సినిమా క్విజ్-66

0
3

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. తమిళ చిత్రం౦ ‘కుళందయుం దైవముం’ ఆధారంగా ఎవిఎం వారు తెలుగులో జమున, హరనాథ్, జి. వరలక్ష్మి, బేబీ పద్మిని (డబుల్ రోల్), రేలంగిలతో కృష్ణన్-పంజుల దర్శకత్వంలో తీసిన ‘లేత మనసులు’ చిత్రాన్ని కృష్ణన్-పంజుల దర్శకత్వంలోనే బిస్వజీత్, మాలా సిన్హా, బేబీ నీతూ సింగ్, ఓం ప్రకాష్‍లతో ఏ పేరుతో హిందీలో రీమేక్ చేశారు?
  2. 1967లో వచ్చిన ‘భలే కోడళ్ళు’ చిత్రంలో ఎస్.వి.రంగారావు, జానకి, జయంతి, కాంచనలు కె. బాలచందర్ దర్శకత్వంలో నటించగా, ఈ చిత్రాన్ని హిందీలో పృథ్వీరాజ్ కపూర్, అమేష్ దేవ్, రాజేంద్రనాథ్, జానకి, కాంచన, జయంతి లతో దర్శకులు ఎస్.ఎస్. వాసన్, ఎస్.ఎస్. బాలన్‍లు ఏ పేరుతో రీమేక్ చేశారు? (క్లూ: తెలుగు సినిమా, తమిళ వెర్షన్ ‘భామా విజయం’ ఒకేసారి షూటింగ్ జరుపుకున్నాయి)
  3. కన్నడ చిత్రం ‘ఎమ్మె తమ్మణ్ణ’ ఆధారంగా 1968లో రాజ్యం పిక్చర్స్ వారు నాగేశ్వరరావు, భారతిలతో ‘గోవుల గోపన్న’ చిత్రాన్ని సి.ఎస్. రావు దర్శకత్వంలొ తీశారు. ఈ సినిమా హిందీలో జితేంద్ర, ముంతాజ్, పూనమ్‍లతో రవికాంత్ నగాయిత్ దర్శకత్వంలో ఏ పేరిట రీమేక్ చేశారు?
  4. తాతినేని రామారావు దర్శకత్వంలో అక్కినేని, జయలలితతలో తీసిన ‘బ్రహ్మచారి’ (1968) చిత్రాన్ని హిందీలో జితేంద్ర, ముంతాజ్, శత్రుఘన్ సిన్హా లతో కె. ప్రత్యగాత్మ దర్శకత్వంలో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  5. ‘కై కొడుత్త దైవమ్‌’ అనే తమిళ సినిమా ఆధారంగా, వి. రామచంద్ర దర్శకత్వంలో కృష్ణ, వాణిశ్రీ లతో తీసిన ‘మరపురాని కథ’ (1967) చిత్రాన్ని హిందీలో రవికాంత్ నగాయిత్ దర్శకత్వంలో అమితాబ్, తనూజలు నటించగా, ఏ పేరుతో రీమేక్ చేశారు?
  6. బి. విఠలాచార్య దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., కాంతారావు, జయలలిత, కృష్ణకుమారిలు నటించిన ‘చిక్కడు-దొరకడు’ (1967) చిత్రాన్ని హిందీలో ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో జితేంద్ర, రీనారాయ్, ప్రేమ్ కిషన్‍, బిందియా గోస్వామిలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  7. దాదా మిరాసి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., శోభన్ బాబు, ఎస్.వి.ఆర్., భానుమతి నటించిన ‘పుణ్యవతి’ చిత్రాన్ని సి.వి.శ్రీధర్ దర్శకత్వంలో అశోక్ కుమార్, రాజ్ కుమార్, బిస్వజీత్, మాలా సిన్హాలతో హిందీలో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  8. వి. మధుసూదన రావు దర్శకత్వంలో అక్కినేని, జయలలిత నటించిన ‘అదృష్టవంతులు’ (1969) చిత్రం హిందీలో జితేంద్ర, ముంతాజ్, ప్రేమ్ చోప్రాలతో రవికాంత్ నగాయిత్ దర్శకత్వంలో ఏ పేరుతో రీమేక్ అయింది?
  9. తమిళ చిత్రం ‘పందియము’ ఆధారంగా తాతినేని రామారావు దర్శకత్వంలో కృష్ణ, శోభన్‍బాబు, విజయనిర్మల నటించిన ‘మంచి మిత్రులు’ (1968) చిత్రాన్ని హిందీలో కె. శంకర్ దర్శకత్వంలో సంజీవ్ కుమార్, షమ్మీ కపూర్, సాధనలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  10. తమిళ చిత్రం ‘నాన్’ ఆధారంగా 1968లో వి. రామచంద్రరావు దర్శకత్వంలో కృష్ణ, కృష్ణంరాజు, నాగభూషణం, కాంచనలు నటించిన ‘నేనంటే నేనే’ చిత్రాన్ని హిందీలో టి.ఆర్. రామణ్ణ దర్శకత్వంలో జితేంద్ర, హేమమాలిని, ప్రేమ్ చోప్రా, మహమూద్ లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 డిసెంబర్ 12 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 66 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 డిసెంబర్ 17 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 64 జవాబులు:

1.శారద (1957) 2. ఘూంఘట్ (1960) 3. సాస్ భీ కభీ బహూ థీ 4. ససురాల్ (1961) 5. ఘరానా (1961) 6. నజరానా (1961) 7. దాదీ మా 8. ఖామోషీ (1969) 9. హమ్‍రాహీ (1963) 10. ఖాన్‍దాన్ (1965)

సినిమా క్విజ్ 64 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • సిహెచ్.వి.బృందావనరావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • మణి నాగేంద్ర రావు బి.
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.ఆర్. మూర్తి
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • జి. స్వప్నకుమారి
  • టి. మమన్ బాబు
  • దీప్తి మహంతి
  • కొన్నె ప్రశాంత్
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here