యూరప్ పర్యటనలో అందాలూ అనుభవాలూ ఆనందాలూ-14

0
3

[యూరప్‍లో పలు దేశాలను సందర్శించి, తమ యాత్రానుభవాలను వివరిస్తున్నారు డి. చాముండేశ్వరి.]

ఆమ్‍స్టర్‍డామ్ సిటీ

[dropcap]ఆ[/dropcap]మ్‌స్టర్‌డ్యామ్ సెంట్రల్ ఆమ్‌స్టర్‌డామ్‌లోని అతిపెద్ద రైల్వే స్టేషన్, దేశంలో రెండవ అత్యంత రద్దీగా ఉండే స్టేషన్ (ఉట్రెచ్ట్ అత్యంత రద్దీగా ఉండే స్టేషన్) మరియు దేశంలో అత్యధికంగా సందర్శించే రిజ్‌క్స్‌ మాన్యుమెంట్.

ఆమ్‌స్టర్‌డామ్ సెంట్రల్‌ను బయటి నుండి చూసినట్లయితే, ఎందుకు అని మీకు అర్థం అవుతుంది. ఇది డచ్ వాస్తుశిల్పి పియరీ క్యూపర్స్ చేత గోతిక్ మరియు పునరుజ్జీవనోద్యమ పునరుజ్జీవన శైలుల కలయికతో నిర్మించిన గంభీరమైన భవనం.

మేము ట్రైన్‌లో ట్రావెల్ చేసినందున మాకు ఈ స్టేషన్ బయట నుంచి చూసే అవకాశం కలిగింది. యూరోపియన్ శైలితో ఆకర్షించింది.

ఇక్కడి ఇంకో పర్యాటక ఆకర్షణ వారి నైట్ సిటీ లైఫ్. రెడ్ లైట్ ప్రాంతం.

మొదట ఆ పేరు వినగానే కొంత తెలియని ఆందోళన, ఇబ్బందిగా అనిపించింది. Hotel వారు మా ప్రశ్నార్థక మొహాలు చూసి ఎలాంటి ఇబ్బంది ఉండదని, సురక్షితమైన పర్యాటక ప్రాంతమని అన్నారు.

చూద్దాం లే అనుకుని సిటీ సైట్ సీయింగ్‌కి వెళ్ళాము. ఈ దేశాల్లో చాలా వరకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ బావుంది. అన్ని రకాలైన రవాణా సౌకర్యాలు అందుబాటులో తక్కువ ధరలో ఉన్నాయి.

ఫుడ్ కూడా బాగుంది. చీకటి పడే సమయానికి మేమున్న షాపింగ్ ఏరియాకి దగ్గర్లో ఉన్న ఆ ప్రాంతం దూరం నుండి చూద్దాము అనుకున్నాము.

కాలువకు అవతలి వైపు ఉన్న భవంతులలో రెడ్ లైట్ ఏరియా అన్నారు. చాలా మంది యాత్రికులు వంతెన దాటి వీధిలో నడుస్తూ చూస్తున్నారు. ఇటు అటు రెండు వైపులా గుర్రాల మీద ఉన్న పోలీసులు అందర్నీ అబ్జర్వ్ చేస్తున్నారు, ఎవ్వరూ ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా. ఒకరిద్దరు వీధిలో ఇంకా బిల్డింగ్ విండోస్ దగ్గర్లో ఫోటోలు క్లిక్ చేయ్యలని ట్రై చేస్తే దగ్గరకు వచ్చి సున్నితంగా వద్దని ఆపారు. అనుమానం వస్తే కెమెరా చెక్ చెయ్యటం కనిపించింది. మేము దూరం నుండే చూసాము.

