[dropcap]తే[/dropcap]ది 24-06-2018న విశాఖపట్నం ద్వారకానగర్ లోని పౌర గ్రంధాలయంలో విశాఖ రచయితల సంఘం, హిందీ రైటర్స్, అండ్ జర్నలిస్ట్ అసోసేషియన్, ఆంధ్రప్రదేశ్ (WAJA,AP) సంయుక్త ఆధ్వర్యంలో మూడు పుస్తకాల ఆవిష్కరణ మరియు సమీక్ష సమావేశం జరిగింది. కవితా వాహిని, మనుచరిత్ర, అతిరధి తెలుగు పుస్తకాలను ప్రముఖ హిందీ అనువాదకురాలు శ్రీమతి పారనంది నిర్మల హిందీలోకి అనువదించారు.
విశాఖ రచయితల సంఘం కార్యదర్శి శ్రీ అడపా రామకృష్ణ సభకు అధ్యక్షత వహించగా శ్రీ పి వి ఆర్ మూర్తి తెలుగులో రచించిన కవితావాహిని హిందీ అనువాద పుస్తకాన్ని శ్రీ అస్లమ్ హసన్, కమీషనర్,రెవెన్యూ, విశాఖపట్నం గారు ఆవిష్కరించి పుస్తకాన్ని సమీక్షించారు.
కీ.శే. శ్రీమతి ఆర్. స్వరాజ్యలక్ష్మి గారి తెలుగు మను చరిత్ర పుస్తకం హిందీ అనువాద పుస్తకాన్ని ఆంధ్రాయూనివర్శిటి విశ్రాంత హిందీ ఆచార్యులు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి ఆ పుస్తకం విశిష్టత, అనువాద గొప్పదనం వివరించారు. తన సోదరి మరణాంతరం ఈ పుస్తకాన్ని ప్రచురించి ఆవిష్కరింప చేసిన శ్రీమతి పారనంది నిర్మల దంపతులను ఆమె అభినందించారు.
అనంతరం అడపా రామకృష్ణగారు తెలుగులో రచించిన నవల హిందీ అనువాదం “అతిరధి”ని డాక్టర్ ఎస్. కృష్ణబాబు, విశ్రాంత హిందీ అధికారి, స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం మరియు అధ్యక్షులు, వాజా, ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరించి పుస్తకాన్ని సమీక్షిస్తూ సమకాలీన సమస్యకు దర్పణం పట్టిన రచనగా అభివర్ణించారు.
తరువాత ముఖ్య అతిథులను, రచయితలను, అనువాదకురాలిని, ఈ కార్యక్రమానికి సహాయపడిన వారిని శాలువాలతో సత్కరించారు. శ్రీమతి పారనంది నిర్మల తన అనుభవాలను వివరించి తన సోదరి జ్ఞాపకార్ధం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆమె స్వయంగా తయారు చేసిన గుడ్డ సంచులను అందరికీ ఉచితంగా అందచేసారు. ఆమె స్వయంగా తయారు చేసిన శాలవలతో అతిధులను సత్కరించారు.
ఈ కార్యక్రంమలో వాజా కార్యదర్శి ప్రసంగించారు కార్యక్రమానికి ముందు ప్రముఖ రచయిత మేడా మస్తాన రెడ్డి గారు స్వాగతం పలుకగా చివరిగా మరో రచయిత సుసర్ల సర్వేశ్వర శాస్త్రి వందన సమర్పణ చేసారు.