విడదల సాంబశివరావు గారికి అక్కినేని ప్రతిభా పురస్కారం – ప్రెస్ నోట్

0
4

[dropcap]చి[/dropcap]లకలూరిపేటకి చెందిన ప్రముఖ రంగస్థల నటుడు, విలక్షణ బుల్లితెర, వెండితెర నటుడు, ప్రముఖ సాహితీవేత్త, ‘విడదల నీహారిక సౌండేషన్’ వ్యవస్థాపక అధ్యక్షలు శ్రీ విడదల సాంబశివరావు – ‘పద్మవిభూషన్ అక్కినేని నాగేశ్వరరావు ప్రతిభా పురస్కారం’ అందుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సాంస్కృతిక సేవా సంస్థ ‘యువకళావాహిని’ ఈ పురస్కారాన్ని ‘విడదల’ వారికి ప్రదానం చేసింది.

ది. 01-12-2023 శుక్రవారం సాయంత్రం 6 గంటలకు గుంటారు ‘అన్నమయ్య కళాకేంద్రం’లో జరిగిన ఓ ప్రత్యేక సాంస్కృతిక కార్య క్రమంలో ఆంధ్రప్రదేశ్ పుర్వ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ మరియు మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనమండలి సభ్యులు శ్రీ డొక్కా మాణిక్య వరప్రసాద్ – ఈ పురస్కారాన్ని విడదల సాంబశివరావుకు ప్రదానం చేసే ఘనంగా సత్కరించారు.

యువకళావాహిని అధ్యక్షలు శ్రీ లంకా లక్ష్మీనారాయణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి అక్కినేని నాగేశ్వరరావు కళా పరిషత్ అధ్యక్షులు, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ సారిపల్లి కొండలరావు అధ్యక్షత వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here