ప్రపంచపు అతి పురాతన వృత్తి జరిగే ప్రాంతాన్ని డి వాలెన్ అని కూడా పిలుస్తారు, ఈ ప్రాంతం నౌకాశ్రయం పక్కన ఉన్న ఆమ్‌స్టర్‌డామ్ యొక్క మధ్యయుగ నగర కేంద్రంగా ఉంది, అందుకే రెడ్ లైట్ డిస్ట్రిక్ట్ మొదట ఇక్కడ కనిపించింది. నావికులకు సేవలు అందిస్తుంది. డి వాలెన్ చుట్టుపక్కల ప్రాంతం మారినప్పటికీ మరియు రెడ్-లైట్ వ్యాపారాలు సంవత్సరాలుగా మార్చబడినప్పటికీ, ప్రధాన విభాగం ఇక్కడే ఉంది.

డి వాలెన్‌లోని ఓడే కెర్క్ (పాత చర్చి) ఆమ్‌స్టర్‌డామ్‌లోని పురాతన భవనం, దాని 700వ పుట్టినరోజును పూర్తి చేసింది. ఒక చెక్క చర్చి 1213లో నిర్మించబడింది, తరువాత రాతితో నిర్మించబడింది మరియు 1306లో పవిత్రం చేయబడిందిట.

వెస్టర్‌కెర్క్:

మీరు కెనాల్ క్రూయిజ్‌ను తీసుకుంటే, మీరు ఆమ్‌స్టర్‌డామ్‌లో ప్రసిద్ధ అన్నే ఫ్రాంక్ హుయిస్ పక్కనే ఉన్న అద్భుతమైన వెస్టర్‌కెర్క్‌తో సహా కొన్ని ల్యాండ్‌మార్క్‌లను కూడా గుర్తించగలరు.

అన్నే ఫ్రాంక్ హుయిస్ అత్యంత ప్రజాదరణ పొందిన ఆమ్‌స్టర్‌డామ్‌ ఆకర్షణలలో ఒకటి, అయితే ఇది ఉన్న భవనం ప్రత్యేకంగా ఆకర్షించేది లేదా ఎత్తైనది కాదు. అయితే వెస్టర్‌కెర్క్‌లో ఆమ్‌స్టర్‌డామ్‌లో ఎత్తైన చర్చి టవర్ ఉంది, వెస్టర్‌టోరెన్ (వెస్టర్న్ టవర్) ఇది నగరంలోని అనేక పాయింట్ల నుండి చూడవచ్చు మరియు చాలా అందంగా ఉంది.

కాలువలో క్రూజ్ ప్రయాణం బాగుంది. కాలువకు ఇరువైపులా ఉన్న ఓల్డ్ టైప్ బిల్డింగ్‌లలో రిపైర్స్ జరిగిన మూల డిజైన్స్ మార్చకూడదని చెప్పారు. వారి పురాతన నిర్మాణ స్టైల్‍ని గర్వంగా ఫీల్ అవుతారు. ఓల్డ్ ఇస్ గోల్డ్ అని నమ్ముతారు. అందుకే పర్యాటక ఆకర్షణగా ఉన్నాయి.

ఆ దేశంలో సైకిల్స్ వాడకం ఎక్కువ. అంతే కాదు Right of the way హక్కు ముందుగా కాలినడకన వచ్చే వారికి, తరువాత సైకిల్ వాడేవారికి, ఆ తరువాతే ఇతర వాహనదారులు.

అక్కడ నడక చాలా సేఫ్ హ్యాపీ. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కి ప్రాముఖ్యం ఎక్కువే.

నగరం ఎంతో నీట్ గా ఉంది. Planned cities, Towns. మేము నెదర్లాండ్స్ దేశం లోని ఇంకో పట్టణం ఫిలిప్స్ కంపెనీ పుట్టిల్లు అయిన ఎందోవెన్ వెళ్ళాము. అక్కడ నా పూర్వ విద్యార్థిని ఇంటికి.

ప్రేమపూర్వకంగా ఆతిథ్యం ఇచ్చింది మానస. ఎప్పుడో దాదాపు 18 +yrs తరువాత పూర్వవిద్యార్థినిని విదేశంలో కలవటం విశేషం. ఒక టీచర్‌గా ఆనందం.

Photos: Mr. D. Nagarjuna

(వచ్చే వారం కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here