దేశ విభజన విషవృక్షం-60

0
4

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]మ[/dropcap]నం రోహింగ్యాల గురించి ఈ మధ్య కాలంలో చాలా విన్నాం. మయన్మార్ నుంచి.. బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున ఈ దేశంలోకి చొచ్చుకొచ్చిన ముస్లింలు. వాళ్లను తిరిగి వాళ్ల దేశాలకు పంపించాలని కొందరు.. లేదు.. వాళ్లను ఇక్కడే ఉంచాలని సెక్యులరిస్టులు రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇంతకీ ఈ రోహింగ్యాలు ఎవరో తెలుసా? తొమ్మిదో శతాబ్దంలో భారత భూభాగంలోకి శరణార్థులుగా వలస వచ్చిన ముస్లింలు. దాదాపు 15 ముస్లిం మిషనరీలు భారతదేశానికి వచ్చి.. అప్పుడున్న రాజులను శరణుజొచ్చారు. తాము ప్రార్థనలు జరుపుకోవడానికి కొంత చోటు కల్పించాలని కోరారు. అప్పటి రాజులు దయతో వారికి చోటు కల్పించారు. బర్మా (ఇప్పటి మయన్మార్), బంగ్లాదేశ్, మలబార్ ప్రాంతాలకు వచ్చిన ఈ ముస్లిం మిషనరీలు పది మసీదుల నిర్మాణంతో తమ అతివాద మత ప్రచారాన్ని ప్రారంభించారు. మోప్లా జిహాద్ నాటికి వారి సంఖ్య 60 శాతానికి చేరుకొన్నది. మోప్లా అల్లర్లలో పెద్ద ఎత్తున ఈ రోహింగ్యాలు పాల్గొన్నారు. ఇవాళ వీళ్లను వెనక్కి పంపవద్దని మన సెక్యులర్ మహానుభావులు వాదిస్తారు. అందుకే.. ఘర్ వాపసీని ప్రోత్సహించాలని చెప్పేది. దేవాల్ ఋషి నుంచి ఇప్పటి వరకు కూడా ఘర్ వాపసీని ప్రోత్సహించాల్సిందేనని చెప్పడానికి కారణం మన జాతిని రక్షించుకోవాలనే.. మన డెమోగ్రఫీ ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకుండా చూసుకోవాలి. ఈ దేశంలో జై శ్రీరాం అని నినదించే ఒక్కరు మిగిలినా.. ఈ జాతి మిగులుతుందన్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. అల్లాహో అక్బర్ అన్న నినాదంతో కొనసాగిన ఖిలాఫత్.. మోప్లా జిహాద్.. అత్యంత దారుణాలకు దారి తీసింది. ముందే చెప్పుకొన్నట్టు 20 వేల మందికి పైగా మత మార్పిళ్లు జరిగాయి. దాదాపు లక్ష మంది హిందువులు కట్టు బట్టలతో తమ ఇల్లూ వాకిళ్లూ వదిలి బతుకుజీవుడా అంటూ పారిపోవాల్సి వచ్చింది. మీరు గుర్తుంచుకోండి.. 1947లో పాకిస్తాన్ ఏర్పడ్డ తరువాత కూడా ఇదే దృశ్యం పునరావృతమైంది. సేమ్ టు సేమ్.. ఏమీ తేడా లేదు. ఇస్లాం వైభవం కోసం హీరోలు పోరాడుతున్నారు అని అలీ సోదరులు వారిని కొనియాడారు. ‘Brave god fearing people fighting for religion. In a manner they consider religious’ అని ఎంకే గాంధీ గారు వ్యాఖ్యానించారు. ముసల్మానులంటేనే ఇన్‌ఫీరియర్‌గా గాంధీజీ ఫీలవుతున్నారని 1924లో మౌలానా మహమ్మద్ అలీ అన్నారంటేనే.. గాంధీజీ ఎలాంటి భ్రమల్లో ఉండినారో అర్థం చేసుకోవచ్చు. మోప్లా