[box type=’note’ fontsize=’16’] విలువలున్న మానవజాతికీ, క్షుద్రశక్తులున్న మాంత్రికులకీ…. అంటే మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటాన్ని ఒక స్పేస్ ఒపెరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలగా అందిస్తున్నారు డా. చిత్తర్వు మధు. తెలుగు సేత: కొల్లూరి సోమ శంకర్. [/box]
అధ్యాయం 16: లా గరె అమృత’ నుంచి ‘లా డెర్నియర్’కు
[dropcap]ఇ[/dropcap]ది అన్ని ఇతర రైల్వే స్టేషన్ల లానే ఉంది.
‘లా గరే అమృత’ చంద్రునిలో అతి పెద్దది. ఇది చంద్రగ్రహం రాజధాని నగరం నుండి ఉత్తర ధ్రువానికి వెళుతుంది. ప్రశాంత సముద్రం చివరలో చీకటి వైపు ప్రారంభమయ్యే చోట ఉన్న ‘లాడెర్నియర్’ స్టేషన్ చివరిది.
సాయంత్రం 6.00 గంటలకు ‘లా గరే అమృత’ నుండి బయల్దేరే సదరన్ ఎక్స్‌ప్రెస్ కోసం నేను, కుజగ్రహవాసి వాన్ కు జాక్, గనీమీడ్‌కి చెందిన ఏనిమాయిడ్, టైటాన్‌వాసి డిమిట్రి చంద్రగ్రహ నివాసి చాంద్ ఆఫ్ మూన్ కోసం ఎదురుచూస్తున్నాం. ఈ స్టేషన్ భూగర్భ నగరం యొక్క చివరన ఎత్తయిన ప్రదేశంలో నిర్మించబడింది. ప్రయాణికులు అక్కడికి ఎస్కలేటర్లపై వెళతారు. ఈ స్టేషన్ ప్రవేశమార్గం కోడి గుడ్డు ఆకారంలో ఓ పొడుగాటి గొట్టంలా ఉంది. దీన్ని లావా ట్యూబ్‌లో నిర్మించారు. చంద్రుడిలో ఉన్న అనేక లావా ట్యూబులలో రైళ్ళు ప్రయాణిస్తాయి. మేగట్నిక్ లెవిటేషన్ వ్యవస్థలో నిర్మితమైన మాగ్నటిక్ ట్రాక్ పైన రైలు గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అందువల్ల వాయు ప్రయాణంతో పోలిస్తే రైలు ప్రయాణమే సౌకర్యవంతంగా ఉంటుంది. చంద్రునిపై తక్కువ గురుత్వాకర్షణ ఉండడం, మరియు గాలి లేని కారణంగా – భూమి మీద రైళ్ళు ప్రయాణించే వేగానికి అనేక రెట్లు అధిక వేగంతో ఇక్కడి రైళ్ళు ప్రయాణిస్తాయి. ప్రతీ బోగీని సీల్డ్ స్ట్రక్చర్‌గా నిర్మించి, లోపల భూమి గురుత్వాకర్షణ కల్పించి, ఆక్సీజన్ సరఫరా చేయడంతో – కాస్మిక్ రేడియేషన్, ప్రాణవాయువు సరఫరా, గురుత్వాకర్షణ సమస్యలు పరిష్కరించబడ్డాయి. భూమిపై రైళ్ళలో లానే ఇక్కడి రైళ్ళ బోగీలలో ఉన్న బెర్తులపై కూర్చోవచ్చు, నడవచ్చు, మాట్లాడుకోవచ్చు, నిద్రపోవచ్చు.
మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన మనిషి మాకు రిజర్వు చేయబడిన స్లీపర్ కంపార్ట్‌మెంట్‍ని చూపించాడు. ఆహార పొట్లాలను అందించాడు. మేము చాలా ఎక్కువ సామాన్లతో ప్రయాణిస్తున్నాం.
