[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘పరువు బరువు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]ప[/dropcap]రువు అనే పరుపు మీద
పవళించే మనుషులం
అది బరువై మెదడుని
మొద్దుబారేలా చేస్తోంది
వెరపు లేని వెకిలితనంతో
కరకు మనసును చేస్తోంది
తుదకు అది నిన్నూ నన్నూ
అందరినీ కట్టగట్టి
చుట్ట చుట్టి పారేస్తుంది
పరువు గర్వం వీడితేనే
పరులతో బాగుంటాము
మనిషిగా బతికుంటాము