సినిమా క్విజ్-58

0
3

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. 1967లో సి.వి. శ్రీధర్ దర్శకత్వంలో అశోక్ కుమార్, రాజ్ కుమార్, బిశ్వజీత్, మాలా సిన్హా, తనూజలు నటించిన ‘నయీ రోష్నీ’ అనే హిందీ చిత్రాన్ని తెలుగులో ఎన్.టి.రామారావు, శోభన్ బాబు, హరనాథ్, భానుమతి, కృష్ణకుమారిలు నటించగా ఏ పేరుతో రీమేక్ అయింది?
  2. ప్రదీప్ కుమార్, అశోక్ కుమార్, షకీలా, షేక్ ముఖ్తార్ నటించిన ‘ఉస్తాదోంకా ఉస్తాద్’ (1963) చిత్రాన్ని తెలుగులో ఎస్.డి.లాల్ దర్శకత్వంలో ఎస్.వి.రంగారావు, హరనాథ్, కృష్ణకుమారిగార్లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  3. అడ్డాల నారాయణరావు దర్శకత్వంలో కృష్ణ, జమున, ఎస్.వి.రంగారావు, రేలంగి, గరికపాటి వరలక్ష్మిలతో తీసిన ‘అమాయకుడు’ సినిమా ఏ హిందీ చిత్రానికి రీమేక్?
  4. 1961లో వచ్చిన బెంగాలీ చిత్రం ‘మధ్య రాతేర్ తారా’ ఆధారంగా హిందీలో బిశ్వజీత్, మాలా సిన్హాలతో ‘ఆస్రా’ (1966) అనే సినిమా తీశారు. ఈ చిత్రం ఆధారంగా తెలుగులో తాతినేని రామారావు దర్శకత్వంలో హరనాథ్, జమునలతో 1968లో తీసిన సినిమా ఏది?
  5. ఎ.వి. శేషగిరిరావు దర్శకత్వంలో శ్రీనాథ్, మంజుల, లోకేష్, పద్మప్రియలు నటించిన ‘పట్టణక్కె బంద పత్నియరు’ (1980) అనే కన్నడ చిత్రాన్ని తెలుగులో మౌళి దర్శకత్వంలో చిరంజీవి, మోహన్ బాబు, రాధిక, గీతలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  6. కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘సత్తెకాలపు సత్తెయ్య’ చిత్రం కన్నడంలో ద్వారకేష్, మంజుల, శ్రీనాథ్, పద్మప్రియలతో ఏ పేరిట రీమేక్ అయింది?
  7. కృష్ణ, సుమన్, నరేష్, రాధిక, శివాజీ, జయప్రదలు నటించిన ‘చంద్రవంశం’ (2002) – అంబరీష్, విష్ణువర్ధన్ నటించిన ఏ కన్నడ చిత్రానికి రీమేక్?
  8. కన్నడ, తెలుగు చిత్రాల సంగీత దర్శకుడు జి. కె. వెంకటేష్ పూర్తి పేరు?
  9. 1967లో కాంతారావు, వాణిశ్రీలతో దర్శకుడు హుణునూరు కృష్ణమూర్తి తీసిన తెలుగు జానపద చిత్రం ఏది? (క్లూ: ఇదే సినిమాను కన్నడభాషలో రాజ్‌కుమార్, జయంతి జంటగా ఏకకాలంలో నిర్మించారు)
  10. 1992లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో మీనా, సురేష్, చిన్నాలు నటించిన ‘అల్లరిపిల్ల’ చిత్రానికి మూలమైన మలయాళ చిత్రం ఏది?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 అక్టోబర్ 17 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 58 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 అక్టోబర్ 22 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 56 జవాబులు:

1.ముథల్ వసంతం 2. కొట్టరమ్ వీట్టిల్ అప్పటన్ (1998) 3. నిప్పుతో చెలగాటం (1982) 4. ఆడపడుచు (1967) 5. రాజు – పేద 6. విశ్వనాథన్ – రామమూర్తి 7. జి. రామనాథన్, అశ్వత్థామ 8. రవి కపూర్ 9. సతీ తులసి 10. ఉమాదేవి ఖత్రీ

సినిమా క్విజ్ 56 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • మణి నాగేంద్రరావు. బి
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సునీతా ప్రకాష్
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • తాతిరాజు జగం‌

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here