అవును, మేము లా డెర్నియర్ స్టేషన్‌లో దిగాకా మా ఇబ్బందులు మొదలవుతాయి. చీకటి వైపున ఉన్న క్రేటర్లలకి మా అంతట మేముగా వెళ్ళాలి. అందుకని మాకు చంద్రుని రోవర్ క్రాప్ట్, ఆక్సిజన్ సిలిండర్లు, పొజిషనింగ్ పరికరాలు, బ్యాటరీతో పనిచేసే దీపాలు, లేజర్ గన్స్, నిల్వచేయబడిన ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు టిన్‌లు, మరియు టిన్‌లలో ఫలాలు, త్రాగునీరు 15 రోజులకి సరిపోయంతగా సరఫరా చేయబడ్డాయి. ప్రతి ఒక్కరూ అతని ఆక్సీజన్ సిలిండర్, నీరు, ఆహారం, బట్టలు మోసుకువెళ్ళాలి.
చంద్రుడి చీకటి భాగంలో ఎక్కడికి వెళ్ళాలి?
ఇది బాగా వేధించే ప్రశ్న. విశ్వశక్తిని ప్రయోగించగల వ్యక్తుల బృందంగా మేము పరిష్కారం కనుగొనాల్సిన ప్రశ్న.
అన్నీ తెలిసిన యురేకస్‌ని అడిగాను, చంద్రుడి చీకటి వైపున విద్యుదయస్కాంత శక్తిని గుర్తించగలమా అని. గ్రహాంతర దుష్ట తాంత్రికులు జరిపిన కొన్ని విద్రోహ చర్యలు లేదా వ్యక్తీకరణల వల్ల అక్కడక్కడా విద్యుదయస్కాంత ‘అలజడి’ సంభవించింది, కానీ అది చంద్రుడి చీకటి వైపున కాదు.
“వాళ్ళకి చంద్రుని చీకటి భాగంలో విద్యుదయస్కాంత సంకేతాలు లభించడం లేదు, పైగా వాళ్ళు వాటి కోసం శోధించడం లేదు. సంకేతాలు చాలా బలహీనంగా ఉన్నాయి, ఎందుకంటే చీకటి భాగంలో కాస్మిక్ రేడియేషన్ సంకేతాలను నియంత్రిస్తుంది. అయితే నేను లా గ్రాంగియన్ పాయింట్ ఎల్11 వద్ద ఉపగ్రహంపై హ్యాకింగ్ చేసి వాళ్ళని గుర్తించగలను” చెప్పింది యురేకస్
“అది ఏమిటి? “
“సౌర వ్యవస్థలో ఎల్-వన్ నుంచి ఎల్. ఫైవ్‌కి విద్యుదయస్కాంత సంకేతాలు లభ్యమయ్యే ఐదు పాయింట్లు ఉన్నాయి. ఎల్11 లోని ఉపగ్రహం చంద్రుని వెలుపల ఉన్న అన్ని సిగ్నల్స్ మరియు డేటాను చురుకుగా నమోదు చేస్తుంది.”
“సరే. నాకు అర్థమైంది. అయితే, చంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ తెలుసుకోలేనిది నువ్వు కనుగొన్నావన్న మాట.”
“అవును. ఇటు చూడండి!” అంటూ యురేకస్ తన ఛాతి భాగం చూపించింది. యురేకస్ లోహపు ఛాతి మెరుస్తూ కాంతివంతంగా ఉంది. దాని మీద చంద్రుడి చీకటి భాగంలోని ప్రకృతి దృశ్యం కనిపించింది. మరియా అని పిలవబడే, నల్లటి అగ్నిపర్వత ధూళి ప్రదేశాలు, ఇంకా నిర్మానుష్యమైన క్రేటర్స్. ఉన్నట్టుండి ఓ ఇగ్లూ ఆకారపు నిర్మాణంలో చీకటి చుట్టూ 10 ఎరుపు రంగులో వెలుగు చుక్కలు కనబడ్డాయి. మళ్ళీ మళ్ళీ కనబడ్డాయి. కింద పేర్కొన్న తేదీలులో అవి బాగా వెలిగి ఆరిపోయినట్లుగా తెలుస్తోంది. ఆ డేటాతో చంద్ర అక్షాంశం మరియు రేఖాంశాలు సరిపోతున్నాయి. డేటా గత 2 నెలల కాలానిది. క్షీణించిన ఎరుపు వెలుగు చుక్కలన్నీ చాలా వరకు ఒకే చోట ముగిసాయి.
