[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
దేవకీ పరమానన్దమ్
ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః।
ఛన్దోఽనుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః॥
ఇక్కడ విష్ణోర్నామ సహస్రస్య అని పాఠాన్తరమ్ ఉంది.
ముందు పాఠాన్తరం అన్న మాటను పరిశీలిద్దాం. Alternative, alternate text, మరొక విధంగా అని మాత్రమే కాదు. అంతర్ పాఠము అని కూడా అనుకోవచ్చు. అంతర్.. అంతః అంటే అంతర్గతంగా అని కావచ్చును. అన్తరార్థము. అంటే లోపల దాగియున్న అర్థము. అది కూడా తెలిస్తేనే అర్థ సంపూర్ణం అవుతుంది.
మనకు ఏదైనా మన్త్రము చెప్పుకునే సమయంలో దాని ఋషి, ఛన్దస్, దేవత గురించి చెప్పుకుంటాము.
ఇక్కడ..
ఋషి – వేదవ్యాసుడు
ఛన్దస్ – అనుష్టుప్
దేవత – దేవకీ నన్దనుడు (దేవకీసుతః)
ఆ ఋషులందరూ దర్శించి అందించిన ఈ సహస్రనామములను భీష్ముడు ఒక వరుసలో పేర్చి అందించగా, దానిని ఋషి అయిన వేదవ్యాసుడు మనకు అందుబాటులోకి తెచ్చాడు. దాని ఛన్దస్ అనుష్టుప్. అనుష్టుప్‌లో విశేషం..
పాదానికి ఎనిమిది అక్షరములు. అష్టమ గర్భుడు దేవకీ దేవికి పరమాత్ముడైన శ్రీకృష్ణుడు. అందుకే దేవత దేవకీనన్దనుడు లేదా దేవకీసుతుడు. నన్దనన్దనుడో, శ్రీకృష్ణుడో కాలేదు (అంటే ఆ నామాలు, లేదా ఆ రూపంలో కాదు అని).
సశఙ్ఖచక్రం సకిరీటకుణ్డలం సపీతవస్త్రం సరసీరుహేక్షణమ్..
సహారవక్షస్థలశోభికౌస్తుభం
శఙ్ఖము మరియు చక్రము అతని చేతులపై (తో) పట్టుకొని ఉన్నవాడు. మెరుస్తున్న బంగారు కిరీటం తలపై కలిగి, అద్భుత సౌన్దర్యముతో అలరారుతున్న కుణ్డలములు ధరించినవాడు లేదా వాటితో అలంకరింపబడినవాడు. ఎవరైతే (ఏ రూపమైతే) అలా అందంగా అలంకరించబడి ఉన్నాడో (ఉన్నదో) ఆ రూపం కలిగిన శక్తి పసుపు రంగులో ఉన్న పట్టువస్త్రాలతో మరింత శోభిస్తున్నది. ఆ రూపధారికి తామరపువ్వు వంటి కన్నులు కూడా ఉన్నాయి. ప్రకాశవంతమైన కౌస్తుభ రత్నంతో కూడిన మాలలతో హృదయభాగం అలంకరించబడి ఉన్నది. అలా దర్శనమిచ్చే, మనల్ని అనుగ్రహించే శ్రీమహావిష్ణువు అదే రూపంతో దేవకీ దేవి గర్భం నుంచీ ఆవిర్భవించాడు. ఆ తేజస్‌ను, ఆ శక్తి యొక్క నిండుతనాన్ని దేవకీ వసుదేవులు (గ్రహించాలి.. వసు దేవుడు) భరించలేరు కనుక మనకు తెలిసిన శ్రీకృష్ణ అనే రెండు చేతులు, నీలమేఘ ఛాయతో అత్యంత ఆకర్షణీయంగా అగుపిస్తున్న శిశువుగా మారాడు (గుర్తుందా ఇళంసింగం, పెరియాయ్ సంబంధం?).
