[శ్రీమతి నారుమంచి వాణీ ప్రభాకరి రచించిన ‘మనవడి పెళ్ళి’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[మనవడి కోసం కాంతమ్మ ఎన్నో సంబంధాలు వెతుకుతూంటూంది. మొదట్లో – తమ శాఖ పిల్లే అయి ఉండాలి, ఉద్యోగం చేయకూడదు, ఇంట్లో ఉండి వంటావార్పు చేయాలనేది ఆమె కండీషన్. ఆమె పెట్టిన కండీషన్‍కి ఏ అమ్మాయి ముందుకు రాలేదు. తరువాత కాస్త మినహాయింపులిచ్చింది, ఐనా ఉపయోగం లేకపోయింది. కోడలు కోమలిని సాధించి, ఆడపిల్లలు వద్దని మూడోసారి కొడుకుని కనిపించింది. వాడికి కిరణ్ అని పేరు పెట్టిస్తుంది. చిన్నప్పటి నుంచి కిరణ్‍కి బాగా ముద్దు చేసి, గారం చేసి, అతిగా తినిపించి- స్థూలకాయుడయ్యేలా చేస్తుంది కాంతమ్మ. కిరణ్ కూడా ఆకలికి ఆగలేకుండా, చిరుతిళ్ళు తినకుండా ఉండలేకుండా తయారయ్యాడు. ఎక్కడికి వెళ్ళినా స్కూటర్ మీదే. శరీరానికి కాస్త వ్యాయామం కూడా ఉండదు. మంచి ఉద్యోగం, జీతం బావున్నా – ఏ అమ్మాయికి నచ్చడం లేదు. ఎన్ని సంబంధాలు వచ్చిన కుదరవు. చివరికి ఓ రోజు కోమలి పూనుకుని కొడుకుని బయటకి తీసుకెళ్ళి వ్యాయామం చేసి బరువు తగ్గాల్సిన అవసరం గురించి విడమర్చి చెబుతుంది. ఎలాగైనా కొడుక్కి పెళ్ళి చేసి కోడల్ని ముచ్చటగా చూసుకోవాలని అనుకుంటుంది కోమలి. – ఇక చదవండి.]
అధ్యాయం-3
[dropcap]ఒ[/dropcap]క ఆదివారం ఉదయం కూరల కోసం రైతు బజారుకి తీసుకువెళ్ళమని కొడుకును అడిగింది కోమలి. అప్పుడే అత్తగారు పాలిటిక్స్ మొదలు పెట్టింది.
“మీ మామగారు ఈరోజు పెసరట్టు వెయ్యమన్నారు. రోజు ఇడ్లీ, వడలు తిని విసిగిపోయారు” అన్నది కాంతమ్మ.
“అది కాదు అత్తయ్యా, పెసరట్లు రేపు వేస్తాను, ఇప్పుడు పెసలు నానవు” అంటూ వినకుండా ఇడ్లీ పెట్టింది కోమలి.
“అల్లం, కొబ్బరి చట్నీ రెండు ఉన్నాయి, తినండి. రేపు మీ అబ్బాయి కూడా ఉంటారు నోరు చప్పబడి ఉంటుంది. నేను పెసరట్టు ఉప్పా చేస్తాను” అంటూ గబగబ కొడుకు స్కూటర్ ఎక్కి వెళ్ళింది కోమలి.
“ముందు జిమ్‌కి నడు” అంటూ తీసుకువెళ్ళింది. అక్కడ ఆడవాళ్ళ జిమ్ హాలు వేరుగా, మగవాళ్ళది వేరుగా ఉన్నాయి. విజిటర్స్ రూమ్ మాత్రం కామన్‌గా వున్నది.
కోమలి జిమ్‌కి వచ్చింది, అనుకుని లోపలికి పిలిచారు. ఆ హాల్లో ఎక్సర్‌సైజ్ చేసే అమ్మాయిలను చూస్తే ఎంతో ముచ్చట వేసింది.
అందమైన శరీర ఆకృతి కోసం ఎంత కృషి చేస్తున్నారు. జాజిమొగ్గల వంటి అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి. తనకి కూడా జిమ్‌లో చేరాలని అనిపించింది. కానీ కుదరదు. ఇంటిపని అంతా తనే చూసుకుంటుంది.
కొడుకుని పంపితే అంతే చాలు అనుకుంటూ తనకి కాదు తన కొడుక్కి అని చెప్పింది.
చదువు ఉద్యోగంతో పాటు ఆడవాళ్ళు ఒబెసిటీ కూడా లేకుండా తగ్గించుకుంటూ జీవితంలో ఆరోగ్యాన్ని పెంచుకుంటూ అనారోగ్యానికి దూరంగా ఉండి యోగా చేస్తూ రకరకాల యోగాభ్యాసాలు చేసి కళలు, కలలు సంకరం చేసుకుంటున్నారు.
యోగా ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. యోగా చెయ్యటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శరీర ఆకృతి ఎంతో అందంగా వుంటుంది. అలాగే మంచి ఆలోచనలతో మెదడు చురుకుగా పనిచేస్తుంది.
