[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘పరుగు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ప్రి[/dropcap]యా..!
నిను వీడిన క్షణం నుండి
నా మదిలో నీ భావాలు
కదలాడుతున్నప్పుడు
నా కనులలో నీ ప్రతిరూపం
మెదులుతున్నప్పుడు
నా మస్తిష్కంలో నీ స్మృతులు
తిరుగుతున్నప్పుడు
ఎడబాటు ఎంత నరకమో
తెలుసుకున్నప్పుడు
నీ కోసం ప్రతి క్షణం అన్వేషిస్తున్నా..
నీ ప్రేమకై నిత్యం
పరుగులు తీస్తున్నా..