[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]
1. ఓటమి
అంతర్గత శక్తులపై
తొలకరి జల్లు
~
2. బలి
ఎరకు చేప
నోటుకు
ప్రజాస్వామ్యం!
~
3. నివారణ
మోహం చేసే మోసమే
రాగం
రాగం చేసే చేసే గాయమే
దుఃఖం
అనిశ్చిత అనాత్మల ఆశ్రయమే
నివారణోపాయం
~
4. వ్యాపారం
క్రయ విక్రయ మయమే
వ్యాపారం
ఓటు అమ్మకం
అధికారం కొనుగోలే
అధిక ధరలు ఋణ భారాలు
వ్యాపారంలో భాగమే