[జయశ్రీ అబ్బినేని గారి ‘విశ్వనృత్యం’ అనే రచన అందిస్తున్నాము.]
విశ్వనృత్యం/Cosmic Dance:
[dropcap]గ[/dropcap]తిశీలమైన మరియు స్థిరమైన శక్తుల ఆట. CERN, France 15 సంవత్సరాల క్రితం quoted.. it’s a dance of Subatomic matter.
లయకారుడు, ఆదియోగి, వేదాలు ఘోషించిన నిరాకారుడు అయిన ఈశుడు/పరమేశ్వరుని శివతాండవం 7 రకాలు.. రుద్రతాండవం, ఆనందతాండవం, కాళీ తాండవం, ముని తాండవం, తిరుపుర తాండవం, సంధ్యా తాండవం, ఉమా తాండవం/గౌరీ తాండవం.. Feminine dance ని లాస్య అంటారు.
Creation సృష్టి, Preservation స్థితి, Destruction సంహారం, Illusion భ్రమ and Emancipation విముక్తి. ..Cycle of LIFE & DEATH.
శివుడు విశ్వనృత్యం (కాస్మిక్ డాన్స్) ఐదు ప్రదేశాల్లో (గుడులు) చేశాడని చెప్పబడుతోంది. పంచ సభలు అంటారు.
తిరువాలంగాడు లో డాన్స్ చేసేప్పుడు శివుని చెవిపోగు కిందపడిందట. దాన్ని కాలి బొటనవేలితో తీసి, కాలుతోనే పోగు పెట్టుకునే భంగిమ చిదంబరం గుడిలో గోడమీద ఉంది. మూలవిరాట్టు ఎదురుగా, కుడి చేతి వైపు..
- రత్న సభై.. తిరువాలంగాడు
- వెళిసభై (వెండి).. మదురై
- తామ్ర సభై (రాగి).. తిరునెల్వేలి
- చిత్తిరైసభై (చిత్రాలు).. తిరుకుట్రాలం
- పొర్చభై (బంగారం).. చిదంబరం.
ప్రకృతి/శివుని మూలాలైన 5 మూలాలు elements..
- భూమి.. కాంచీపురం, ఏకాంబరేశ్వర గుడి
- ఆకాశం.. చిదంబరం గుడి
- నీరు.. తిరుచ్చి.. తిరువానైకావల్
- నిప్పు.. తిరువన్నామలై..
- గాలి.. శ్రీకాళహస్తి..
శ్రీకాళహస్తి తప్పించి మిగిలిన 4 గుడులు మరియు 5 సభలు తమిళనాడు లోనే ఉన్నై.
అతి పురాతన శివాలయం గుడిమల్లం చిత్తూర్లో ఉంది. 3 BCE to 4 AD.
కాశీ, కేదార్ నాథ్, ద్వారక, ఉజ్జయిని, సోమనాథ్, రామేశ్వరం, బ్రృహదీశ్వరాలయం, Mount Kailash మానస సరోవరం,.. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ గుడి సముద్రంలో ఉంది. కపాలీశ్వర చెన్నై.. పెద్దవి.. కుంభకోణం దేవాలయాలు కూడా పెద్దవి.
మానస సరోవరం, తిరుకుట్రాలం ఇంకా నేను వెళ్ళలేదు.
శైవాన్ని వ్యాప్తిచేసిన 63 సాధువులని నయన్మారులు/నయనారులు అంటారు.. 6-8 వ శతాబ్దంలో. మొదటి ముగ్గురు నల్వారులు. సంబందర్, అప్పర్, సుందరర్. వీళ్ళు వ్రాసిన వాటిని తేవారం అంటారు. పది పాటలు ఒక సెట్‍గా ఉంటాయి, పతికం. నాలుగవ అతను మాణికవాసగర్. ఇతను శివుణ్ణి స్తుతిస్తూ వ్రాసిన కీర్తనలను తిరువాసగం అని,. ఇవి పాడే గాయకులను ఒడువర్ అంటారు.
అజ్ఞానాన్ని తొక్కిపెడ్తూ, ఆకాశమే హద్దుగా మనిషిలో (చిత్+అంబరం) జరిగే సంఘర్షణకు సింబాలిక్‌గా కూడా తాండవాన్ని తీసుకోవచ్చు. Or Energy transfer from potential to kinetic to any form is nothing but the MANIFESTATION OF HIM. ..ఢమరుకం టైం & రిథం.. మన జీవితం అయిపోతుంది, జాగ్రత్త పడమని అయ్యుండొచ్చు ..పుర్రె మ్రృత్యువు, అగ్ని సృష్టి సంహారం, కాలి క్రింద ఉన్నది రాక్షసుడు/అజ్ఞానం/మూఢత్వం/చెడు. డాన్స్‌కి కావల్సింది బాలన్సింగ్, నియంత్రణ, శారీరక మానసిక అదుపు.. Checks & Balances (of) life.. same for the NATURE.
అన్నిట్లోకి నాకు నచ్చిన Portrayal నేను సిక్కింలో కొన్న పెయింటింగ్.
నటరాజ భంగిమలో క్రికెట్‌లో ఒక పోజ్ ఉంది.