[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘నీ కోసం ప్రియా..!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]నా[/dropcap] అక్షరాలు
నీ అక్షములలో
నిక్షిప్తం కావాలని
నా పదాలు
నీ పెదాలలో
సదా సేద తీరాలని
నా వాక్యాలు
నీ బిగి కౌగిలిలో
ఉక్కిరి బిక్కిరి కావాలని
నా కవనాలు
చల్లని పవనాలై
నీ హృదయాన్ని తాకాలని
ప్రేమ సిరా నింపుకుని
రాస్తున్నా.. స్వీకరించు ప్రియా..!