లా డెర్నియర్ రైల్వే స్టేషన్! ఇప్పుడు మెరుస్తున్న ఎర్రటి వెలుగు చుక్కలు ఒక పెద్ద గుమ్మటం ఆకారంలోని ఇగ్లూ లోపల ఉన్నాయి!
గతానుభవపు భావన.
ఆ ఇగ్లూని ఇంతకుముందు నేను నా పీడకలలో చూశాను.
అప్పుడు ఒక భయంకరమైన రహస్యోద్ఘాటన నా మనసులో మెదిలింది.
“ఎందుకు? గ్రహాంతరవాసులు అక్కడే ఎందుకు ఉంటున్నారు? ఎందుకు ఇప్పుడే చురుకుగా ఉన్నారు? వాళ్ళు తరచూ లా డెర్నియర్ స్టేషన్ ద్వారా చంద్రుడి యొక్క ప్రకాశించే వైపుకు వస్తున్నారు…”
“ఆ ఇగ్లూ కట్టడంలో వాళ్ళు నిరంతరం విశ్వశక్తిని ఉపయోగిస్తూ, చురుకుగా ఉంటున్నారు. బహుశా మనుగడ కోసం ఉష్ణాన్ని, శక్తిని సృష్టించడానికి కావచ్చు. అద్భుతం… నమ్మశక్యంగా లేదు! వాళ్ళు కుజగ్రహపు తాంత్రికుల కన్నా వందల రెట్ల శక్తివంతులైన ఇతర గ్రహాంతర తాంత్రికులై ఉండాలి. బలవత్తరమైన విశ్వశక్తి!” ఆశ్చర్యంగా చెప్పాను.
“అవును మాస్టర్! వాళ్ళ విశ్వశక్తిది 10,000 నుంచి 15,000 నక్షత్రాల స్థాయిగా అంచనా వేయవచ్చు. వాళ్ళు ఈ వ్యవస్థ నుండి రాలేదు. బహుశా ఆల్ఫా మరియు ప్రాక్సిమా సెంటారి జంటతారల చుట్టూ ఉండే కెప్లర్ సిస్టం నుండి వచ్చి ఉంటారు, ఐది ఇక్కడికి 4.5 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది… నేను వారి గురించి అధ్యయనం చేసాను. కెప్లర్ బి గ్రహంలో చాలా పరిణమిత జీవ రూపాలు ఉన్నాయి. కానీ వాళ్ళంతా పిసియుఎఫ్‌లు. దుష్టశక్తులు. ఆల్ఫా వ్యవస్థలోనూ, సౌర వ్యవస్థలోనూ ఉండే గ్రహాలలో ఒక రహస్య సామ్రాజ్యాన్ని విస్తరించే ఉద్దేశమున్న దళాలు.” వివరించింది యురేకస్.
“నిజమే యురేకస్! నా పీడకల సరైనదే అయితే, ఈ దుష్ట శక్తులు ఇప్పుడు సమూరాకు సహాయపడుతున్నాయి. వాళ్ళు సయోనీని కూడా పునర్జీవింపజేశారు. నేను కలలో చూసిందంతా సరియైనదని నేను భావిస్తున్నాను. “
యురేకస్‌కి నవ్వటం రాదు. “మాస్టర్! నాలో కలలను విశ్లేషించే సాఫ్ట్‌వేర్ ఉంది. మీరు మీ కలలో లేదా పీడకలలో చూసినట్లయితే అది ఒక ఉపచేతన భయం కావచ్చు. కాబట్టి దానినుంచి నిగమనం చేయడంలో జాగ్రత్తగా ఉండండి. ఒక పీడకల యొక్క యథార్థతకు నేను హామీ ఇవ్వలేను” అంది.
