ఆది అంతం లేని విజ్ఞానానికి నెలవు విశాల విశ్వం

0
3

[పెరిగిపోతున్న సాంకేతికతని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం గురించి వివరిస్తున్నారు శ్రీమతి ఆర్. లక్ష్మి.]

[dropcap]ప్ర[/dropcap]ముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ HP 1983లో మొట్టమొదటి టచ్ స్క్రీన్ కంప్యూటర్‌ను తయారు చేసింది. స్పర్శకు స్పందించే పరికరాల తయారీకి అదే నాంది. 1985లో G.E. అలాంటి పొరలను రూపొందించింది. కాలిఫోర్నియా శాస్త్రజ్ఞులు 2010లో రబ్బరు మీద నానో ట్రాన్స్‌మీటర్స్‌ను అతికించి తొలిసారిగా ప్రయోగాత్మక ఎలక్ట్రానిక్ చర్మాన్ని సృష్టించారు. తరువాత 2011లో స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రజ్ఞులు పారదర్శకంగా ఉండే అతి పలచని నానో వైర్లతో ఎలక్ట్రానిక్ పరికరాలను సృష్టించారు. 2013లో బర్క్‌లీ లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు తాకితే వెలిగే చర్మాన్ని సృష్టించారు. అచ్చం మనిషి చేయిలా కనిపించే, స్పందించే కృత్రిమ హస్తం 2014లో ఆవిష్కృతం అయ్యింది. శరీరం కదలికలకు అనుగుణంగా కదలటానికి, వీలుగా సాగటానికి అనువైన ఎలక్ట్రానిక్ సర్క్యూట్ల వంటివి ఈ పరిజ్ఞానానికి ఇప్పుడు జతపడుతున్నాయి.

మానవులకు సంబంధించి – 1991లో వేలిముద్రలను ఖచ్చితంగా గుర్తించగల సాంకేతిక పరిజ్ఞానం అందుబాటు లోనికి వచ్చింది. 2002-2004ల నడుమ మనిషి ముఖాన్ని గుర్తించగల వ్యవస్థలు రూపొందాయి. 2008లో మరి కొంచెం ముందుకు పోయి ఐరిస్ గుర్తింపు పరిజ్ఞానం రూపొందింపబడింది. 2009లో అరచేతి ముద్ర ఆనవాలుకూ పరిజ్ఞానం రూపొందింది. 2011 నుండి మనిషి కంఠ స్వరాన్ని ఖచ్చితత్వంతో నిర్ధారించగల పరిజ్ఞానమూ అవిష్కృతమైంది. ఈ విధంగా విస్తరిస్తూ వచ్చిన గుర్తింపు పరిజ్ఞానం అంతా నేర పరిశోధన రంగంలో విస్తతంగా ఉపయోగపడుతుండడమే గాక పరిశోధనలు వేగంగా జరగడానికి, మరింత ఖచ్చితమైన ఫలితాలు రావటానికి దోహదం చేస్తోంది. ఇదంతా నాణేనికి ఒక పార్శ్వం.

మన దేశంలో –

  • ‘నాట్‌గ్రిడ్’ పౌరులకు సంబంధించిన 21 రకాల సమాచారాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తెలుసుకోగలదు.
  • ‘నెట్రా’ సోషల్ మీడియాలోనిదే కాకుండా మన P.C. లలోని సమాచారాన్నీ తెలుసుకోగలదు.
  • 800 కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేయబడిన ‘C.M.S’ వ్యవస్థ వ్యక్తుల ప్రమేయం లేకుండానే వారి ఫోన్ మెసేజ్లు, సంభాషణలు వంటి ప్రతి అంశాన్ని గమనించి రికార్డు చేయగలదు.

ఈ మూడు వ్యవస్థలూ ప్రస్తుతం మనదేశంలో చట్టబద్ధంగా అమలులో ఉన్నాయి.

సాంకేతిక పరిజ్ఞానం కమ్యూనికేషన్ రంగంలో పెను విప్లవాన్ని తీసుకు వచ్చింది. ఊహించని వేగంతో విస్తరిస్తున్న ఈ పరిజ్ఞానం ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలకూ తెరతీసింది. దైనందిన జీవితంలో కమ్యూనికేషన్‌కు సంబంధించి సాంకేతిక పరికరాల పాత్ర పెరిగిన కొద్దీ మనుషుల ప్రాథమిక హక్కు అయిన వ్యక్తిగత గోప్యతకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.

బ్లాక్ బెరీ, ఆండ్రాయిడ్ వంటి అత్యంత ఆధునిక టెక్నాలజీ ఆధారిత ఫోన్లు సైతం హేకింగ్‍కు గురికావడం ఇటీవలి చరిత్ర. ఈ హాకింగ్‍లో సెక్యూరిటీ నిబంధనలన్నీ ఉల్లడించబడ్డాయని ‘ఆమ్నెస్టీ’కి చెందిన ఫోరెన్సిక్ పరిశోధనశాల విశ్లేషించి ధృవకరించింది. ఇటువంటి సంఘటనలు సైబర్ సెక్యూరిటీ వ్యవస్థల సామర్థ్యాలనూ ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో 2023 జూలై 13న పారిస్‌లో ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహించబడింది. మానవహక్కులు, ప్రాథమిక హక్కులు, వాటి గురించి అవగాహన, పరిరక్షణ లక్ష్యంగా సదస్సు నిర్వహించబడింది. 1000 మంది నిపుణులు ఈ సభ్కు హాజరు అయ్యారు. దుర్వినియోగానికి అనుమతించని, నీతిబద్ధమైన నిబంధనలతో కూడిన నియమావళిని రూపొందించి దిశగా చర్చలు జరిగాయి. ముప్పులను ఎదుర్కునే దిశగా ఒక అవగాహనకు రావడం జరిగింది. సాంకేతిక విజ్ఞానంలో వస్తున్న అద్భుతమైన ప్రగతిని, ఆవిష్కరణలను స్వాగతిస్తూ ఆనందాన్ని పంచుకోవడంతో బాటుగా మానవహక్కుల పరిరక్షణకు సంబంధించిన జాగ్రత్తలతో ఆప్రమత్తంగా వ్యవహరించాలని ఆ సందర్భంగా U.N. జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు.

అద్భుతమైన ఆవిష్కరణలు అందిస్తున్న చక్కని ఫలితాలను త్రోసిరాజనగల వాతావరణం ఇప్పటి జీవన విధానాలలో ఎటూ లేదు. పరిజ్ఞానాన్ని, దాని వలన ఒనగూడే ప్రయోజనాలను పరిస్థితుల కనుగుణంగా మలచుకుంటూ, అప్రమత్తతే రక్షణ కవచంగా ముందుకు సాగిపోక తప్పని పరిస్థితి. కారణం కొన్ని తరాలు అహర్నిశలు శ్రమించి సాధించిన అద్భుత విజ్ఞానమిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here