన లేదా పాకిస్తాన్ అన్న గ్రంథంలో పేర్కొన్నారు.

While it is necessary to admit that the efforts at Hindu Muslim unity have failed and that the Muslim ideology has sentiment of historical patriotism, or any pride in the national ownership of an extensive territory, should permanently prevent a peaceful dissolution of the incoherent whole into its natural parts.” (Elements of Politics (1929), pp. 648-49.) National Frustration undergone a complete revolution, it is equally necessary to know the precise causes which have produced these effects. The Hindus say that the British policy of divide and rule is the real cause of this failure and of this ideological revolution. There is nothing surprising in this. The Hindus having cultivated the Irish mentality to have no other politics except that of being always against the Government, are ready to blame the Government for everything including bad weather. But time has come to discard the facile explanation so dear to the Hindus. For it fails to take into account two very important circumstances. (Pakistan or the partition of India B. R. Ambedkar p.322-323).

ఈ దేశంలో ముస్లింల వ్యవహార విధానాన్ని బీఆర్ అంబేద్కర్‌తో పాటు.. వీర సావార్కర్ మాత్రమే అర్థం చేసుకున్నారు. అవగాహన చేసుకొన్నారు. 1939లో అఖిల భారత హిందూ మహాసభ జరిగింది. అందులో వీర సావార్కర్ ముస్లిం వ్యవహారశైలిపై తన అభిప్రాయాన్ని చెప్పారు. ‘Now a National Parliament in such a self-governing India can only reflect the electorate as it is, the Hindus and the Moslems as we find them, their relations a bit bettered, perhaps a bit worsened. No realist can be blind to the probability that the extraterritorial designs and the secret urge goading on the Moslems to transform India into a Moslem State may at any time confront the Hindusthani State even under self-governing either with a Civil War or treacherous overtures to alien invaders by the Moslems. Then again there is every likelihood that there will ever continue at least for a century to come a danger of fanatical riots, the scramble for services, Legislative seats, weightages out of proportion to their population on the part of the Moslem Minority and consequently a constant danger threatening internal peace. To checkmate this probability which if we are wise we must always keep in view even after Hindusthan attains the status of a self-governing country, a powerful and exclusive organization of Hindudom like the Hindu Mahasabha will always prove a sure and devoted source of strength, a reserve force for the Hindus to fall back upon to voice their grievances more effectively than the joint Parliament can do, to scent danger ahead. To warn the Hindus in time against it and to fight out if needs be any treacherous design to which the joint State itself may unwittingly fall a victim. (Hindu Rashtra Darshan, VD Savarkar p.58)