జిహాద్ మోహర్రం ఊరేగింపుల్లో మొదలయింది. పంజాబ్, బెంగాల్, అమృత్‌సర్, పానిపట్, మొరాదాబాద్, మీరట్, అలహాబాద్, గుల్బర్గా, సహ్రాన్ పూర్, భాగల్పూర్, ఢిల్లీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. దుర్గాపూజ, రామ్ లీల మండపాలన్నింటినీ ఏరి ఏరి ధ్వంసం చేశారు. వేలాది హిందువులు ఈ అల్లర్లకు బాధితులయ్యారు. మహిళల సంగతైతే చెప్పనే అక్కరలేదు. 1924 సెప్టెంబర్ 1 న కోహాట్ (ప్రస్తుతం పాకిస్తాన్ లోని నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్‌లో ఉన్నది) లో హిందువుల జనాభా ఉన్నదే 5 శాతం. వాళ్లందరి మీద జిహాదిస్టులు విరుచుకుపడ్డారు. వారిని పూర్తిగా ఎలిమినేట్ చేశారు. ప్రతి ఇంటినీ.. మీద పడి దోచుకొన్నారు. ఉన్న ఆ కొద్ది మంది హిందువులు చెట్టుకొకరు పుట్టకొకరుగా పారిపోయారు. 155 మందిని దారుణంగా హతమార్చారు. మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టారు. 3200 మంది హిందువులు దాదాపు 320 కిలోమీటర్లు పారిపోయి.. రావల్పిండి శరణార్థి శిబిరాల్లో తల దాచుకొన్నారు. వీళ్లు సిక్కులను కూడా వదిలిపెట్టలేదు. మసీదు నుంచి ప్రదర్శనగా వెళ్లుతున్న సిక్కులపై పెద్ద ఎత్తున మారణాయుధాలతో దాడి చేసి అనేక మందిని హతమార్చారు. 1905 నుంచి 1947 వరకు కూడా ఈ మారణకాండ ఆగలేదు. మోప్లా జిహాద్ సమయంలోనే (1922-23 మధ్యకాలం) పంజాబ్, బెంగాల్, యూపీలలో దాదాపు 20 వేల మంది హతమైనట్లు అంచనా. 1926లో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్‌లో 200 మంది హతమయ్యారు. 975 మంది గాయపడ్డారు. 1928లో బొంబాయిలో 400 మంది చనిపోయారు. 740 మంది గాయపడ్డారు. 1931లో కాన్పూర్ లో 400 మంది చనిపోయారు. 1200 మంది గాయపడ్డారు. 1932లో బొంబాయిలో 217 మంది చనిపోయారు. 2570 మంది గాయపడ్డారు. ఇలా చాలా పెద్ద పెద్ద సంఖ్యలో మారణకాండ జరిగిన గణాంకాలు ఎన్నో ఉన్నాయి. కానీ.. ఇప్పుడు మన చరిత్రకారులెవ్వరూ కూడా ఈ విషయాన్ని చెప్పరు. తమ కన్వీనియంట్‌గా వీటిని ఇగ్నోర్ చేస్తారు. పైగా హిందువుల్లో సనాతన ధర్మం అలా అన్నది.. కుల వ్యవస్థ ఉన్నది.. మత వ్యవస్థ ఉన్నది.. వర్ణ వ్యవస్థ ఉన్నది… వీటిని అద్భుతంగా ఉద్ధరించాలంటూ ముంజేతులకు కంకణాలు కట్టుకొని.. నోళ్లకు మైకులు పెట్టుకొని ఊరేగుతుంటారు. మతాలు.. సామరస్యమూ.. ఐక్యత అని మాట్లాడతారు.  ఈ విదేశీ మతాలు పెచ్చరిల్లక ముందు ఈ దేశం ఎట్లున్నది.. ఆ తరువాత ఏమైందన్న ఆలోచన ఎవరూ చేయరు. వాళ్లకు ప్రశ్నించడం తప్ప జవాబులు రావు. ఎందుకంటే.. అఫెన్స్ మోడ్‌లో ఉంటేనే.. వారికి మనుగడ.. హిందూయిజాన్ని ప్రమోట్ చేసే నాయకులు మాత్రం నిరంతరం సంజాయిషీలు ఇచ్చుకొంటూ ఉంటారు.

