[మాయా ఏంజిలో రచించిన ‘Artful Pose’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]
(సాఫీగా సాగే దారుల వెంట కళాకారులు ప్రయాణించడాన్ని ఇష్టపడరని చెప్పే కవిత.)
~
[dropcap]రా[/dropcap]లి పడుతున్న ఆకులు
కరిగిపోతున్న హిమం
తమ ఆనందంలో తామున్న పక్షులు
తమ పాటలకు బాణీలు కూర్చి
ఆలపించే కవులు కొందరు
నా రాత్రులను
మృదు మధురం చేస్తారు
నా కలం ఆగిపోతుంది
ఆ ప్రశాంత నిశ్శబ్ద దారుల వెంట
వెళ్ళనంటుంది
ప్రేమికుల తప్పుల గురించి
నేను రాయాల్సిన అవసరముంది
ఇంకా,
ద్వేషం..
విద్వేషపూరితమైన
భావోద్వేగాల గురించి..
నేను రాయాల్సి ఉంది!!
~
మూలం: మాయా ఏంజిలో
అనువాదం: హిమజ
‘మాయా’ మాటలు:
- విజ్ఞత గల మహిళ ఎవరికీ శత్రువుగా మారాలని కోరుకోదు. అలాగే ఎవరివల్లా గాయపడడాన్ని కూడా తెలివైన మహిళ తిరస్కరిస్తుంది.
- ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మార్చుకునేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నించాలి.
- సానుకూల వైఖరితో జీవితాన్ని సంపూర్తిగా జీవించండి. సాధ్యాసాధ్యాల సానుకూలతల పట్ల దృష్టి కేంద్రీకరించండి.
- ఎవరికైనా సరే, నువ్వొక ఎంపికవి (option) మాత్రమే అయినప్పుడు, వాళ్ళనెపుడూ నీ ప్రాధాన్యతా (priority) జాబితాలో ఉంచుకోకు.
- సత్యానికి నిజానికి మధ్య ఒక ప్రపంచమంత భేదం ఉంది. నిజాలు సత్యాన్ని కప్పేస్తాయి.
- జీవించడం, బ్రతకడం రెండూ ఒక్కటి కాదని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను.