[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- తమిళ చిత్రం ‘ఎధిర్ పరధాతు’ (1954) ఆధారంగా 1956లో యోగానంద్ దర్శకత్వంలో అక్కినేని, అంజలీదేవి, జమున నటించిన ‘ఇలవేల్పు’ సినిమాని ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో రాజ్ కపూర్, మీనా కుమారి, శ్యామా లతో హిందీలో ఏ పేరిట రీమేక్ చేశారు?
- రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ‘నౌకాడూబీ’ నవల ఆధారంగా 1956లో తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., అక్కినేని, ఎస్.వి.ఆర్., అంజలీదేవి, సావిత్రి నటించిన ‘చరణదాసి’ చిత్రాన్ని జెమినీ బ్యానర్‍లో రామానంద సాగర్ దర్శకత్వంలో బీనా రాయ్, ఆశా పరేఖ్, ప్రదీప్ కుమార్, భరత్ భూషణ్‍లతో ఏ పేరులో హిందీలో రీమేక్ చేశారు?
- దర్శకనిర్మాత కె.బి. తిలక్ జగ్గయ్య, గిరిజ, దేవిక, రమణమూర్తి గార్లతో తీసిన ‘అత్తా ఒకింటి కోడలే’ (1958) చిత్రాన్ని వాసు ఫిలింస్ వారు డి. మధుసూదనరావు దర్శకత్వంలో సంజయ్ ఖాన్, రీనా చందావార్కర్, లలితా పవార్ లతో 1970లో హిందీలో ఏ పేరుతో రీమేక్ చేశారు?
- దర్శకుడు టి. ప్రకాశరావు అక్కినేని, జమునలతో తీసిన ‘ఇల్లరికం’ (1959) చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో హిందీలో రాజేంద్ర కుమార్, బి. సరోజా దేవి, శుభా కోటే లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
- దర్శకుడు సి.యస్. రావు అక్కినేని, రాజసులోచన, కాంతారావు, దేవిక గార్లతో తీసిన ‘శాంతినివాసం’ (1960) చిత్రాన్ని హిందీలో ఎస్.ఎస్. వాసన్ దర్శకత్వంలో రాజేంద్ర కుమార్, ఆశా పరేఖ్, రాజ్ కుమార్, దేవికలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
- దర్శకనిర్మాత సి.ఎస్. శ్రీధర్ తెలుగులో అక్కినేని, బి. సరోజా దేవి, జగ్గయ్య లతో తీసిన ‘పెళ్ళికానుక’ (1960) చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో రాజ్ కపూర్, వైజయంతి మాల, ఉషా కిరణ్, జెమినీ గణేశన్ (అతిథి పాత్ర) లతో హిందీలో ఏ పేరుతో రీమేక్ చేశారు?
- పినిశెట్టి శ్రీరామమూర్తి దర్శకత్వంలో చలం, కృష్ణకుమారి, సి.ఎస్.ఆర్, గుమ్మడి, రాజశ్రీ, రామకృష్ణ (తొలి పరిచయం) లతో తీసిన ‘నిత్య కళ్యాణం పచ్చ తోరణం’ (1960) సినిమాని దర్శకనిర్మాత ఎల్. వి. ప్రసాద్ 1966లో అశోక్ కుమార్, బీనా రాయ్, తనూజ లతో ఏ పేరుతో హిందీలో రీమేక్ చేశారు?
- అసిత్ సేన్ దర్శకత్వంలో వచ్చిన బెంగాలీ చిత్రం ‘దీప్ జలే జాయి’ ఆధారంగా గుత్తా రామినీడు దర్శకత్వంలో సావిత్రి, బాలయ్య, కాంతారావు, డా. ప్రభాకర రెడ్డి (తొలి పరిచయం) లతో తీసిన ‘చివరకు మిగిలేది’ (1960) సినిమాని హిందీలో అసిత్ సేన్ దర్శకత్వంలో రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర, వహీదా రెహమాన్ లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
- కె. ప్రత్యగాత్మ దర్శకత్వంలో అక్కినేని, గుమ్మడి, కృష్ణకుమారి, రేలంగి లతో తీసిన ‘భార్యాభర్తలు’ (1961) సినిమాని హిందీలో తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో రాజేంద్ర కుమార్, జమున, మొహమూద్ లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
- తమిళ చిత్రం ‘భాగప్పిరివినై’ కథ ఆధారంగా సారధి స్టూడియోస్ వారు తాపీ చాణక్య దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., సావిత్రి, ఎస్.వి.రంగారావు, రేలంగిలతో తీసిన ‘కలసి ఉంటే కలదు సుఖం’ (1961) సినిమాని హిందీలో ఎ. భీమ్‍సింగ్ దర్శకత్వంలో సునీల్ దత్, నూతన్, ఓం ప్రకాశ్ లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
~
మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 నవంబర్ 28 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 64 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 డిసెంబర్ 03 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 62 జవాబులు:
1.గోవుల గోపన్న 2. భంభోళ జంబ 3. ఆర్. నాగేశ్వరరావు 4. చలపతిరావు 5. సి.ఆర్.సుబ్బురామన్, ఘంటసాల 6. శ్రీకృష్ణమాయ 7. పింగళి నాగేంద్రరావు 8. కాంచనమాల, కృష్ణకుమారి 9. కృష్ణకుమారి 10. ఆదుర్తి సుబ్బారావు, ఆత్రేయ, దుక్కిపాటి మధుసూధనరావు
సినిమా క్విజ్ 62 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- జానకీ సుభద్ర పెయ్యేటి
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.ఆర్. మూర్తి
- పి. వి. ఎన్. కృష్ణ శర్మ
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- జి. స్వప్నకుమారి
- టి. మమన్ బాబు
- దీప్తి మహంతి
- కొన్నె ప్రశాంత్
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
వీరికి అభినందనలు.
[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]
[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]