అక్షరమై నీతో

1
8

[box type=’note’ fontsize=’16’] “తీవెనై పూలు పూసి నీ కనుల కళ నేనైనా మోవినై నీ మాటలు వినిపించాలని ఉంది” అంటున్నారు రాజావాసిరెడ్డి మల్లీశ్వరిఅక్షరమై నీతో” కవితలో. [/box]

 

[dropcap]అ[/dropcap]క్షరమై నీతో నే నిలవాలని ఉంది
లక్షణంగ నీతో కలిసుండాలని ఉంది

మది మౌనమైనా
ఆనందం పాట నేనైనా
ఆపలేని ఆత్మ సొదను
తెలపాలని ఉంది

తీవెనై పూలు పూసి
నీ కనుల కళ నేనైనా
మోవినై నీ మాటలు
వినిపించాలని ఉంది

శిశిర సౌందర్యమై నే
నీ ముందు నిలచినా
తీపి జ్ఞాపకమై నీలో
మెరవాలని ఉంది

ప్రేమంటే ఇదని నీకు
తెలియలేదుగా మళ్ళీ
వీడని గంధమై నిన్ను
అలుముకోవాలని ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here