[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- బి.ఆర్.పంతులు గారు కన్నడంలో రాజ్‍కుమార్ హీరోగా తీసిన ‘ఎమ్మ తమ్మణ్ణ’ చిత్రాన్ని తెలుగులో సి.ఎస్. రావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వర రావు హీరోగా ఏ పేరుతో రీమేక్ చేశారు?
- ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్.టి.ఆర్. నటించిన ‘యమదొంగ’ చిత్రంలో యమధర్మరాజు పాత్రధారి మోహన్‍బాబు గారి ఊత పదం?
- తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించిన ‘జయం మనదే’ (ఎన్.టి.ఆర్., అంజలీదేవి 1956) చిత్రంలో ప్రచండుడుగా నటించినదెవరు?
- ఎన్.టి.ఆర్. ‘వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ సినిమాలో కడప నవాబుగా (సుల్తానుగా) నటించినదెవరు?
- ఘంటసాల బాలరామయ్య దర్శకత్వంలో అక్కినేని, అంజలీదేవి నటించిన ‘స్వప్నసుందరి’ (1950) చిత్రానికి సంగీత దర్శకులు ఎవరు?
- సి.ఎస్. రావు దర్శకత్వంలో అక్కినేని, జమునలు నటించగా టి.వి.రాజు సంగీతం సమకూర్చిన చిత్రం ఏది?(క్లూ: ‘ముక్తి మార్గమును కనలేవా మాయమోహమయజీవా’ అనే పాట ఈ సినిమాలోదే)
- ఆర్.కె. బ్రదర్స్ బ్యానర్‍లో కె.వి.రెడ్డి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్. నటించిన ‘శ్రీకృష్ణసత్య’ చిత్రానికి కథ అందించినది ఎవరు?
- 1940లో వచ్చిన ‘మైరావణ’ (అహిరావణ), 1964 లో వచ్చిన ‘మైరావణ’ చిత్రాలలో చంద్రసేన పాత్ర పోషించిన నటీమణులు ఎవరు?
- 1960లో రజనీకాంత్ దర్శకత్వంలో వచ్చిన ‘దీపావళి’ (ఎన్.టి.ఆర్., సావిత్రి) చిత్రంలో రుక్మిణి పాత్రధారిణి ఎవరు?
- శరత్ నవల ‘నిష్కృతి’ ఆధారంగా 1957లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నటించిన ‘తోడికోడళ్ళు’ చిత్రానికి స్క్రీన్‍ప్లే అందించినది ఎవరు?
~
మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 నవంబర్ 14 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 62 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 నవంబర్ 19 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 60 జవాబులు:
1.కీల్ వానమ్ శివక్కుం 2. నెంజిలే తుని నిరుంతల్ 3. పూవిన్ను పుదియ పూం తెన్నల్ 4. ఆహా (1998) 5. కృష్ణకుమారి 6. పెళ్ళి చేసి చూడు (1988) 7. యమనుక్కు యమన్ 8. తైకు ఓరు తలాట్టు (1986) 9. సట్టం ఒరు ఇరుత్తరై (1984)
సినిమా క్విజ్ 60 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామకూరు నాగేశ్వరరావు
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
- బి. మణి నాగేంద్రరావు
వీరికి అభినందనలు.
[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]
[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]