[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘కయ్యూరు బాలసుబ్రమణ్యం నానీలు 9’ అనే కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]క[/dropcap]లం
కత్తెరగా మలిస్తేనే
జబ్బు పడ్డ వ్యవస్థకు
శస్ర్తచికిత్స
రాతికి
జీవం ఉంటుంది
మనసు పెట్టి
శిల్పంగా మలిచి చూడు
ఉదయానికి
స్పృహ ఎక్కువ
ఎన్ని హృదయాలని
మేల్కొలుపుతుంది!
పుస్తక పుటలలో
అక్షర కాంతి
ఎన్ని జీవితాలకి
వెలుగిస్తుందో!
ఎప్పుడు
ఒంటరినని అనుకోకు
నీ అంతర్ముఖం
నీతోనే
జీవితంలో
ఎన్ని మెట్లెక్కినా
క్రింది మెట్టును
మరచిపోకు