మహాత్మాగాంధీ మాత్రం హిందూ ముస్లిం సమైక్యత అభిప్రాయాన్ని మాత్రం వదులుకోలేదు. ‘విభజించి పాలించు’ సూత్రాన్ని గట్టిగా అమలు చేయడం వల్లనే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ల రాజ్యం, అధికారం కొనసాగుతున్నదని ఏఓ హ్యూమ్ (కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు) తనతో చెప్పినట్టు గాంధీజీ వ్యాఖ్యానించారు కూడా. హ్యూమ్ అభిప్రాయం గాంధీని చాలా ప్రభావితం చేసింది. గాంధీజీ కూడా ఆయన మాదిరిగానే అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకొన్న మూలంగానే.. హిందూ ముస్లిం సమైక్యత వల్ల మాత్రమే స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని గట్టిగా నమ్మారు. అదే బాటలో ముందుకు సాగారు. గాంధీజీ అనుసరించిన విధానం కాంగ్రెస్ లోని అతివాదులకు అసంతృప్తిని కలిగించింది. కానీ గాంధీ మాత్రం తాను అనుకున్న మార్గంలోనే సాగారు. కాంగ్రెస్ వారి మొదటి సర్వ సభ్య సమావేశంలోనే ముస్లింలు పాల్గొనలేదు. కాంగ్రెస్‌ను జాతీయ కాంగ్రెస్ అని పిలిచేది లేదని ముస్లిం వర్గాల కోసం వ్యవస్థలను ఉపయోగించుకొనే తయ్యాబ్జీలు స్పష్టంగా తేల్చి చెప్పారు. ఖిలాఫత్ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేయాల్సి వచ్చిన సందర్భంలో గాంధీజీ ద్వారా కాంగ్రెస్ సేవలను, హిందువులను తమ ప్రయోజనం కోసం వినియోగించుకున్నారు. అదే సమయంలో 1922-23 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్లలో దాదాపు 20 వేల మంది హిందువులు హతమయ్యారు. వీటిలో ఏ ఒక్కదానికీ విచారణ లేదు.. శిక్ష జరుగలేదు. ఆ ఏడాది కాలంలో పత్రికలను పరిశీలిస్తే మరిన్ని అంశాలు అవగాహనకు వస్తాయి. అప్పటి ఆందోళనలకు సంబంధించి పుస్తకాలు కూడా అచ్చయ్యాయి. వాటిలో ముఖ్యమైన గ్రంథం.. సీ శంకరన్ నాయర్ రాసిన గాంధీ అండ్ అనార్కీ. ఈ గ్రంథాన్ని 1922 లో టాగోర్ అండ్ కో మద్రాస్ వారు ప్రచురించారు. ఈ గ్రంథంలో 218 పేజీ నుంచి 251 వ పేజీ వరకు ఖిలాఫత్ ఉద్యమం సమయంలో ఏ ఊర్లో.. ఏ స్థాయిలో అల్లర్లు జరిగాయో.. సవివరంగా అధికారిక రికార్డులను స్పష్టంగా పేర్కొన్నారు. వాటిలో కొన్ని వివరాలు మీ కోసం.. నెల్లూరు (22 సెప్టెంబర్ 1919), ముత్తుపేట, తంజావూరు (మే 1920), మద్రాసు (మే 1920), సుక్కూరు, సింధ్ (29 మే 1920), కచాగడి, ఎన్ డబ్ల్యుఎఫ్ పీ(8 జూలై 1920), కసూర్, పంజాబ్ (25 ఆగస్ట్ 1920), ఫిలిబిత్, యూపీ (23 సెప్టెంబర్ 1920),  కొలాబా, బొంబాయి (9 జనవరి 1921), నయిహటి, బెంగాల్ (4,5, ఫిబ్రవరి 1921), కరాచీ (1 ఆగస్టు 1921) మద్రాసు (5 అక్టోబర్ 1921), కలకత్తా (24 అక్టోబర్ 1921), హౌరా (4 నవంబర్ 1921), కూర్గ్ (17 నవంబర్ 1921), కన్ననూర్ (4 డిసెంబర్ 1921), జముమాముఖ్, అస్సాం (15 ఫిబ్రవరి 1922), సిల్హెట్ (16 ఫిబ్రవరి 1922).