వసుదేవుడు. వసువులకు దేవుడు. వారికి శక్తినిచ్చేవాడు. వారిని నడిపించేవాడు. వారిలో ఉన్న దేవతా శక్తి అయినవాడు. ఆ వసుదేవుడికి బిడ్డగా.. దేవకీ దేవి గర్భంలో నుంచీ జన్మించిన వాడు. అది కూడా పెరియాయ్.. పూర్ణ రూపంతో. అంటే మనకు కనిపించే, అందే, తెలిసే.. సగుణ బ్రహ్మ రూపం. అందరికీ అందని, అందరూ గ్రహించలేని, అందరూ అంత తేలికగా తెలుసుకొనలేని నిర్గుణ బ్రహ్మ కూడా. ఆ వసుదేవుడినే తరింపజేసిన వాడు. వసువైన భీష్ముని కృపజూడటానికి అక్కడ నిలబడి.. ఈ స్తోత్రానికి దేవతగా గౌరవాన్ని పొంది.. మనల్ని తరింపజేశాడు. అది కూడా ధర్మదేవత అంశ అయిన ధర్మరాజు సాక్షిగా. నరుని ఎదుట. నరులమైన మన కోసం.
ఇదంతా దర్శించిన, దర్శించగల ఋషులు అందించిన నామములు.
విష్ణోర్నామ..
అనుష్టుప్ లో ఎనిమిది అక్షరాలు ఒక పాదానికి. మొత్తం నాలుగు పాదాలు. ఏ పాదంలో కూడా అర్థ రూపంలో (సగం సగం) పదాలు ఉండకూడదు. పూర్తి కావలసిందే. పూర్తి పదం పడాల్సిందే. మన తెలుగు పద్యాలలో మాదిరి పదాలను విరువ కూడదు. ఒక అక్షరం ఒక పాదంలో, మరియొక అక్షరం ఆ తరువాతి పాదంలో ఉండకూడదు.
సంపూర్ణమైన పదమే ఉండాలి. వాల్మీకి మహర్షితో వచ్చిన ఈ ఛన్దస్ అక్కడ రామాయణంలో మానవ రూపంలో వచ్చిన భగవంతుని కథ చెప్పటానికి వాడబడింది. ఇక్కడ శ్రీవిష్ణు సహస్రనామం లో కూడా వాడబడింది.
పైగా,
ఓమ్ నమో నారాయణాయ
అనే మన్త్రరాజము అష్టాక్షరి. ఆ విధంగా అష్టాక్షరికి, అనుష్టుప్‌కు పొసగినది. అందుకే అనుష్టుప్ సహజ ఛన్దస్. విశ్వ ఛన్దస్. అందుకే తొలిగా వాల్మీకి నోట ఆదిపురుషుడైన శ్రీరాముని కథకు తోడ్పడింది.
స రి గ మ ప ద ని
ఈ వరుసలోనే
నమో నారాయణాయ ఉంది.
దానికి ఓంకారం చేరుస్తే తిరుమన్త్రముగా మారింది. ఓంకారముతో కలసి అష్టాక్షరిగా ఒప్పుచున్న మన్త్రమది. ఇక్కడ ఓంకారం మొదట ఉంచాము. స్వరాలలో స అన్నది చివరలో చేర్చారు.
లలితా సహస్రనామ స్తోత్రంలో ఎక్కువ నామములు స, మ తో ఉన్నాయి. అది సమ అనగా సమత్వాన్ని సూచిస్తుందని శ్రీ గరికిపాటి నరసింహారావు గారు చెప్పారు. స అనే అక్షరానికి, స్వరానికి ఉన్న ప్రత్యేకత అది.
నారాయణాయ నమ ఓమ్
ఓమ్ నమో నారాయణాయ.
సరిగ్గా అష్టాక్షరి ద్వారా మనకు అవగతమయ్యే పరబ్రహ్మ గురించి తెలిపే నామసహస్ర స్తోత్రాన్ని అనుష్టుప్ కాకుండా ఇతర ఛన్దస్‌లో ఎలా అందిస్తారు?
విష్ణువు యొక్క నామ సహస్రం చెప్పుకునేందుకు..
