సినిమా క్విజ్-65

0
2

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. తమిళ చిత్రం ‘కుముదం’ (1961) ఆధారంగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని, సావిత్రి, జానకి, నాగభూషణం నటించిన ‘మంచి మనసులు’ (1962) చిత్రాన్ని హిందీలో ఏ. భీంసింగ్ దర్శకత్వంలో, ధర్మంద్ర, మాలాసిన్హా, అశోక కుమార్ లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  2. కమలాకర కామేశ్వర రావు దర్శకత్వంలో విజయా వారు ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్., సావత్రి, జమున, ఎస్.వి. రంగారావులతో తీసిన ‘గుండమ్మ కథ’ (1962) చిత్రం హిందీలో పి.సాంబశివ రావు దర్శకత్వంలో సంజీవ్ కుమార్, శశికపూర్, మౌసమి చటర్జీ, విద్యా సిన్హా లు నటించగా ఏ పేరుతో రీమేక్ అయింది?
  3. తమిళ చిత్రం ‘పాశమలర్’ ఆధారంగా దర్శకుడు వి. మధుసూదన రావు – ఎన్.టి.ఆర్, కాంతారావు, సావిత్రి, దేవిక, రేలంగి లతో తీసిన ‘రక్తసంబంధం’ (1962) చిత్రాన్ని హిందీలో ఎ. భీంసింగ్ దర్శకత్వంలో అశోకకుమార్, వహీదా రెహ్మన్, ప్రదీప్ కుమార్, మహమూద్ నటించగా ఏ పేరుతో రీమేక్ చేశారు?
  4. తమిళ చిత్రం ‘పడిక్కామెదమేదె’ ఆధారంగా, సారధీ స్టూడియోస్ వారు రామకృష్ణ దర్శకత్వంలో ఎన్టీఆర్, ఎస్.వి.ఆర్, సావిత్రి, కన్నాంబలతో తీసిన ‘ఆత్మబంధువు’ (1962) చిత్రాన్ని, హిందీలో ఎ. భీంసింగ్ దర్శకత్వంలో సునీల్ దత్, నూతన్, అశోక్ కుమార్ లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  5. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో, అక్కినేని, సావిత్రి, జమున లతో తీసిన ‘మూగమనసులు’ (1964) చిత్రాన్ని – హిందీలో సునీల్ దత్, నూతన్, జమునలతో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  6. చాణక్య దర్శకత్వంలో ఎన్టీఆర్ (ద్విపాత్రలు), జమున, ఎస్.వి.ఆర్, రాజనాల, రేలంగి లతో డి.రామానాయుడు తీసిన ‘రాముడు-భీముడు’ (1964) చిత్రం – విజయ్ ఇంటర్‍నేషనల్ బ్యానర్ పై దిలీప్ కుమార్ (ద్విపాత్రలు), వహీదా రెహ్మాన్, ప్రాణ్ లతో చాణక్య దర్శకత్వంలో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  7. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఎన్టీఆర్, బి.సరోజాదేవి, గుమ్మడి, పద్మనాభంలు నటించిన ‘దాగుడు మూతలు’ (1964) చిత్రాన్ని హిందీలో ధర్మేంద్ర, సైరా బాను, నజీర్ హుస్సేన్‌లు నటించగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  8. ‘నానుమ్ ఒరుపెణ్’ అనే తమిళ చిత్రం ఆధారంగా, ఎ.సి. త్రిలోక్ చందర్ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., ఎస్వీరంగారావు, సావిత్రి, జమున, హరనాథ్‌లతో తీసిన ‘నాదీ ఆడజన్మే’ (1965) చిత్రాన్ని హిందీలో ఎస్వీఆర్, ధర్మేంద్ర, మీనా కుమారి, ఎ.వి.ఎం. రాజన్, పుష్పలతలు నటించగా ఎ.సి. త్రిలోక్ చందర్ దర్శకత్వంలో ఏ పేరుతో రీమేకే చేశారు?
  9. ‘కర్పగం’ అనే తమిళ చిత్రం ఆధారంగా, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఎన్టీఆర్, భానుమతి, జమున, ఎస్వీరంగారావులతో తీసిన ‘తోడునీడా’ (1965) చిత్రాన్ని దర్శకుడు కె.ఎస్. గోపాలక్రిష్ణన్ హిందీలో రాజ్ కుమార్. నూతన్, జమనలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  10. తమిళ చిత్రం ‘నవరాత్రి’ ఆధారంగా, 1966లో తాతినేని రామారావు దర్శకత్వంలో ‘నవరాత్రి’ చిత్రంలో అక్కినేని, సావిత్రి నటించారు. ఈ సినిమాని హిందీలో ఎ. భీంసింగ్ దర్శకత్వంలో సంజీవ్ కుమార్, జయబాదురి లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 డిసెంబర్ 05 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 65 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 డిసెంబర్ 10 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 63 జవాబులు:

1.ఇన్సానియత్ (1955) 2. షాదీ కే బాద్ 3. జీనే కీ రాహ్ (1969) 4. పడోసన్ (1968) 5. రాజా ఔర్ రంక్ (1968) 6. బహార్ (1951) 7. బహురాణి (1963) 8. మిస్ మేరీ (1957) 9. బేటీ బేటే (1964) 10. మన్ మౌజీ (1962)

సినిమా క్విజ్ 63 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • మణి నాగేంద్ర రావు బి.
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.ఆర్. మూర్తి
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు
  • వనమాల రామలింగాచారి
  • జి. స్వప్నకుమారి
  • టి. మమన్ బాబు
  • దీప్తి మహంతి
  • కొన్నె ప్రశాంత్
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here