సినిమా క్విజ్-63

0
3

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. బి.ఎ. సుబ్బారావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., అక్కినేని, అంజలీదేవి నటించిన ‘పల్లెటూరి పిల్ల’ (1950) సినిమాని దర్శకనిర్మాత ఎస్.ఎస్. వాసన్ దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్, బీనా రాయ్‍లతో ఏ పేరిట హిందీలో రీమేక్ చేశారు?
  2. 1952లో ఎల్. వి. ప్రసాద్ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., జి. వరలక్ష్మి, సావిత్రి నటించిన ‘పెళ్ళి చేసి చూడు’ చిత్రాన్ని 1972లో ఎల్. వి. ప్రసాద్ దర్శకత్వంలో జితేంద్ర, రాఖి, శత్రుఘన్ సిన్హా, ఆస్రాని లతో హిందీలో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  3. పి. రామకృష్ణ దర్శకత్వంలో అక్కినేని, సావిత్రి, ఎస్.వి. రంగారావులు నటించిన ‘బ్రతుకుతెరువు’ (1953) చిత్రాన్ని హిందీలో జితేంద్ర, తనూజ, సంజీవ్ కుమార్‍లతో దర్శకుడు ఎల్. వి. ప్రసాద్ హిందీలో రీమేక్ చేసిన సినిమా ఏది?
  4. సి. పుల్లయ్య దర్శకత్వంలో అంజలీదేవి, రేలంగి, ఎ.ఎం. రాజాలు నటించిన ‘పక్కయింటి అమ్మాయి’ (1953) చిత్రాన్ని హిందీలో సునీల్ దత్, సైరాబాను, మెహమూద్, కిషోర్ కుమార్‍లతో దర్శకుడు జ్యోతిస్వరూప్ హిందీలో రీమేక్ చేసిన సినిమా ఏది?
  5. 1954లో దర్శకనిర్మాత బి.ఎ. సుబ్బారావు ఎన్.టి.ఆర్., సుధాకర్, లక్ష్మీరాజ్యంలతో తీసిన ‘రాజు-పేద’ చిత్రాన్ని, కె. ప్రత్యగాత్మ దర్శకత్వంలో హిందీలో సంజీవ్ కుమార్, కుంకుం లతో రీమేక్ చేసిన చిత్రం పేరు?
  6. ఎవిఎం ప్రొడక్షన్స్ వారు తెలుగులో వైజయంతిమాల (పరిచయం), టి.ఆర్. రామచంద్రన్, ఎస్. వరలక్ష్మి, సి.హెచ్. నారాయణరావులతో తీసిన ‘జీవితం’ (1950) చిత్రాన్ని ఎం.వి. రామన్ దర్శకత్వంలో వైజయంతిమాల, కరన్ దీవాన్, ఓం ప్రకాష్ లతో హిందీలో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  7. దర్శకనిర్మాత పి. పుల్లయ్య 1955లో అక్కినేని, సావిత్రి, జగ్గయ్య లతో తీసిన ‘అర్ధాంగి’ చిత్రం – హిందీలో టి. ప్రకాశరావు దర్శకత్వంలో గురుదత్, ఫిరోజ్ ఖాన్, మాలా సిన్హాలతో ఏ పేరిట రీమేక్ అయింది?
  8. 1955 లో విజయావారు ఎన్.టి.ఆర్., అక్కినేని, సావిత్రి, జమునలతో తీసిన ‘మిస్సమ్మ’ చిత్రాన్ని హిందీలో దర్శకుడు ఎల్. వి. ప్రసాద్ – జెమినీ గణేశన్, జమున, మీనాకుమారి, ఓం ప్రకాష్, కిషోర్ కుమార్‍లతో రీమేక్ చేసిన చిత్రం ఏది?
  9. దర్శకుడు సి. వి. రంగనాధ దాస్ 1955 లో అక్కినేని, సావిత్రి, శ్రీరంజని, అమర్‍నాథ్, ఎస్.వి.ఆర్. లతో తీసిన ‘సంతానం’ చిత్రాన్ని ఎల్. వి. ప్రసాద్ దర్శకత్వంలో సునీల్ దత్, జమున, బి. సరోజా దేవి, మహమూద్ లతో ఏ పేరుతో హిందీలో రీమేక్ చేశారు?
  10. కె.వి.రెడ్డి దర్శకత్వంలో అక్కినేని, సావిత్రి, జగ్గయ్య, జమునలు నటించిన ‘దొంగరాముడు’ చిత్రాన్ని హిందీలో కృష్ణన్-మంజు దర్శకత్వంలో కిశోర్ కుమార్, సాధన నటించగా ఏ పేరుతో రీమేక్ చేశారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 నవంబర్ 21 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 63 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 నవంబర్ 26 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 61 జవాబులు:

1.కాంతారావు 2. జయంతి 3. కుచల కుమారి 4. విజయనిర్మల 5. సావిత్రి 6. సి. యస్. రావు 7. చిరంజీవి 8. వి. కుమార్ 9. గుమ్మడి 10. టి.ఆర్. పాప, టి.కె. కుమారస్వామి, టి.ఎ. కళ్యాణరామ్

సినిమా క్విజ్ 61 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • గోనుగుంట మురళీకృష్ణ
  • మణినాగేంద్రరావు. బి
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • జి. స్వప్నకుమారి
  • టి. మమన్ బాబు
  • దీప్తి మహంతి
  • కొన్నె ప్రశాంత్

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here