[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]
1. నాణ్యం
నాణ్యంగా ఆలోచిస్తే
నాణ్యతతో ప్రయాణిస్తే
నాణ్యతే నీ చుట్టూ
~
2. లాంతరు
దేశానికి
వెలుగునివ్వాల్సిన
రాజకీయలాంతరు
పొగచూరింది
ఓటుతో ప్రక్షాళన చేసి
కొత్త ఒత్తి వేద్దాం
~
3. భిక్ష
మనిషి మరచిన
మట్టి వాసనే
మనుగడ మమత
మరణించాక
పీల్చాలన్నా పీల్చలేడు
ఈ దేహం
మట్టి మనుషుల భిక్ష
~
4. గెలుపు
గెలుపు ఓటముల్లో
కొత్త ఏముంది
ఓటరు గెలిచే
రోజు రావాలి!