[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి నటించిన ‘గ్యాంగ్ లీడర్’ (1991) చిత్రాన్ని హిందీలో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి, మీనాక్షి శేషాద్రిలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
- స్వీయదర్శకత్వంలో దాసరి నారాయణరావు, సుజాత నటించిన ‘ఎం.ఎల్.ఎ. ఏడుకొండలు’ (1983) చిత్రాన్ని దాసరి నారాయణరావు దర్శకత్వంలో రాజేష్ ఖన్నా, షబానా ఆజ్మీ, శత్రుఘన్ సిన్హాలతో హిందీలో ఏ పేరుతో రీమేక్ చేశారు?
- పి. చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో శోభన్ బాబు, శారద, కృష్ణంరాజులు నటించిన ‘మానవుడు దానవుడు’ (1972) సినిమాని డూండీ దర్శకత్వంలో వినోద్ ఖన్నా, షబానా ఆజ్మీలతో హిందీలో ఏ పేరుతో రీమేక్ చేశారు?
- జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో అల్లరి నరేష్, పూర్ణ నటించిన ‘సీమ టపాకాయ’ (2012) చిత్రం, హిందీలో సంజయ్ గద్వి దర్శకత్వంలో అర్జున్ రాంపాల్ (ద్విపాత్రాభినయం), ఆధి, కిరణ్ ఖేర్‍లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
- కె. బాపయ్య దర్శకత్వంలో కృష్ణ, శ్రీదేవి, రాజేంద్రప్రసాద్ నటించిన ‘మకుటం లేని మహారాజు’ (1987) చిత్రాన్ని హిందీలో హర్మేష్ మల్ దర్శకత్వంలో జితేంద్ర, రేఖ, రిషీకపూర్ లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
- శోభన్ దర్శకత్వంలో ప్రభాస్, త్రిష, గోపీచంద్ నటించిన ‘వర్షం’ (2004) సినిమా హిందీలో షబ్బీర్ ఖాన్ దర్శకత్వంలో టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్‍లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
- బోయిన సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని, వాణిశ్రీ నటించిన ‘చిలిపి కృష్ణుడు’ (1978) సినిమాని హిందీలో కె. బాపయ్య దర్శకత్వంలో రాజేష్ ఖన్నా, హేమమాలిని, డానీలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
- ప్రియదర్శన్ దర్శకత్వంలో, మోహన్ లాల్ సుకన్యలు నటించిన మలయాళ చిత్రం ఆధారంగా కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున, రమ్యకృష్ణలు నటించిన ‘చంద్రలేఖ’ (1998) చిత్రం హిందీలో రాజ్ కన్వర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, ప్రీతీ జింతా, రాణీ ముఖర్జీలతో ఏ పేరుతో రీమేక్ అయింది?
- కె. విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్, రాధిక, దీప నటించిన ‘స్వాతిముత్యం’ (1985) సినిమాని కె. విశ్వనాథ్ దర్శకత్వంలో, అనిల్ కపూర్, విజయశాంతిలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
- త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు, త్రిష, బ్రహ్మానందం నటించిన ‘అతడు’ (2005) చిత్రం హిందీలో సంగీత్ శివన్ దర్శకత్వంలో బాబీ దేవల్, శ్రియ, నానా పాటేకర్‍లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
~
మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 డిసెంబర్ 26 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 68 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 డిసెంబర్ 31 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 66 జవాబులు:
1.దో కలియా (1968) 2. తీన్ బహురాణియా (1968) 3. జిగ్రీ దోస్త్ (1969) 4. ఏక్ నారీ ఏక్ బ్రహ్మచారి (1971) 5. ప్యార్ కీ కహానీ (1971) 6. జయ్-విజయ్ (1977) 7. నయీ రోష్నీ (1967) 8. హిమ్మత్ (1970) 9. సచ్చాయీ (1969) 10. వారిస్ (1969)
సినిమా క్విజ్ 66 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- జానకీ సుభద్ర పెయ్యేటి
- మణి నాగేంద్ర రావు బి.
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.ఆర్. మూర్తి
- పి. వి. ఎన్. కృష్ణ శర్మ
- రంగావఝల శారద
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- జి. స్వప్నకుమారి
- టి. రేణుమతి
- దీప్తి మహంతి
- కొన్నె ప్రశాంత్
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
వీరికి అభినందనలు.
[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]
[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]