న్యూయార్క్‌లో మేలుకొలుపు

0
3

[మాయా ఏంజిలో రచించిన ‘Awaking in New York’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]

(క్షణమైనా కంటిరెప్ప వాలుస్తుందా అన్నట్టుండే న్యూయార్క్ నగర జీవితాన్ని దృశ్యమానం చేస్తుందీ కవిత!)

~

[dropcap]కి[/dropcap]టికీ తెరలు వాటి ఇష్టానికి వ్యతిరేకంగా
బలమైన గాలికి ఎగురుతున్నాయి
పిల్లలేమో
అందమైన రెక్కల దేవకన్యలతో
తమ కలలని పంచుకుంటూ
మంచి నిదురలో ఉన్నారు
సబ్ వే అంచుల దాకా
సాగిన న్యూయార్క్ నగరం
తనను తాను మేల్కొలుపుకొని ఉంచుకుంటుంది
………………
ఎవరూ ఏమీ అడగని
ఎక్కడ్నించీ ఏమీ వినబడని
ఈ మంచు కురిసే తెలవారు ఝామున
యుద్ధపు పుకార్లు విన్న
అలారం గడియారం వలె
నేను మాత్రం ఇలా
మెలకువతో ఉండిపోయాను!!

~

మూలం: మాయా ఏంజిలో

అనువాదం: హిమజ


మాయా కవిత్వంలో ప్రేమ, దూరం, కోల్పోవడం, ఒంటరితనం, కుటుంబం మాత్రమే  కాకుండా, జాత్యహంకారం వలన తాను, ఆఫ్రికన్ ప్రజలు అనుభవించిన వ్యథలు, ఇవన్నీ చోటు చేసుకున్నాయి. ఏమి రాసినా వ్యక్తిగతంగా తన అనుభవాలే కాకుండా ప్రజానీకపు ఆర్తనాదాల గొంతుక తానై రచనలు చేసింది మాయా. “People will forget what you did, but people will never forget how you made them feel”అని తరచూ చెబుతుండేది మాయా.

“My mission in like is not merely to survive, but to thrive; and to do so with some passion, some compassion, some humor and some style” అని బలంగా చెపుతుండేది.

మాయా కవితలు ఒక వినసొంపైన పాటలాగా మంచి అభివ్యక్తితో ఉంటాయి. నాటకీయంగాను, వ్యక్తిగత స్పర్శతోను, శక్తివంతంగాను ఉంటాయి. విఫల ప్రేమలు, మనుషులు దూరం అవడం, విడిపోవడం, వారాంతపు రాత్రుళ్ళ వేడుకలు, నగర జీవితపు హోరు, శిథిలస్వప్నాలు, లేని స్వేచ్ఛ, పొందాల్సిన స్వేచ్ఛ గురించి మాయా కవితలు మాట్లాడతాయి.

మాయా రాసిన కథలు కవితలన్నీ – వివేకం, విచక్షణ, హాస్యచతురత, ధైర్యసాహసాలు, దయార్ద్రతతో కూడిన కానుకలు అని ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ కొనియాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here