ఋషి – వేద వ్యాసుడు (ఉత్త వ్యాసుడు కాడు. గ్రహించాలి)
ఛన్దస్ – అనుష్టుప్
దేవత – దేవకీసుతుడు.
ఆ చతర్భుజ శ్రీమహావిష్ణువు సాకార రూపంలో.
॥నమామి విష్ణుం శిరసా చతుర్భుజమ్॥
ఆ ఋషుల హృదయాలలో ఉండేది కూడా ఆయనే.
యోగి హృద్ధ్యాన గమ్యం – యోగుల హృదయాలలో ఉండి వారికి ధ్యాన సమయంలో దర్శనమిచ్చునాడు. యోగి.. యోగము.. కలిసిపోయినవారు. అంటే భగవంతుని ఆలోచనలో ఉండి ఆయనలో లేదా ఆయన గురించిన ఆలోచనలలో కలిసిపోయినవారు.
ఆ యోగి హృద్ధ్యాన గమ్యం ఎవరు?
శ్రీమహావిష్ణువు!!!
అమృతాంశూద్భవో బీజం శక్తిర్దేవకినందనః।
త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే॥
అమృతాం శూద్భవ బీజము. దేవకీనన్దనుడు శక్తి. హృదయం.. త్రిసామ. ఈ మన్త్ర రూపంలో ఉన్న శ్రీవిష్ణు సహస్రనామముల మాలను లేదా ఈ స్తోత్రాన్ని శాంతి కొరకు ఉపయోగిస్తున్నాను. ధ్యానిస్తున్నాను. స్మరిస్తున్నాను. జపిస్తున్నాను.
శాన్తి కొరకు మాత్రమే వినియోగిస్తున్నాను.
శాన్తి + అర్థే = శాన్త్యర్థే
శాన్తి కొరకు. లేదా.. శాన్తిని నిలుపుటకు లేదా శాన్తిని కలిగించేందుకు (ధరణికి) చేసే యుద్ధములో విజయం కొరకు.
ఈ కలి కాలంలో ధర్మాన్ని ఆచరించటమే కాదు. ప్రయత్నపూర్వకంగా గెలిపించాలి. పనికట్టుకుని మరీ గెలిపించాలి. లేదా అధర్మం గొప్పదని అటువైపే వెళ్తారు మానవులు.
తిమిరు పుదిచవాన్ లేదా తెలుగులో రోషగాడు అనే విజయ్ ఏన్టనీ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. అది పై అర్థాన్నే ఇంచుమించుగా చెప్తుంది. సినిమా మొత్తం దీని గురించే కథ. మంచిని గెలిపించాలి. ఒకవేళ మంచి గెలవలేని స్థితిలో ఉంటే పనికట్టుకుని మరీ ఆ మంచికి సహాయం చేసి గెలించాలి. లేకపోతే యువత చెడు (సినిమాలో రౌడీజమ్) మీద వ్యామోహం పెంచుకుంటారు.
అందుకే శాన్తికోసం చేసే పోరు కూడా శాన్త్యర్థే.. అర్థ సంపూర్ణంగా చెప్పుకుంటే లోకశాన్తి కొరకు లేదా లోకశాన్తి కోసం చేసే పోరాటంలో జయం కొరకు ఈ సహస్రనామ జపాన్ని.. వినియోగిస్తాను. లేదా వినియోగించాలి.
విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్।
అనేకరూప దైత్యాన్తం నమామి పురుషోత్తమమ్॥
అనేక రూపాలలో ఈ భూమిని కబళింపజూసిన అధర్మాన్ని అంతం చేసి, శిష్టరక్షణ చేసిన ఆ పురుషోత్తమునకు నా నమస్సులు. అఞ్జలి ఘటిస్తున్నాను.
ఆ పురుషోత్తముడు ఎవరయ్యా అంటే..
విష్ణువు.
జిష్ణువు.
మహావిష్ణువు.
మహేశ్వరుడు అయిన వాడు.
