సినిమా క్విజ్-61

0
3

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ సినిమాలో నారదుని పాత్ర ధరించిన నటుడెవరు?
  2. బి.ఆర్. పంతులు నిర్మించిన ‘గాలిమేడలు’ చిత్రంలో ఎన్.టి.ఆర్.‍కు జోడీ దేవిక కాగా, జగ్గయ్యకు జోడీ ఎవరు?
  3. సురేష్ ప్రొడక్షన్స్ వారు ఎన్.టి.ఆర్. ద్విపాత్రిభినయంతో తీసిన ‘రాముడు భీముడు’ చిత్రంలో ‘ఉందిలే మంచి కాలం ముందు ముందున’ పాటకి కె.ఎన్.రెడ్డి నాట్యం చేయగా, అతనికి జోడీగా నాట్యం చేసిన తార పేరు?
  4. సి. పుల్లయ్య దర్శకత్వం వహించిన ‘భామా విజయం’ చిత్రంలో ఎన్.టి.ఆర్.‍ను దేవలోకానికి తీసుకువెళ్ళినవారిలో ఒకరు ఎల్. విజయలక్ష్మి కాగా, మరొక నటి ఎవరు?
  5. విజయ ప్రొడక్షన్స్ వారు కె. కామేశ్వరరావు దర్శకత్వంలో తీసిన ‘చంద్రహారం’ చిత్రంలో యక్షకన్యగా నటించిన నటి ఎవరు?
  6. 1976లో వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘మహాకవి క్షేత్రయ్య’ చిత్రానికి మొదట దర్శకత్వం వహించిన ఆదుర్తి సుబ్బారావు మరణించగా, ఈ చిత్రాన్ని పూర్తి చేసిన దర్శకుడు ఎవరు?
  7. ఎస్.పి. ముత్తురామన్ దర్శకత్వంలో రజనీకాంత్, శ్రీదేవి నటించిన ‘రాణువ వీరన్’ (1981) అనే తమిళ చిత్రంలో దొంగ పాత్రని పోషించిన తెలుగు హీరో ఎవరు? (క్లూ: ఈ సినిమా ‘బందిపోటు సింహం’ పేరుతో తెలుగులో డబ్ అయింది)
  8. జెమినీ వారు నిర్మించిన ‘కలెక్టర్ జానకి’ (జగ్గయ్య, జమున, జయంతి) సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు?
  9. ఎన్.టి.ఆర్. తీసిన ‘దానవీరశూరకర్ణ’ సినిమాలో పరశురామునిగా నటించిన నటుడెవరు?
  10. జి. నాగూర్ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., జమునలు నటించిన ‘ఇద్దరు పెళ్ళాలు’ (1954) సినిమాకి సంగీత దర్శకులు ఎవరు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 నవంబర్ 07 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 61 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 నవంబర్ 12 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 59 జవాబులు:

1.జయమ్ము నిశ్చయమ్మురా (1989) 2. జయం 3. ఇంతకామ్ (1969) 4. థాంబ్ లక్ష్మి కుంకుం లావితే (1967) 5. నాదన్ పెణ్ణు (1967) 6. పాలైవన సోలై (1981) 7. ఇనిమై ఇదో ఇదో 8. ప్రేమించే మనసు (1999) 9. గెలువు నన్నదే (1983) 10. పుష్పలత

సినిమా క్విజ్ 59 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • మణి నాగేంద్రరావు బి.
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.ఆర్. మూర్తి
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలిగయ్య. టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు
  • వనమాల రామలింగాచారి
  • దీప్తి మహంతి
  • కొన్నె ప్రశాంత్
  • జి. స్వప్నకుమారి
  • టి. మమన్ బాబు

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here