” కావచ్చు. కానీ మనం అక్కడికి వెళ్ళి చూసొద్దాం. అయితే ఈ విషయాన్ని మంత్రిగారికి చెప్పాలా వద్దా? లేదా మనంతట మనమే వెళ్దామా?”
“ముందు మనం వెళ్ళి ఆ ప్రాంతాన్ని గమనిద్దాం. మనకి నిర్ధారణ అయినప్పుడు మాత్రమే చంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిద్దాం. మనం లా డెర్నియర్ దాటి చంద్రుడి చీకటి భాగంలోకి ప్రవేశిద్దాం. మనం విశ్వశక్తిని ఉపయోగించి అదృశ్య రూపంలో వెళ్దాం. మన దగ్గర ఎలాగూ గాడ్జెట్లు, ఆయుధాలు ఉన్నాయి. ధృవీకరించుకుని తిరిగి వచ్చేద్దాం” అన్నారు వాన్ కు జాక్, చాంద్.
డిమిట్రీ, ప్రకృతి ఏమీ మాట్లాడలేదు.
“ఆల్ఫా వ్యవస్థకి చెందిన 10000 నక్షత్రాల స్థాయి ఉన్న శక్తివంతులైన గ్రహాంతర మాంత్రికులతో మనం పోరాడగలమా? మంత్రిగారికి ఎందుకు చెప్పకూడదు? “
“మనం పోరాడడం లేదు” అన్నాడు వాన్ కు జాక్. “పైగా, చాంద్ ఇక్కడే ఉన్నాడు. అతను మా సంధానకర్త కదా. అతను మాతో వస్తాడు…!”
“మనం వెళ్ళి చూసి, నిర్ధారిద్దాం. ఇది నాకు చాలా పేరు తెస్తుంది. ఇది ప్రమాదకరమైనదే కానీ…”
“హే హనీ, అక్కడికి వెళ్దాం. అక్కడ ఏముందో చూద్దాం. చీకటిలోనే తిరిగి వచ్చేద్దాం. నాకు పిల్లి కళ్ళు ఉన్నాయి. అదృశ్య రూపాన్ని నిరవధికంగా ఉపయోగించగల శక్తి ఉంది. కానీ మీ ఆవిడ ప్రకృతే కాస్త బలహీనంగా ఉంది…” అంది డిమిట్రీ.
“లేదు. నేను కూడా సరదాలో భాగంగా ఉండాలనుకుంటున్నాను!!” చెప్పింది ప్రకృతి.
ఇది నాకు చాలా కఠినమైన నిర్ణయం. ఇదేమీ సరదా పర్యటన కాదు. అసలు చంద్రగ్రహపు నేలలే కఠినమైనవి అనుకుంటే, చీకటి భాగం మరింత కష్టంగా ఉంటుంది. కుజుడి మీద రోవర్స్‌పై ప్రయాణించినట్టే, చంద్రుడి మీద కూడా రోవర్ క్రాఫ్ట్ ద్వారా ప్రయాణించవలసి ఉంటుంది. స్పేస్ సూట్లు ధరించి ఆక్సిజన్ సిలిండర్లు మోసుకుంటూ మేము శాటిలైట్ ఫోన్ల ద్వారా ఒకరితోఒకరం మాట్లాడుకోవాలి. దుష్ట గ్రహాంతరవాసుల కోసం అన్వేషించాలి. కానీ అమృతా కాలనీ లోని హోటల్‌లో ఉండడానికి ఆమెను ఒప్పించడం నాకు కష్టమైంది. మేమిక్కడికి వచ్చింది సందర్శనకి కాదు, షాపింగ్ కోసం కాదు, చంద్ర నాగరికత గురించి తెలుసుకునేందుకు కాదు.
ఒక భారతీయ గ్రామీణ భార్య ఎంత పట్టుదలగా ఉంటుందో, నా ప్రియమైన ప్రకృతి కూడా అంతే మొండిగా ఉంటుంది.