ఖిలాఫత్ సమయంలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో కొన్ని ఇవి. వీటన్నింటికంటే.. 1921-22 ప్రాంతంలో అత్యంత దారుణంగా జిహాద్ స్థాయిలో మారణకాండ జరిగింది మలబార్‌లో జరిగిన మోప్లా అల్లర్లు. వీటిని మన చరిత్రకారులు హిందూ జమీందారులకు, ముస్లిం రైతులకు భూమి హక్కుల కోసం జరిగిన పోరాటంగా అభివర్ణిస్తూ వచ్చారు. మలబారు ప్రాంతం మొదట్నంచీ అత్యంత సున్నితమైన ప్రాంతంగా ఉంటూ వచ్చింది. అక్కడ ముస్లిం డెమోగ్రఫీ కూడా చాలా ఎక్కువ. మలబార్ తీరప్రాంతమంతా నివసించే ముస్లింలను మాప్పిల్లా అని పిలుస్తారు. ఇంగ్లిష్‌లో మోప్లా అంటారు. ఈ ప్రాంతంలో 32 శాతం పైగా ఇస్లాం మతావలంబులు ఉన్నారు. మోప్లా జిహాద్ తీవ్రస్థాయిలో జరిగిన ఎర్నాడ్ జిల్లాలో వీరి జనాభా 60 శాతం ఉన్నది. మలబార్ తీరంలో 825 సంవత్సరంలోనే ఇస్లామీకరణ మొదలైంది. అప్పటి చేర ప్రాంత రాజు.. చేరమాన్ పెరుమాళ్ మక్కాకు సముద్రం ద్వారా వెళ్లి ఇస్లాం స్వీకరించి మరీ వచ్చాడు. పదికి పైగా మసీదులు నిర్మించి మత ప్రచారం చేశారు. 1789లో టిప్పు సుల్తాన్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించిన తరువాత మతమార్పిడులు పెద్ద ఎత్తున జరిగాయి. 1742 నుంచే ఈ ప్రాంతంలో దురాక్రమణలు, దురాగతాలు, దుర్వ్యవహారాలు కొనసాగినట్టు అనేక ఘటనలు రికార్డయ్యాయి. 1764లో ధర్మదాం కోటలోని పోర్చుగీసు చర్చిపైన మోప్లాలు దాడి చేసి ధ్వంసం చేశారు. 1836 నుంచి 1920 మధ్య కాలంలో మలబార్ జిల్లాలో 33 అరాచక దౌర్జన్యాలు జరిగాయని స్టీఫెన్ డేల్ తన ‘the Mappilla outbreaks ideology and social conflict in nineteenth century Kerala, the journal of Asian studies Vol 35, no.1, Nov.1975, p.85-87’ లో రికార్డు నమోదు చేశారు. 1921-22 లో పూర్తి స్థాయి మోప్లా జిహాద్ జరిగింది. దాదాపు 350 మంది మోప్లాలు ఈ దాడుల్లో పాల్గొంటే.. వీరిలో 322 మంది షహీద్ (అమరులు) అయ్యారు. అలా అనిపించుకోవడానికి అత్యంత హింసాత్మకంగా మానవబాంబులుగా మారి దాడులు చేశారు. పోలీసులు పట్టుకున్నది కేవలం 28 మందిని మాత్రమే. ఇవన్నీ ఆత్మాహుతి దాడులుగానే సాగాయి. అత్యంత ప్రణాళికాబద్ధంగా మతపరమైన కార్యక్రమాల్లో వ్యూహాత్మక నిర్ణయాల ద్వారా ఈ దాడులు అమలు అయ్యాయి. కాజీలు, ఇమాంలు (బహుశా వీరిద్దరూ ఒకే కోవకు చెందినవారు), ముల్లాల వంటి మతబోధకులు జిహాద్‌ను ప్రోత్సహించేవారు. వీరిలో ఎక్కువగా సయ్యద్ ఫాజీ వంటి మత ప్రచారకుల ప్రభావం ఎక్కువగా ఉండేది. ఈ జిహాద్‌లో అందరి ప్రధాన నినాదం ఒక్కటే. ఇస్లాంకు మత ద్రోహం చేసిన హిందూ కుటుంబాలను అంతం చేయడం. ఇందుకు తగినట్టుగానే.. 1921-22 మధ్య కాలంలో మోప్లా జిహాద్ భయంకరంగా జరిగింది. దాదాపు 33 అరాచక, దౌర్జన్యాలు జరిగాయి. వీటిలో మూడు వ్యవసాయ సంబంధిత గొడవలు.. నాలుగు వ్యక్తిగత గొడవలు.. రెండు బ్రిటిష్ కలెక్టర్లపై జరిగిన దాడులు.. మిగతావన్నీ కూడా మత సంబంధమైన దాడులుగా నమోదయ్యాయి. ఈ అల్లర్లకు ఖిలాఫత్ ఇచ్చిన సైద్ధాంతిక భూమికే ప్రధాన కారణంగా నిలిచింది. ముఖ్యంగా ఎర్నాడ్ జిల్లాలో అలర్లు ఎక్కువగా జరిగాయి. 1920 ఏప్రిల్ 28న ఎర్నాడ్ తాలూకా మంజేరీలో ఖిలాఫత్ నాయకులు ఒక సమావేశాన్ని నిర్వహించారు. మలబార్ జిల్లా సమావేశం అని దానికి పేరు పెట్టుకున్నారు. ఆ సమావేశానికి అలీ సోదరుల్లో ఒకరైన షౌకత్ అలీ వచ్చి టర్కీ ఖలీఫా సమస్య గురించి ప్రసంగించారు. ఆ తరువాత అదే సంవత్సరం ఆగస్టు 18న గాంధీ గారు కూడా కాలికట్ సందర్శించి.. షౌకత్ అలీతోపాటు ఒక సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో గాంధీ గారు కూడా ఖిలాఫత్ గురించి, సహాయ నిరాకరణ గురించి మాట్లాడారు. ఆ తరువాతే మలబార్ ప్రాంతంలో అన్ని చోట్లా అనేక ఖిలాఫత్ కమిటీలు వెలిశాయి. సమావేశాలు తామర తంపరలుగా జరిగాయి.  అంతే కాదు.. ఆఫ్ఘన్లు భారత్ పై దండెత్తబోతున్నారని.. బ్రిటిష్ వాళ్లపై యుద్దం చేయబోతున్నారని ప్రచారం చేయసాగారు. దీంతో మోప్లా జిహాద్ తీవ్ర రూపం దాల్చింది. అప్పటి అల్లర్లకు సంబంధించిన గణాంకాలను గమనిస్తే విస్మయం కలుగుతుంది. చివరకు బ్రిటిష్ వారు ఆ ప్రాంతంలో మిలటరీ రూల్‌ను ప్రకటించాల్సి వచ్చింది. 1921 ఆగస్టు 20న జిహాద్ ప్రారంభమైంది. 1922 జూన్ 30 దాకా యథేచ్ఛగా ఈ జిహాద్ కొనసాగుతూ వచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వ లెక్కల ప్రకారమే 20,800 మంది హిందువులు ఈ జిహాద్‌లో మృత్యువాత పడ్డారు. నాలుగు వేలకు పైగా హిందువులను బలవంతంగా మతం మార్పించారు. 2339 మంది మోప్లాలు హతమయ్యారు. బ్రిటిష్ వాళ్ల తూటాలకు 1652 మంది గాయపడ్డారు. 39,338 మంది జిహాదీలపై  కేసులు నమోదు కాగా, 24,167 మందిపై విచారణ జరిగింది. జిహాదీ తీవ్రత ఎలా ఉన్నదో.. ఎంత భయంకరంగా కొనసాగించారో తెలుసుకోవాలంటే.. జామోరిన్ మహారాజు కాలికట్ సమావేశాల ప్రొసీడింగ్స్ చదివితే సరిపోతుంది. సీ శంకరన్ నాయర్ రచించిన గాంధీ అనార్కీ గ్రంథంలోని 138 వ పేజీలోని భాగం ఇది.

