సినిమా క్విజ్-56

0
9

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. 1988లో బి. భాస్కరరావు దర్శకత్వంలో, ఇళయరాజా సంగీత దర్శకత్వంలో – రాజేంద్ర ప్రసాద్, రమ్యకృష్ణ, చరణ్ రాజ్, కోట శ్రీనివాసరావు, శుభలు నటించిన చిత్రం ‘ఆస్తులు – అంతస్తులు’. ఈ చిత్రం ఏ తమిళ చిత్రానికి రీమేక్?
  2. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో 2000 సంవత్సరంలో రాజశేఖర్, లయ నటించిన ‘మనసున్న మారాజు’ చిత్రం ఏ మలయాళ చిత్రానికి రీమేక్?
  3. రాజ్ కుమార్, జితేంద్ర, మాలా సిన్హా, రేఖ నటించగా 1978లో విడుదలైన హిందీ చిత్రం ‘కర్మయోగి’ని కృష్ణంరాజు, శారద, జయసుధలతో ఏ పేరున తెలుగులో రీమేక్ చేశారు?
  4. చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలో ఎం.జి. రామచంద్రన్, ఇ.వి. సరోజ నటించిన ‘ఎన్ తంగై’ (1952) అనే తమిళ చిత్రాన్ని తెలుగులో కె. హేమాంబరధరరావు గారి దర్శకత్వంలో, ఎల్.వి. ప్రసాద్ స్క్రీన్ ప్లేతో, కోటయ్య గారి ప్రత్యగాత్మ మాటలు రచించగా ఏ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు?
  5. ‘ది ప్రిన్స్ అండ్ పాపర్’ అనే హాలీవుడ్ చిత్రం ఆధారంగా దర్శక నిర్మాత బి.ఎ. సుబ్బారావు 1954లో ఎన్.టి.ఆర్., ఎస్.వి.ఆర్., లక్ష్మీరాజ్యం, మాస్టర్ సుధాకర్‍లతో తీసిన తెలుగు సినిమా పేరు?
  6. బి.ఎస్. రంగా దర్శకత్వంలో జె.వి. రమణమూర్తి, జమునలతో వచ్చిన ‘పెళ్ళి తాంబూలం’ చిత్రానికి సంగీతం అందించినది ఎవరు?
  7. ఆర్.ఆర్. పిక్చర్స్ పతాకంపై టి.ఆర్. రామన్న దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., సావిత్రి, కన్నాంబ, పద్మనాభం నటించిన ‘కార్తవరాయని కథ’ సినిమాకు సంగీతం అందించినది ఎవరు?
  8. హిందీ నటులు జితేంద్ర అసలు పేరు?
  9. దర్శకుడు వీరమాచనేని మధుసూదనరావు దర్శకత్వం వహించిన మొదటి తెలుగు చిత్రం ఏది?
  10. ప్రఖ్యాత హిందీ హాస్యనటి టున్ టున్ అసలు పేరు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 అక్టోబర్ 03 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 56 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 అక్టోబర్ 8 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 54 జవాబులు:

1.అక్కినేని నాగార్జున 2. కృష్ణకుమారి 3. అశ్వమేధం 4. కొంగర జగ్గారావు 5. టి.ఆర్. రాజకుమారి 6. రాజశ్రీ 7. పడువార హళ్ళి పాండవరు 8. వా రాజా వా 9. పెళ్ళికొడుకు 10. వాట్ ఎ గర్ల్ వాంట్స్

సినిమా క్విజ్ 53 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • సిహెచ్.వి.బృందావనరావు
  • మణి నాగేంద్రరావు బి.
  • రామలింగయ్య టి
  • సునీతా ప్రకాష్
  • వనమాల రామలింగాచారి
  • జి. స్వప్నకుమారి
  • ఎం. రేణుమతి
  • టి. మమన్ బాబు
  • దీప్తి మహంతి

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here