ఈశ్వరః – సర్వులనూ పాలించి పోషించువాడు. అన్నింటిపై సకలాధిపత్యము గలవాడు. మరే విధమైన సహాయము, ప్రమేయము లేకుండా, ఇచ్ఛామాత్రముగా, లీలామాత్రముగా ఏదైనా చేయగలవాడు. ఆ మహేశ్వరుడు ఎవరంటే..
పురుషోత్తముడు. అంటే సకల చరాచర జీవులలో అత్యున్నతుడు. వాటిని మించినవాడు. వాటన్నిటినీ తనలో కలిగి ఉన్నవాడు. వాటి బయటా ఉన్నవాడు.
He is a Complex Number field.
A Complex Number Field contains Natural Numbers that start from 1, the whole numbers that start with 0, Integers which add negative numbers that move in the opposite direction on the Number-line, Rational Numbers (p/q form), Irrational Numbers which also contain transcendental numbers which have decimal section that go on till infinity without repeating a pattern like Pi and e. And then the Real Numbers.
But the Universe doesn’t just contain real numbers. It is peppered with imaginary numbers. Imaginary just doesn’t mean they don’t exist. It actually means that they fall in the category that we, the humans cannot realise or fathom in our LIVEs with the limited means we have.
The most famous imaginary number is ‘i’.
i = ✔️(-1).
ఇక్కడో చిత్రం ఉంది. తెలుసుకుందాం.
ఒకసారి ఈ i ని i తోనే హెచ్చవేద్దాం.
అంటే i x i.
i x i = -1.
ఇంకో i జతచేద్దాం. మనకు -i వస్తుంది. ఇప్పుడు మరొక్కసారి i ని జోడిద్దాము.
-i x i.
-i x i = -i² = -(-1) = 1.
ఇదే మోక్షం. 1 కావటం. పరమాత్మతో ఒకటి కావటం. ఐక్యం కావటం. I యాదృచ్ఛికమా? Aye యాదృచ్ఛికమా? (Aye is also pronounced like i and means yes).
కానీ మోక్షం అంటే అందరికీ అవగతం కాదు. అందుకే దాన్ని కాసేపు i అనుకుందాం. ఈ i అన్నది ఎవరికీ అర్థం కాని బ్రహ్మ పదార్థం (పరార్థం).
అది కావాలి అనే ఇచ్ఛ మనకు కలగాలి. ఆ ఇచ్ఛ కూడా కామం. ఆ కామాన్ని (మోక్షేచ్ఛ) తీర్చుకొనుటకు మనకు పనికి వచ్చే సాధనం… అర్థం.
గ్రహించాలి. అర్థం అంటే డబ్బు మాత్రమే కాదు. అవగతం చేసుకోవటం. దేన్ని అవగతం చేసుకోవాలి?
ధర్మం!
అది ఎల్లప్పుడూ ఒకటే. ఆ ఒకే ఒక్క ధర్మము పరమాత్మయే.
కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణమ్।
స్తువన్తః కం కమర్చన్తః ప్రాప్నుయుర్మానవాః శుభమ్॥
కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః।
కిం జపన్ముచ్యతే జన్తుర్జన్మసంసారబంధనాత్॥
దీని గురించే.
ఈ ఒకటీ తెలుస్తే.. కాదు కాదు. అవగతమౌతే.. కాదు కాదు మనలో జీర్ణించుకునిపోతే.. అప్పుడు మోక్షం పొందగలము.
ధర్మం. మనం చేయగలిగినది. ఆచరించదగినది. దాని ఫలితం మోక్షం. ఎవరికి పడితే వారికి అర్థం కాదు. It’s a complex number ‘i’.
ఎంత వైరుధ్యం!
విష్ణు సహస్రనామములలో ఇలాంటి వైరుధ్యమైన నామాలు ఎన్నో ఉన్నాయి. వాటిని గురించి సమయం వచ్చినప్పుడు మనకే అర్థ సంపూర్ణం అవుతుంది.
అటు పైన వచ్చేవి అఙ్గన్యాస కరన్యాసాలు.
వాటిని వివరంగా చూద్దాం.
॥కృష్ణం వన్దే జగద్గురుమ్॥
(సశేషం)