ఆమె ఎర్రని పెదవులు వణుకుతున్నాయి, నల్లటి కళ్ళలో దృఢనిర్ణయం కనబడుతోంది.
“నేను మీకు సాయపడగలను హనీ! నేను మీతో వస్తాను.” చెప్పింది ప్రకృతి.
***
రైలు బయల్దేరింది. త్వరలోనే మేము పీడనం ఉన్న కంపార్ట్‌మెంట్లలో కూచుని విపరీతమైన వేగంతో ప్రయాణిస్తున్నాం. ఇక స్పేస్ సూట్లను తొలగించవచ్చు, ఆక్సిజన్ సరఫరా ఉంది. గ్రావిటీ సాధారణమైంది. రైలు విపరీతమైన వేగంతో ప్రయాణిస్తుడంతో కిటికిలోంచి చంద్రుడి ప్రకృతి దృశ్యాలు చూడలేము. అందుకని ఓ తెరపై మానిటర్ ద్వారా బయట స్థలాలు మరియు స్థలాకృతిని చూపిస్తారు.
బూడిద రంగు క్రేటర్లు, పర్వతాలు మరియు అప్పుడప్పుడు రైల్లో ప్రయాణించే సైనికులు, వాతావరణ శాస్త్రవేత్తలకు కోసం ఉన్న చిన్న స్టేషన్లను దాటుకుంటూ రైలు వేగంగా సాగుతోంది. ఎర్త్ ఫుడ్‌ని ఆర్డర్ చేశాము. దాంతో పాటు కాస్త రెడ్ వైన్ కూడా. ప్రయాణాన్ని, భోజనాన్ని ఆస్వాదించాము. ముఖ్యంగా ఏనిమాయిడ్‌కి రెడ్ వైన్ బాగా నచ్చింది.
చాంద్ ఒక పాట పాడితే, వాన్ కుక్ జాక్ కుజగ్రహపు నృత్యంలోని చిన్న అంశాలను ప్రదర్శించాడు.
డిమిట్రీ అప్పుడప్పుడు వ్యాఖ్యానిస్తూ, నిట్టూరుస్తూ ప్రయాణాన్ని ఆస్వాదిస్తోంది. “టైటాన్ మీద మాకు ఎటువంటి రైళ్లు లేవు. మాకు భూగర్భ లిఫ్టులు మాత్రమే ఉన్నాయి. నాకు రైళ్ళంటే చాలా ఇష్టం. భూమిపైన విడుదలైన రైలు సినిమాలు కూడా నాకెంతో ఇష్టం – 20వ శతాబ్దానికి చెందిన ‘ది గ్రేట్ ట్రైన్ రాబరీ’, ‘ఓరియంట్ ఎక్స్‌ప్రెస్’ లాంటివి. ఇక్కడ పైరేట్స్ దాడి చేయరనే ఆశిస్తున్నాను. హా! హ! హ!” అంటూ నవ్వింది.
మా రైలు చంద్రుని ఉపరితలంమీద మాగ్నెటిక్ ట్రాక్ పైన బిలాలు, కొండల మధ్య తన శరీరాన్ని వంపులు తిప్పుతూ పాకే నీలి-నలుపు జీవిలా వేగంగా కదులుతోంది. కాసేపట్లో మా బృందం సభ్యులందరూ కలలు రాని నిద్రలోకి జారుకున్నారు.
నేను తప్ప. నేను కళ్ళద్దాలు ధరించి ఇంటర్‌గెలాక్టిక్ నెట్ బ్రౌజ్ చేయసాగాను. ఇది సీట్లకి జోడించిన గాజు తెరలలో నేరుగా కనిపిస్తుంది.
