ఎదురుదాడి తప్ప మరో దారి లేదు!!!

0
4

[‘ఎదురుదాడి తప్ప మరో దారి లేదు!!!’ అనే అనువాద కవితని అందిస్తున్నాము. మూలం Joyce Zasler.]

[dropcap]ఆ[/dropcap]ధునిక మారణాయుధాల కరాళ కర్కశ నృత్యంలో
నాకు అణ్వాయుధాల మరణ మృదంగాల లయ వినిపిస్తోంది.
కిడ్నాపింగుల గురించి, అమలుపరచబోతున్న తీవ్రవాద దాడుల గురించి
తెలుసుకుంటున్న ప్రపంచాన్ని భయం మబ్బులా క్రమ్మేస్తోంది.
రాబోయే దాడులను అరికట్టటానికి, తీవ్రవాదాన్ని ఎదుర్కోవటానికి
అత్యంత నియంత్రణ నిర్వహిస్తూ, ఎదురుదాడి తప్ప మరో దారి లేదు.
హిజ్బుల్లా రాకెట్లు ఒక నగరం తరువాత మరో నగరంపై
వర్షపు చినుకుల్లా విరుచుకు పడుతున్నాయి.
ఇజ్రాయిల్‍ను ప్రపంచ పటం నుంచి చెరిపివేయాలని
కంకణం కట్టుకున్న వారి దాడులు ఆరంభమయ్యాయి.
దేశం చిన్నది. శత్రువులు అధికం
కానీ శక్తివంతమైనది దేశం. పట్టుదల అనంతం.
దేశాన్ని భద్రంగా ఉంచాలని కట్టుకున్నాం కంకణం.
భవిష్యత్తులో ఇంకో  దేశం తీవ్రవాదుల దాడికి గురికాకూడదు
అందుకే..
అత్యంత నియంత్రణ నిర్వహిస్తూ ఎదురుదాడి తప్ప మరో దారి లేదు.
~

మూలం: Joyce Zasler
స్వేచ్ఛానువాదం: సంచిక టీమ్


Israel Strikes Back
~
I hear the clock ticking at the nuclear power plant
While sophisticated weapons generate a war-like dance.
A mounting fear engulfs the world as we become concerned
of the impact of these kidnappings and what intelligence has learned.
Combatting terrorism and further attacks, Israel has no choice,
Showing utmost restraint, the military must strike back.
Hezbollah rockets continue to rain down, Haifa and then, town after town.
Assaults from entities that want Israel snuffed out. A country so small with determination and clout.
It’s a long battle to keep embassies secure, no country can be a target, that is for sure.
Decades have passed and the threat of war looms, spy satellites, modern weapons accelerates and booms.
Can the nations of the world live in peaceful co-existence
as missiles armed with warheads are poised from a distance?
Can the nations of the world promote peace instead of war?
So our children and grand-children are safe as never before!

By Joyce Zasler

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here