మరోవైపు బ్రిటిష్ పాలకులు సైతం.. తమ ఆధిపత్యానికి అడ్డొచ్చినంత వరకు మాత్రమే ముస్లింలను అడ్డుకొన్నారే తప్ప.. ఇతర విషయాల్లో కాదు. ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను. 1930లో  బ్రిటిష్ సైనికాధికారులు మస్టర్డ్ (ఆవాలు) గ్యాస్ చాంబర్లు ఏర్పాటు చేశారు. ఈ చాంబర్లలోకి హిందూ జవాన్లను పంపించి వారిపై ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాలు రావల్పిండిలో జరిగాయి. సైనికులు షార్టులు, కాటన్ షర్టులు వేసుకొని చాంబర్లలోకి వెళ్లేవారు. వీటిలోకి వెళ్లిన వారంతా విపరీతంగా మంటలతో, తీవ్రమైన సైడ్ ఎఫెక్టులతో బాధపడ్డారు. మనుషులపై రసాయన ఆయుధాలు ఎలా పనిచేస్తాయో పరీక్షించడానికి ఈ ప్రయోగాలు చేశారు. ఇందులో ఒక్క ముస్లిం సైనికుడు కూడా లేకపోవడం యాదృచ్ఛికమని నాకైతే అనిపించడం లేదు. ఇది అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ కారకంగా పరిణమించింది. ప్రపంచంలో ఊహించని రోగాలు.. మందులకు లొంగని రోగాలు ఎందుకు వస్తాయంటే ఇదిగో ఇలాంటి భయంకరమైన ప్రయోగాలవల్లనే.. నాడు క్యాన్సర్ కావచ్చు.. తరువాత మలేరియా, డెంగీలు కావచ్చు.. ఎయిడ్స్ కావచ్చు.. నిన్నమొన్నటి కరోనా కావచ్చు.. అగ్రదేశాలు అనుకొనే దేశాలు చేసే జీవరసాయన ఆయుధాల ప్రయోగాల ఫలితమేనన్నది నిర్వివాదం. రావల్పిండిలోని బ్రిటిష్ శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాలు చేశారు. దాదాపు పదేళ్ల పాటు ఈ ప్రయోగాలు దశలవారీగా జరిగాయి. రెండో ప్రపంచయుద్ధంలో రణరంగంలో ఈ ప్రమాదకరమైన గ్యాస్‌ను ప్రయోగించడానికి తగిన మోతాదును నిర్ణయించడం కోసం ఈ పరీక్షలు జరిగాయి. చాలామంది సైనికులు తీవ్రమైన అనారోగ్యానికి గురై దవాఖానల బారిన పడ్డారు. రావల్పిండిలో ప్రస్తుతం మిలటరీ హాస్పిటల్‌గా పిలుస్తున్న నాటి బ్రిటిష్ సైనిక ఆసుపత్రిలో వారిని చేర్పించారు. కాలిన మంటలు.. మానసిక ఆందోళన.. శరీరంపై అనూహ్యమైన భౌతిక పరిణామాలు.. ఇవన్నీ కూడా మన సైనికులపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. కానీ.. ఈ పరీక్షల ఫలితం, ప్రభావం ఏమిటన్నది బ్రిటిష్ వాళ్లు ఎక్కడా కూడా రికార్డు చేయకుండా జాగ్రత్త పడ్డారు. గ్యాస్ చాంబర్ల జాడ కూడా తెలియకుండా ధ్వంసం చేశారు. హిందువులపై అన్ని వైపుల నుంచి పదిహేను వందల ఏండ్ల నుంచి నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి.

