[శ్రీ శంకరప్రసాద్ రచించిన ‘నేను పాంధుడను’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]సూ[/dropcap]రీడు సిగ పువ్వై
చందురుడు చిరునవ్వై
వేగుచుక్క బొట్టు పెట్టి
మబ్బు చీర మేను చుట్టి
సెలయేటి నడకలతో
మధుర పదములతో నర్తించే
కావ్య కన్యను చిత్రించే
నేను ఎవరిని.. తెరువరిని..!
సాహితీ వనంలో కవనంలో
నిను వెతుకుతూ తిరుగుతూ
పూతావులలో కావ్య సుగంధం
ఆఘ్రాణించినా నిను కనలేని
అంధుడను దారి తెలయని పాంధుడను