అలాగే కొందరు ఒబెసిటీ బాగా ఉన్నా లేకపోయినా తగ్గడం కోసం
కళలకు నాట్యం, సంగీతం ఆశ్రయిస్తున్నారు. సంగీతం వల్ల కూడా ఒబెసిటీ రాదు. ఇది కూడా ఒక తరహా యోగా లాంటిదే కారణం స్థిరంగా కూర్చుని శృతి పట్టి స్వరాలు పాడటంలో ఉచ్ఛ్వాస నిశ్వాస క్రమ పద్ధతిలో ఉండి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
దీనివల్ల శరీర సౌష్టవం ఎంతో బాగుంటుంది. ఆల్ఫా రేస్ పెరిగి బీటా రేస్ సంఖ్య తగ్గుతాయి అని సంగీత శాస్త్రం చెపుతుంటుంది. ఇంకా నాట్యశాస్త్రం అయితే శరీర కదలిక వల్ల చాలా అతి తేలికగా తొందరగా మార్పు వస్తుంది. అందుకే కళలు జీవన రవళుల ప్రభావం ఉంటుంది. కోమలి జిమ్ అంతా కలియ తిరిగింది.
అందరూ ఎంతో గొప్పగా ఉన్నారు జీవితాన్ని వారికి నప్పేలా మలచుకున్నారు.
వంట వార్పు చేసే గృహిణులు ఉద్యోగాలు చేసేవారు కూడా ఎంతో మరారు. ఇంకా పెళ్ళి కాని పిల్లలు, కాలేజీ, స్కూల్ పిల్లలకీ సహితం జిమ్‍లు వున్నాయి.
కోమలి కొడుకు అప్లికేషన్ పూర్తి చేసింది. వేసుకోవలసిన డ్రెస్లు, ఇతర రూల్స్ అన్నీ చెప్పారు. మంచి రోజు చూసి పంపుతాను అని చెప్పింది. ఇదేమిటి ఇంత పెద్ద కొడుకుని తల్లి వచ్చి చేర్పించి జాగ్రత్తలు చెపుతోంది అనుకుంటున్నారా!
“ఇది మా మదర్-ఇన్-లా పెంపకం, మీరు కొంచెం కేర్ ఎక్కువ తీసుకుని మార్చాలి” అని చెప్పింది.
“ఓకే మేడమ్ ష్యూర్” అని నవ్వింది రిసెప్షన్ అమ్మాయి.
మన కిరణ్ బుద్ధిమంతుడు. కోమలి ఆలోచన కొడుకు పెళ్ళి మీద. అక్కడ ఎవరైనా పెళ్ళికూతుళ్ళు వీడి ఉద్యోగ హోదా చూసి సంబంధం అడుగుతారా అని ఆశ కూడా! తల్లి ప్రాణం కదా!
కొడుకు చుట్టు ఎన్నో ఆలోచనలు! కోమలి స్నేహితురాలి కొడుకు మద్రాస్ వెళ్ళి అక్కడ చిన్న ఉద్యోగం చూసుకుని భోజనం తగ్గించి డ్రై ఫ్రూట్ జ్యూస్ సలాడ్స్ పాలు తాగి ఎక్సర్‌సైజ్ స్లిమ్ అయ్యాడు. ఆ తల్లి ఎంతో సంతోషపడుతూ ఫోన్ చేసింది.
అప్పుడే తన కొడుకుని పంపమని చెప్పింది. వాడు విన్నా అత్తగారు వినలేదు. ఇంక ఇప్పుడు తనే కలుగుజేసుకున్నది. అక్కడికి వచ్చే ఆడపిల్లల్ని క్రమశిక్షణతో ఉండటం చేసి ముచ్చట పడింది.
ముసలివాళ్ళ పెంపకంలో మంచి ఉన్నా ఈ తరానికి సరిపడా వుండదు. అందుకే చాలా బాధపడింది. పిల్లాడు మెరిట్ స్టూడెంట్, మంచి ఉద్యోగం మరీ అంతగాడు కాకపోయినా రూపం బాగుంటుంది.
కాకిపిల్ల కాకికి ముద్దు కదా! అందుకే తన కొడుకు తనకి ముద్దు. అది విషయం అత్తగారికి చెప్పాలి వారం తరువాత అత్తగారు ఆరా తీస్తే చెప్పింది.
“అక్కడ అందమైన అమ్మాయిలు ఉంటారు, పోనీ ఎవరో ఒకరు ప్రేమించకపోతారా” అని తన కడుపులో ఉన్న ఆశ చెప్పింది. అత్తగారు మూతి తిప్పింది.
“ఆహా మహా గొప్ప తెలివి”. అక్కడికి వచ్చే పిల్లలు కోటీశ్వరులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు హా హా” అన్నది.
“అదేంటి అత్తయ్యా, మీకు చాలా డబ్బు ఉన్నదిగా, పొలం ఉన్నదిగా ఇంకా ఏమి కావాలి?”