నేను ఆల్ఫా సెంటారీ సిస్టమ్ మాంత్రికులు, విశ్వశక్తి, అండర్‌గ్రౌండ్ ఆర్గనైజేషన్స్, సౌర వ్యవస్థలో దాచబడి ఉన్న అద్భుత వస్తువులు, చంద్రునిపై దాచబడి ఉన్న ‘మిర్రర్ ఆఫ్ కమ్యూనికేషన్స్’ యొక్క శోధించాను.
ఇంటర్ గెలాక్టిక్ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెప్పింది:
“వేలాది సంవత్సరాల క్రితం అనుభవజ్ఞులైన మాంత్రికుల సంఘం (ఎస్.ఎస్.డబ్ల్యూ – సిండికేట్ ఆఫ్ సీనియర్ విజర్డ్స్) ద్వారా దాచబడిన పురాతన అద్భుత వస్తువులలో చంద్రునిపై ఉన్న ‘మిర్రర్ ఆఫ్ యూనివర్సల్ కమ్యూనికేషన్స్’ ఒకటి. ఇది ఆధునిక ఉపగ్రహము లేదా ఇంటర్నెట్ పరికరాల వంటిది. మిల్కీ వే గెలాక్సీలో ఎక్కడ ఏ ప్రాంతంనైనా వీక్షించగల సామర్థ్యం కలిగి ఉంది. సుదూరంగా ఉన్న తాంత్రికులతో సంభాషణ చేయించగల సామర్థ్యం ఈ అద్దానికి ఉంది. దుష్ట తాంత్రికుల నుండి రక్షించడానికి చంద్రునిపై దాచబడింది. ఆధునిక చంద్రుడి యొక్క మ్యాప్‌లలో పేర్లు ఉన్న ఐట్కెన్ పర్వతం లేదా మలేపెర్ట్ పర్వతంపై దాచబడి ఉండవచ్చు. ఇది స్వచ్ఛమైన, నిస్వార్థమైన, చెడు కోరికలు లేని పిసియుఎఫ్‍కి మాత్రమే కనబడుతుంది. వారే ఎంపిక జేయబడిన వ్యక్తి అని అనుభవజ్ఞులైన మాంత్రికులు చెబుతారు. ఎవరు మాంత్రికులు, ఎవరు ఎంపిక జేయబడిన వ్యక్తి ఎవరు అనే విషయాలలో వివాదం ఉంది. ఒకే విధమైన విశ్వ స్పందనతో విశ్వశక్తిని ఉపయోగించగల సామర్థ్యాన్ని కలిగిన జన్యు నిర్మాణం లేదా ఉత్పరివర్తనాలను ఒకరు లేదా చాలా మంది పొంది ఉండవచ్చు. అయితే, ఇటువంటి ప్రతిపాదనలకు ఏ ఆధారమూ లేదు. అమృత ఔషధం, వెండి కొవ్వొత్తి, జుపిటర్ వాండ్ వంటి ఇతర అద్భుత వస్తువులు వరుసగా కుజుడు, భూమి మరియు గనీమీడ్‍లపై దాచబడి ఉన్నాయి.
ఎన్సైక్లోపెడియాలో ఇటువంటి లింకులు మరియు శీర్షికలు చాలా ఉన్నాయి.
అవన్నీ నిజమని నాకు తెలుసు.
ఎందుకంటే, మౌంట్ ఒలంపస్‍పైన అమరత్వం ప్రసాదించే అమృత ఔషధం, ఆమ్రపాలిలోని భైరవాలయంలో వెండి కొవ్వొత్తిని నేను ఇప్పటికే గుర్తించాను.
ఇప్పుడు నేను మలపేర్ట్ పర్వతం, ఐట్కెన్ పర్వతం కోసం వెతకటం ప్రారంభించాను.
నేను బాగా నిరుత్సాహపడ్డాను, ఎందుకంటే ఆ రెండు పర్వతాలు చంద్రుని యొక్క ప్రకాశించే భాగంలో ఉన్నాయి. అవి చీకటి వైపున లేవు.
మరిక మేము చంద్రుడి చీకటి వైపు ఎందుకు వెళ్ళడం? ఏమైనా ప్రయోజనం ఉంటుందా?