1932లో బ్రిటిష్ పాలకులు కమ్యూనల్ అవార్డును ప్రకటించారు. దీని ప్రకారం ప్రత్యేక ఎలక్టోరేట్లు పుట్టుకొచ్చాయి. ముస్లింలు, యూరోపియన్లు, సిక్కులు, ఇండియన్ క్రిస్టియన్లు, ఆంగ్లో ఇండియన్లు, వీరితో పాటు అణగారిన వర్గాల కోసం ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పరుస్తూ అప్పటి ప్రధానమంత్రి రామ్ సే మెక్ డొనాల్డ్ ప్రకటన చేశారు. హిందూ మెజారిటీ ప్రావిన్సులైన మద్రాస్, బాంబే, ఉత్తర ప్రదేశ్, అస్సాం, బీహార్, ఒరిస్సా, పంజాబ్, బెంగాల్ తదితర ప్రాంతాల్లో ముస్లిం ప్రతినిధిత్వాన్ని పెంచాలని మహమ్మద్ అలీ జిన్నా చేసిన ప్రతిపాదనలన్నింటినీ మెక్ డొనాల్డ్ ఆమోదించారు. జిన్నా చేసిన 14 పాయింట్ల ప్రతిపాదనలు ఇవీ..

  1. Federal constitution with residual powers with the provinces.
  2. Provincial autonomy.
  3. No constitutional amendment without the agreement of the states.
  4. All legislatures and elected bodies to have adequate Muslim representation without reducing Muslim majority in a province to minority or equality.
  5. Adequate Muslim representation of Muslims in the services and in self-governing bodies.
  6. ⅓ rd representation of Muslims in the Central Legislature.
  7. ⅓ rd Muslim members in the central and state cabinets.
  8. Separate electorates.
  9. No bill to be passed in any legislature if ¾ th of a minority community considers it against its interests.
  10. Any reorganization of territories not to affect the Muslim majority in Bengal, Punjab and the NWFP.
  11. Separation of Sindh from Bombay Presidency.
  12. Constitutional reforms in the NWFP and Baluchistan.
  13. Full religion freedom for all communities.
  14. Protection of the religious, cultural, educational and language rights of Muslims.

బొంబాయి ప్రావిన్సులో భాగంగా ఉన్న సింధ్ ప్రాంతాన్ని ప్రత్యేక ప్రావిన్సుగా విభజిస్తూ మెక్ డొనాల్డ్ నిర్ణయం తీసుకొన్నారు. దీంతో ఆ ప్రావిన్స్ మొత్తం ముస్లిం మెజార్టీ ప్రావిన్సుగా మారి హిందువులు మైనార్టీ అయిపోయారు. ఫలితం ఎప్పటిలాగే మత కల్లోలాలు.. హిందువులు ఆ ప్రాంతాన్ని విడిచి పారిపోవడం.. ఇలా పూర్తి స్థాయి ముస్లిం ప్రావిన్సుగా సింధ్ 1936 ఏప్రిల్ 1న అవతరించింది. బ్రిటిష్ వారి కమ్యూనల్ అవార్డును తిరస్కరించాల్సిందిగా హిందూ ప్రతినిధులు గాంధీ గారిని కోరారు. అప్పటికే 1931 కరాచీ సదస్సులో కాంగ్రెస్ పార్టీ ముస్లింల హక్కులను రక్షించాలని, వాళ్ల భాష, లిపి, సంస్కృతిని కాపాడి అభివృద్ధి చేయాలని తీర్మానం చేసింది. భారతదేశంలోని సమస్యలను తీర్చే చర్యగా మెక్ డొనాల్డ్ తన చర్యను సమర్థించుకొన్నారు. కానీ జాతీయవాదులు మాత్రం ఈ చర్య హిందూ సమాజంలో తీవ్రమైన పూడ్చరాని చీలిక తెస్తుందని తీవ్రంగా ఆందోళన చెందారు. ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాల ఏర్పాటును గాంధీగారు అంగీకరించారు. కానీ.. హిందూ సమాజంలో కులాలవారీగా ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటును ఆయన వ్యతిరేకించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పుణె లోని యెరవాడ జైల్లో ఉన్న గాంధీగారు అక్కడే నిరాహార దీక్ష చేపట్టారు. బ్రిటిష్ వారి నిర్ణయాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సంపూర్ణంగా స్వాగతించారు. అయితే.. గాంధీ గారి నిరాహార దీక్షతో పాటు.. అంబేద్కర్ చర్చల ఫలితంగా దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల ప్రతిపాదనను బ్రిటిష్ వారు వదిలిపెట్టారు. అదే సమయంలో దళితులకు కొన్ని సీట్లు రిజర్వ్ చేయాలని అంగీకారానికి వచ్చారు. మన దేశంలో రిజర్వేషన్లకు బీజం పడింది ఇక్కడే. ఒక రకంగా చట్ట సభల్లో మొదలైన రిజర్వేషన్లు.. స్వాతంత్ర్యం వచ్చేనాటికి విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లోనూ విస్తరించాయి. ఇవాళ 50 శాతం రిజర్వేషన్లు భారతదేశంలో అమలవుతున్నాయి.

1932లో బ్రిటిష్ ప్రధాని మెక్ డొనాల్డ్ తీసుకొన్న ఈ నిర్ణయం.. బ్రిటిష్ వాళ్లు దేశం విడిచి వెళ్లిపోయిన 75 ఏండ్ల తరువాత కూడా రాజకీయ అధికారానికి అత్యంత ప్రధానమైన మెట్టుగా పనిచేస్తున్నది. స్వాతంత్ర్యం తరువాత ప్రత్యేక నియోజక వర్గాల వ్యవస్థ కనుమరుగైనప్పటికీ.. రిజర్వేషన్ల వ్యవస్థ మాత్రం కొనసాగుతూనే ఉన్నది. ఈ రిజర్వేషన్ల వ్యవస్థ అణగారిన వర్గాలను ఉన్నతీకరించడం కోసం ఉద్దేశించనప్పటికీ.. దాని ప్రయోజనం మాత్రం సిద్ధించలేదు. కాలక్రమంలో సామాజిక అంతరాలు తగ్గుముఖం పట్టినవి తప్ప వారిలో కొందరు మాత్రమే ఆర్థిక ఉన్నతి సాధించారు. ఈ రిజర్వేషన్ల కారణంగా రిజర్వేషన్లు లేని వర్గాల్లో పేదలు అన్ని అవకాశాలు పోగొట్టుకొని తీవ్రమైన అగచాట్లు పడాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఈ రిజర్వేషన్ల కారణంగా కుల మతాలతో సంబంధం లేకుండా నైపుణ్యానికి, ప్రతిభకు పెద్ద పీట వేయాల్సిన చోట.. కొంత రాజీపడటంతో ప్రభుత్వ రంగ వ్యవస్థల పనితీరు మూలన పడింది. విద్య, వైద్య రంగాల్లో అందరినీ ఉన్నతీకరించడం ప్రభుత్వాల బాధ్యత. కానీ ఉద్యోగాల రంగంలో కూడా మెరిట్ విషయంలో రాజీ పడటం వల్ల పరిపాలన సమర్థంగా చేయలేక కుంటుపడుతున్నది. అన్నింటికీ మించి.. ఈ రిజర్వేషన్లు భారతీయ సమాజాన్ని అత్యంత దారుణంగా ముక్కలు చెక్కలు చేసింది. ఇవి ఎప్పటికీ అతుకలేనంతగా ముక్కలైపోయాయి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here