‘That the conference views with indignation and sorrow the attempts made in various quarters by interested parties to ignore or minimise the crimes committed by the rebels such as

  1. Brutally dishonouring women;
  2. Flaying people alive;
  3. Wholesale slaughter of men, women and children;
  4. Burning alive entire families;
  5. Forcibly converting people in thousands and slaying those who refused to get converted;
  6. Throwing half dead people into wells and leaving the victims for hours to struggle for escape till finally released from their sufferings by death;
  7. Burning a great many and looting practically all Hindu and Christian houses in the disturbed area in which even Moplah women and children took part, and robbing women of even the garments on their bodies, in short reducing the whole non-muslim population to abject destitution;
  8. Cruelly insulting the religious sentiments of the Hindus by desecrating and destroying numerous temples in the disturbed area, killing cows within the temple precincts putting their entrails on the holy image and hanging the skulls on the walls and roofs.

మహిళలను క్రూరంగా అవమానించడం, మనుషుల్ని కాల్చి చర్మం వలిచేయడం, మూకుమ్మడి ఊచకోతలు, కుటుంబాలకు కుటుంబాలనే సజీవంగా దహనం చేయడం, బలవంతపు మతమార్పిళ్లు.. హిందువుల మత విశ్వాసాలను ఘోరంగా అవమానించడం, గోవధ చేసి గోవుల రక్తమాంసాలను దేవుడిపై చల్లి పుర్రెలను గోడలకు వేలాడదీశారు.

మహమ్మద్ బిన్ ఖాసిం కాలం నుంచి కూడా వాళ్లు ఇదే తరహా విధానాన్ని అనుసరిస్తున్నారు. ఏమాత్రం మార్పు లేదు. ఇవాళ సోకాల్డ్ కమ్యూనిస్టుల బాట కూడా ఇదే. హిందూ విశ్వాసాలను ఘోరంగా.. అవమానించడం.. వెటకరించడం.. దానికి రేషనలిజం అనే పేరు పెట్టుకోవడం..

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here