[dropcap]బొం[/dropcap]దల నాగేశ్వరరావు గారు వ్రాసిన 20 కథల సంపుటి “విశ్రాంతి కావాలి”.
***
“ఈ సంపుటిలోని కథలన్నీ మన చుట్టూ మసలే సాధారణ మనుషుల గురించీ, వారి చిత్త వృత్తుల గురించీ, వారి ప్రవర్తన గురించీ, వారి వారి స్వభావాలలోని వైచిత్రి గురించీ చెబుతాయి.
నాగేశ్వరరావు గారి కథల్లో ఉత్తమ మానవతా విలువల పరిరక్షణ పట్ల గాఢమైన శ్రద్ధ కనిపిస్తుంది. మానవ సంబంధాల్లో ఆత్మీయత, కరుణ, జాలి, దగ్గరితనం, మమతల కలబోత ఉండాలనే శ్రేయోదాకయమైన సాంద్రమైన చల్లని మనసు మన కనుల్ని చెమరింపజేస్తుంది. కథా ప్రయోజనం ఇంతకంటే ఏమున్నది కనుక?!అందుకనే, నాగేశ్వరరావు గారు ఎక్కువగా మంచి కథలు రాశారనే ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాను” అన్నారు విహారి గారు తాము వ్రాసిన ‘మన్నికగొన్న కథలకు మున్నుడి’ అనే ముందుమాటలో.
***
“శ్రీ బొందల నాగేశ్వరరావు గారు రచించిన, జనని ప్రచురణలు చెన్నై ప్రచురించిన “విశ్రాంతి కావాలి” అనే కథా సంపుటిలో మొత్తం 18 పెద్ద కథలు రెండు బుల్లి కథలు వున్నాయి. ఏ కథ నేల విడిచి సాము వేయలేదు. కొన్ని కథల్ని ‘నడిపించాలి’. కొన్ని వాటంతట అవే నడుస్తూ తమవెంట మనని నడిపిస్తాయి. బొందల నాగేశ్వరరావు కథలు రెండో కోవకు చెందినవి. అభినందించవలసింది ఏమంటే, రచయిత తాను చూసిన, తన అనుభవంలో వున్న సంఘటనలనే కథలుగా మార్చారే కాని ఊహా లోకంలో విహరించలేదు” అన్నారు భువనచంద్ర తమ ‘నా మాటలతో…’ అనే ముందుమాటలో.
***
జనని ప్రచురణలు, చెన్నై వారు ప్రచురించిన ఈ “విశ్రాంతి కావాలి” కథా సంపుటి పేజీలు: 108. వెల: రూ.120/-
ప్రతులకు:
- బొందల నాగేశ్వరరావు, సుందరి నివాస్, నెం. 31, వాసుకి నగర్, 1వ వీధి, కొడుంగైయూర్, చెన్నై-600118. ఫోన్: 095000 20101
- గుడిమెట్ల చెన్నయ్య, 13/53, రెండవ వీధి, కొడుంగైయూర్, చెన్నై-600118 ఫోన్: 097907 83377