పోయిందీ లేదు – దుఃఖమూ లేదు

0
3

[మాయా ఏంజిలో రచించిన ‘No loser, No weeper’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]

(పోగొట్టుకోవడాన్ని ఇష్టపడను అని చెబుతూనే, ఒక హెచ్చరికని ధ్వనిస్తుందీ కవిత.)

~

[dropcap]“ఏ[/dropcap]దో ఒకటి పోగొట్టుకోవడం నాకిష్టముండదు”
అప్పుడామె తలాడించింది
“ఒక్క పైసా కూడా.. నేను చచ్చినంత బాధపడతా”
నేనస్సలు వివరించలేను..
చెప్పడానికేమీ లేదు..
“ఏదో పోగొట్టుకోవడాన్ని ద్వేషించడం తప్ప..”

“ఒకసారి నా బొమ్మని పోగొట్టుకున్నా
ఓ వారం రోజులపాటు ఏడ్చాను
ఆ బొమ్మ కళ్ళు తెరిచి చూసేది
మాట్లాడటం తప్ప ఎన్నో చేసేది
దాన్నెవరో చాటుగా ఎత్తుకుపోయారని నా నమ్మకం
చెప్తున్నా నీకు..
ఏదైనా పోగొట్టుకోవడం అంటే నాకు కోపం”

“నాదో గడియారం – ఓసారి
లేచి నడిచెళ్ళిపోయింది
దాన్లో పన్నెండు అంకెలుండేవి
రోజంతా సమయం చూపించేది
నేనస్సలు మర్చిపోలేను దాన్ని
ఏదైనా పోగొట్టుకోవడాన్ని
నిజంగా నేను ద్వేషిస్తానని
మాత్రం చెప్పగలను నేను.. “

“ఒక బొమ్మని, ఓ గడియారాన్ని పోగొట్టుకుంటేనే
అంతలా బాధపడిన నేను
నా ప్రేమికుడిని గురించి ఏం ఆలోచిస్తానని
నువ్వనుకుంటున్నావు..??
నేనేం నిన్ను బెదిరించడం లేదు మాడమ్
కానీ.. నా సాయంసంధ్యాకాలపు ఆనందం అతడు
నా ఉద్దేశం చెప్పనా..
నేన్నిజంగా దేన్నైనా పోగొట్టుకోవడాన్ని ద్వేషిస్తాను!!”

~

మూలం: మాయా ఏంజిలో

అనువాదం: హిమజ


మాయామాటలు మరిన్ని:

  1. మీరు చేస్తే తప్ప ఏదీ పని చెయ్యదు.
  2. సంగీతం నా ఆశ్రయం. స్వరాలు, గమకాల ద్వారా నేను అంతరిక్షంలోకి ఎగసి వెళ్ళగలను, నాలోని ఒంటరితనంలోనికీ ముడుచుకోగలను.
  3. పక్షపాత ధోరణి ఒక భారం. అది గతాన్ని గందరగోళంలో పడేస్తుంది, భవిష్యత్తుని భయపెడుతుంది. వర్తమానాన్ని అసాధ్యం చేస్తుంది.
  4. వేరొకరి పట్ల శ్రద్ధ చూపించాలని మీ హృదయంలో మీరు నిర్ణయించుకుంటే మీరు విజయం సాధించినట్టే.
  5. ప్రజలు మీరేం చెప్పారన్నది మరిచిపోతారు. మీరేం చేసారన్నది మరిచిపోతారు. మీవల్ల వారు పొందిన గాఢమైన అనుభూతిని మాత్రం వారు మరిచిపోలేరని నేను నా అనుభవంతో తెలుసుకున్నాను.
  6. జీవితాన్ని ప్రేమించండి. పూర్తిగా నిమగ్నమైపొండి. మీకు లభించినదంతా తిరిగి ఇవ్వండి. అభిరుచి ప్రేమ కలగలిపి జీవించండి. మీరేం ఇస్తే జీవితం మీకు అది తప్పక తిరిగిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here