కాశ్మీరు లోయలోని వృక్ష జాతులు

0
12

[డా. కందేపి రాణీప్రసాద్ రచించిన ‘కాశ్మీరు లోయలోని వృక్ష జాతులు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

[dropcap]కా[/dropcap]శ్మీరు లోయ అంటేనే పూల రాశుల అందాలకు ప్రతినిధి. ఇక్కడ ఎన్నో జాతుల పూల ఫ్యాషన్ పెరేడ్‌లు నిత్యం జరుగుతుంటాయి. ఈ కాశ్మీర్ లోయను చుట్టూ ఆచరించి ఉన్న హిమాలయ శ్రేణులు పూల అందాలకు మంచులా కరిగిపోతుంటాయి. పాషాణ హృదయాలైన కొండలను సైతం మంచులా మార్చేస్తాయి. ఇక్కడ కేవలం పూల జాతులే కాదు ఏ చెట్టైన పచ్చని ఆకులతో ప్రకృతినే మైమరపిస్తుంటుంది. ఈ లోయలో ఎన్ని గంటలు ప్రయనం చేసినా విసుగు విరామం అనిపించదు. కళ్ళు అలసట చెందవు. పొటోలు తీసి తీసి చేతులు నొప్పెట్టవు. కన్నులు చెదిరే అందంతో కాశ్మీరు లోయ కనువిందు చేసింది. ఇక్కడ అద్భుతమైన వైవిధ్యమైన వృక్ష జంతు జాతులు కూడా అలరిస్తాయి. కొన్ని వృక్ష జాతులను నేను చూసినంత మేరా కనిపించిన మొక్కలూ, వృక్షాలను గురించి మీకు వివరిస్తాను.

భారతదేశపు కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ము & కాశ్మీరు అత్యంత ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. మంచు పేరుకున్న కొండ కొనలతో పాటుగా అనేక అరుదైన వృక్ష జాతులు పెరుగుతాయి. గ్రేటర్ హిమాలయ శ్రేణులు, పీర్ పంజల్ శ్రేణులు మధ్య ఆవరించబడిన లోయను కాశ్మీర్ లోయ అంటారు. దీనిని వేలీ ఆఫ్ కాశ్మీర్ అని కూడా పిలుస్తారు. కాశ్మీర్ మొత్తం కూడా కొండలు పర్వతాలతో నిండి ఉంటుంది. ప్రఖ్యాతమైన చీనాబ్, సింధు, జీలం నదులు ఈ లోయ గుండా ప్రవహిస్తాయి. ఈ నదులే లోయను మూడు భాగాలుగా విభజిస్తాయి. చీనాబ్ లోయ కాశ్మీరానికి దక్షిణం వైపున ఉంటుంది. ఈ లోయ జమ్ము ప్రాంతం కిందికి వస్తుంది. సింధులోయ ప్రాంతం కిందకు బాలిస్తాన్ లడఖ్ ప్రాంతాలు వస్తాయి. జీలం లోయ కిందకు పర్వతాల బాడీ గార్డులతో చుట్టబడిన అసలైన కాశ్మీరు లోయ వస్తుంది. ఈ నదులే కాకుండా పర్వత ప్రాంతాలలో అనేక మంచి నీటి సరస్సులు సైతం ఉన్నాయి.

కాశ్మీరు లోయ అనేక అరుదైన వృక్ష జాతులకు జంతు జాతులకు ఆలవాలం. అందమైన ప్రకృతి దృశ్యాలతో పాటుగా విభిన్నమైన నేలలు కూడా సొంతం. సమ శీతోష్ణ అడవులు, ఉప ఉష్ణ మండల అడవులు, అర్పైన్ అడవులు అనే విభిన్నమైన అడవులలో ప్రపంచంలో మరెక్కడా కనిపించని వృక్షజాతులు ఎన్నో కనిపిస్తాయి. అందుకే ఇది స్వర్గలోకానికి దగ్గర దారిగా కనిపిస్తుంది. ఇక్కడ ఆకులు రాల్చే చెట్లు, కోనిఫర్లు, ఔషద మొక్కలూ ఎక్కువగా పెరుగుతుంటాయి. దేవదారు, పైన్, చినార్, వంటి అనేక చెట్లు ఆకాశాన్ని అంటుకోవాలన్నట్లుగా లోయల్లో నుంచి నిటారుగా పైకి పెరుగుతాయి. వాల్‌నట్లు, చెర్రిలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. కుంకుమ పువ్వు అనగానే కాశ్మీరీ పంట అని గుర్తొస్తుంది. ఇక్కడి షాపుల్లో డ్రై ఫ్రూట్స్, కుంకుమపువ్వు, చెర్రిలు ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. కాశ్మీరు వచ్చిన యాత్రికులంతా ఇవి కొనుక్కోకుండా వెళ్ళనే వెళ్ళరు. ఇంకా ఇక్కడ ప్రసిద్ధి చెందిన పశ్మినా శాలువాలను సైతం కొనుగోలు చేయకుండా ఉండరు.

సాధారణంగా సమశీతోష్ణ అడవులలో మేపుల్, దేవదారు, చినార్ వంటి చెట్లు పెరుగుతాయి. ఈ అడవులు సముద్ర మట్టానికి 1500 మీటర్ల నుంచి 3000 మీటర్ల ఎత్తులో కనిపిస్తాయి. ఇక్కడ పెద్ద పెద్ద వృక్ష జాతులు మాత్రమే కాకుండా క్పోడలు, గుల్మాలు, గడ్డి భుమూలు, ఫెర్న్ లు వంటివి కూడా ఎక్కువగా ఉంటాయి.

