[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘నిశ్శబ్ద కాలం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]అం[/dropcap]కురించడం
అంతరించడం
అత్యంత సహజం
అది ప్రకృతి ధర్మం
వసంతమే సొంతం
కావాలనుకోవడం తప్పు
శిశిరాన్ని విసిరేసిన
కసి తీరా పలకరిస్తూనే ఉంటుంది
సంతోషాలూ సంతాపాలు
పక్కనే ఉంటాయి
దేని విలువ దానికి ఉంది
ఎగిరి గంతేసినా దిగాలుపడినా
కాలం మాత్రం నిశ్శబ్దంగా
సాగిపోతూనే ఉంటుంది