[యూరప్‍లో పలు దేశాలను సందర్శించి, తమ యాత్రానుభవాలను వివరిస్తున్నారు డి. చాముండేశ్వరి.]
రైన్ జలపాతం
మేము అందరం next day Basel BBS నుండి ట్రైన్‌లో జలపాతం చూడటానికి బయలుదేరాము. ప్రకృతి అందాలను చూస్తూ దూరంగా కనిపిస్తున్న వారి ఊర్లను చూస్తూ మా ప్రయాణం సాగింది.
రైన్ జలపాతానికి చేరుకోవడానికి సులభమైన మార్గం రైలులో నదికి అవతలి వైపున ఉన్న ‘న్యూహౌసెన్ రైన్‌ఫాల్’ లేదా ‘స్క్లోస్ లౌఫెన్ యామ్ రైన్‌ఫాల్’ అనే స్టేషన్‌కు వెళ్లడం. రెండు స్టేషన్లు జలపాతం పక్కనే ఉన్నాయి.
ఇవి చాలా చిన్న స్టేషన్లు. వాటిని ఆనుకునే నివాసాలున్నయి. స్టేషన్‌లో ట్రైన్ దిగాక return journey కి ట్రైన్ ఎటువైపు ఎక్కాలో చూసుకుని వాటర్ ఫాల్ వైపు నడకసాగించాము.
సంప్రదాయ నిర్మాణ శైలిలో ఉన్న ఇండ్లను చూస్తూ ముందుకు నడిచాము.
అక్కడ హోటల్స్, stalls లాంటివి ఉన్నాయి. కానీ అవి క్లోజ్ చేసున్నాయి. బహుశా ఆఫ్ టూరిస్ట్ సీజన్. పర్యాటకులు కూడా చాలా తక్కువ కనపడ్డారు.
కిందకి దిగేసరికి తెల్లగా నురగలు కక్కుతూ పరవళ్ళు తొక్కే జలపాతం కనపడింది.
పెద్ద catchment basin ఉంది. చుట్టూ చక్కగా ఫెన్స్ చేసింది. జలపాతం చూస్తూ close angle చూసుకుని ఫొటోస్ తీసుకున్నాము.
ఫ్రీజింగ్ విండ్స్‌కి షివర్ అవుతూ జలపాతపు నీటి తుంపరులు ఆస్వాదిస్తూ గడిపాము. Lunch time అయింది. ఆకలి అంటూ పరి అడిగింది. అక్కడే ఉన్న ఒక హోటల్‌లో ఫుడ్ order చేసి పరిసరాలు ఎంజాయ్ చేస్తూ తిన్నాము.
దాదాపు 2-3 గంటలు గడిపి next train లో తిరిగి Basel city కి వచ్చాము.
ఈ జలపాతం 150 మీటర్ల వెడల్పు మరియు 23 మీటర్ల ఎత్తు. ఇది ఐరోపాలోని అతిపెద్ద జలపాతాలలో ఒకటి. ఇక్కడ పడవ ప్రయాణాలు మరియు రొమాంటిక్ ల్యాండ్‌స్కేప్ చుట్టూ నడవడం వంటి అనేక పర్యాటక కార్యకలాపాలు జరుగుతాయి.
చలికాలంలో ఇక్కడ నీటి ప్రవాహం తక్కువగా ఉంటుంది.
వేసవి నెలలు అత్యధిక ప్రవాహం రేటును కలిగి ఉంటాయి. ఈ సమయంలో రైన్ నది ఆల్పైన్ మంచు కరుగుతుందిట.
జలపాతాన్ని చూడటానికి అనేక వ్యూ పాయింట్‌లు ఉన్నాయి.
చాలా మంది పర్యాటకులు పడవ ఎక్కి జలపాతానికి చేరుకుంటారు, మరికొందరు ప్లాట్‌ఫారమ్‌పై ఉండేందుకు ఇష్టపడతారు.
మేము వెళ్ళినప్పుడు boats available లేవు.
మేము వెళ్ళిన టైం లో Swiss లో స్నో మీద స్కీయింగ్‌కి ఎక్కువగా పర్యాటకులు వెళ్తారట.
జలపాతానికి సమీపంలో రెండు కోటలు ఉన్నాయి. లాఫెన్ కాజిల్ నది యొక్క ఎడమ ఒడ్డున మరియు కుడి ఒడ్డున వర్త్ కాజిల్ ఉంది.
జలపాతపు ప్రవాహం మధ్యలో Swiss German flags ఉంటాయి.
చల్లని శీతల గాలులు గిలిగింతలు పెడుతుంటే జలపాతపు అందాలు చూసి ఆనందించాం.
Photos: Mr. D. Nagarjuna
(వచ్చే వారం కలుద్దాం)