ఆల్పైన్ అడవులు మాత్రం సముద్ర మట్టానికి మూడు వేల మీటర్ల పైననే ఉంటాయి. ఇక్కడ వృక్షాలతో పాటు పొదలు కూడా పెరుగుతాయి. రోడో డుడ్రాన్, బిర్చ్, జునిపర్ వంటి పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తాయి. ఈ అడవులలో గాలులు బలంగా వీస్తూ ఉంటాయి. తక్కువ ఉష్ణోగ్రతలతో కటినమైన వాతావరణం ఉన్నప్పటికీ చెట్లు తట్టుకుని జీవిస్తాయి.

ఉప ఉష్ణ మండల అడవులలో నేల సంరక్షణ జరుగుతుంది. ఇక్కడ ఓక్, చెస్ట్ నట్, మాగ్నోలియా వంటి జాతులు ఎక్కువగా పెరుగుతాయి. ఈ అడవులు అధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. నీటిని నియంత్రించుకునే సామర్థ్యం కలిగి ఉండటం వల్ల భారీ వర్షపాతాలు ఉన్నప్పటికీ చెట్లు తట్టుకుంటాయి. కాశ్మీరు లోయకు అతి తక్కువ ఎత్తులోనే ఈ ఉప ఉష్ణ మండల అడవులు కనిపిస్తాయి. కలప వంటి అటవీ ఉత్పత్తులకు కూడా కేంద్రంగా విలసిల్లుతాయి. యాపిల్, వాల్‌నాట్, బాదం, పియర్, చెర్రీ వంటి చెట్లను కూడా చూసి ఫోటో తీసుకున్నాను. విల్లో చెట్ల యొక్క కలప తోనే క్రికెట్ బ్యాట్లు తాయారు చేస్తారట. ఇంకా పైన్ చెట్ల యొక్క శంకులను ఏరుకుని తెచ్చుకున్నాను. ఇది చాలా అందంగా ఉంటాయి. వాటితో బొమ్మలు చేశాను. చెట్లు భాగాలతో రకరకాల బొమ్మలు చేయటం నాకు చాలా ఇష్టం.

పెద్ద వృక్ష జాతుల్లో ముఖ్యమైన జాతులు ఏమిటంటే పైన్, ఓక్, వాల్‌నట్, విల్లో, దేవదారు, చినార్, ప్లాపర్, పియర్ తప్ప అన్ని చెట్ల దగ్గరా నిలబడి ఫోటోలు తీసుకున్నాం. కొన్ని చెట్లు ఎవరో చక్కగా కత్తిరించి వరుసల్లో నాటినట్లుగా క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా నిలబడి ఉంటాయి. నేలంతా కూడా పచ్చని పచ్చిక బయళ్ళతో నిండి కాళ్ళు కందిపోకుండా పచ్చని కార్పెట్ పరిచినట్లుగా ఉంటుంది. ఈ గడ్డి భూముల్లో బెంట్ గ్రాస్, రైగ్రాస్, బ్లూ గ్రాస్, మేడో ఫాక్స్ టైల్ వంటి రకాల గడ్డలు పెరుగుతాయి. అలాగే కాశ్మీరు లోయలో పొదలు, గుల్మాలు కూడా ఎన్నో పెరుగుతూ ఉంటాయి. వీటిని ఒక అందమైన ఆకారంలో కత్తిరించి పెంచటం వల్ల పార్కులు, ఉద్యానవనాలు అందంగా కనపడతాయి. గులాబీలతో పాటుగా విచిత్రమైన ఆకారులున్న ఎన్నో పువ్వులు మొఘల్ గార్డెన్స్‌లో కనిపిస్తూ ఉంటాయి. అనేక ఉద్యానవనాల్లోని పువ్వుల అందాల్ని చూస్తుంటే “ఎవరు వీటిని ఇంత అధ్బుతమైన సౌందర్యంతో సృష్టించారు” అని ఆలోచనలో పడిపోతాము. ఇక్కడ చెర్రీ వృక్షాలను చూస్తుంటే నాకు మర్రి చెట్లు గుర్తొచ్చాయి. ఆకుల మధ్యన ఎర్రని పండ్లతో ఉండటం వలన మర్రిచెట్లు జ్ఞప్తికి వచ్చాయి.

లోయల్లోంచి పర్వతాలను దాటాలనే ఆలోచనతో పెరిగిన కొన్ని వృక్షాలను ఆశ్రయించుకుని ఆల్గే, పెర్న్‌లు పెరుగుతుంటాయి. వృక్ష కాండం కనిపించకుండా మెత్తని పరుపు వలె నాచులు పచ్చగా అల్లుకుంటాయి. ఈ చెట్ల ఫోటోలను వివరాలతో చార్టులుగా రూపొందించాను. బ్రిస్టల్ మోస్, స్వాగ్నమ్ మాస్, కుషాన్ మాస్‌లి అనే రకాలు ఈ లోయలో బాగా పెరుగుతాయి. అలాగే ఫెర్న్ లలో కూడా కొన్ని ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి. కామన్ బ్రేక్ ఫెర్న్, మైడెన్ హెయిర్ ఫెర్న్, రెడీ ఫెర్న్, పాలీ పొడి ఫెర్న్, వంటివి ఫెర్న్ లలో ప్రసిద్ధి గాంచినవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here