“వంట, వార్పు రాకుండా టింగురంగ అంటూ బ్యాగ్ తగిలించుకుని వెడితే ఎలా తల్లీ? నిన్ను వద్దంటే నా కొడుకు కుట్టుకుని వచ్చాడు. తెలివిగా మగపిల్లాడిని కని ఇంట్లో ప్రవేశించారు. నువ్వు నీ కొడుకు సరే, నా కొడుక్కి పెళ్ళాం వచ్చింది. కాని నా నోట్లోకి పిండివంటలు ఎక్కడ తగ్గుతాయో అని భయంకొద్దీ నిన్ను దూరం పెట్టమన్నాను. నువ్వు తెలివిగా వంట పెత్తనం పుచ్చుకుని ఇంట్లో ఉన్నావు. నీకు మాత్రం అభిమానం లేదు” అంటూ కటువుగా పలికింది కాంతమ్మ.
“అందుకేగా నా కొడుకు జీవితంతో ఆడుకుంటున్నారు, మా ఆయనకి ఏమీ పట్టదు, అటు తల్లి పెంకిగా మహా స్వార్థంగా వున్నది అని తెలిసినా భార్యనే వేధిస్తున్న మనిషి, తన సుఖం తన పిల్లాడు సుఖం అవసరం లేదు, తల్లి అన్నదమ్ములు బాగుండాలి, ఇంకా నయం ఆడబడుచులు ఉంటే పిక్కు తిందురు.
అది బాగాలేదు, ఇది బాగోలేదు; మేము మామూలు బట్టలు కట్టము, మా ఇంట్లో పనిమనిషి వంట మనిషికి కూడా పట్టుచీరలు పెట్టాలి అంటూ కండిషన్స్ పెట్టారు కాదు.
మా గొప్ప సంబంధం అని చెప్పి ఇప్పుడు మాకు ఏమి ఉంది అంటారు, భలే అబద్దాలకోరు, మాటలు మాకు కారు కొనడం ఎంత సేపు అన్నారు, ఇప్పుడు మనవడు కోసం కొనండి కారు, మీ గొప్పలు ఇప్పుడు చూంపించండి, నాకు చెప్పడం కాదు పెళ్ళికాని ఆడపిల్ల కాదు, మొగపిల్లాడు అంతే మీ ఇంట్లో కోడళ్ళు కష్టపెడతారు అని మా అమ్మ చెప్పింది.
అందుకే నన్ను చెయ్యడానికి వాళ్ళు ఇష్టపడలేదు. నాయోగం ఇలా ఉన్నది” అని విసవిసలాడింది కోమలి.
“మీ అక్క కోడల్ని తరిమేసింది, పొమ్మనలేక పొగబెట్టి ఆడబడుచులు అత్తగారు పంపేశారు. పెళ్ళి అయినది రోజు కూడా ఇక్కడ నుంచే వంట వాళ్ళ అల్లుడు అత్త మామకి కాళ్ళు రాస్తాడు. మరి ఎదుటి వారికి వీళ్ళ అబ్బాయి అంత కాదా!
మేనమామ కొడుకు కట్నం కోసం పెళ్ళి పెళ్ళి చేసుకుని డబ్బు వాడుకుని మీ లావుగా ఉన్నది అన్నాడు, రేపు మీ మనవడు పరిస్థితి అలా కాకూడదనే నేను జిమ్‌లో చేర్పించి వచ్చాను. మీ బంధం, మీ వంశం అన్నీ కూడా గురివింద గింజ లాంటివి.
ఎప్పుడు నోరుకి కోడల్ని కట్టుకుని ఉంటారు. ఇంకా నయం ఆడపిల్లలు లేరు ఉంటే వాళ్ళు ఇలాగే తయారు అయి ఉందురు. మరీ ఇంత వెటకారం కుదరదు.” కోమలి ఆవేదన అంతా వెళ్ళకక్కింది.
మొగుడు కొడుకు మామగారు అత్తగారు జులుం అంతా కడిగింది అనుకున్నారు.
“ఏదేమైతేనేం నేను పిల్లాడు బాధపడుతున్నాము. వాడి మనసు కష్టపెట్టుకుని బామ్మకి ఏమీ చెప్పలేక పోతున్నాడు. తండ్రి తల్లి అసమర్థులు బామ్మ పెత్తనం ఆ ఇంట అని అందరికీ తెలుసు. పిల్లని చెయ్యాలంటే ఆ బామ్మ గడ్డు. అందుకని కోడలికి తప్పటం లేదు. ఇంకా మనుమరాలికి కూడా ఆవిడ పెత్తనం అంటే ఎలా అని అనుకుంటున్నారు” అన్నది కోమలి.
ఇంకా బామ్మ కోపం తగ్గలేదు. వాడి వయసుకు కుదిరిన వాళ్ళు, భర్తతో గొడవ పడిన వాళ్ళు, భర్తపోయిన వాళ్ళు ఉన్నారు. నలభైయేళ్ళ వాడికి పెళ్ళికూతురి వాళ్ళు ఎవరు ఒప్పుకోవడం లేదు, ఏమిటి విచిత్రం అనుకున్నారు.
ఎవరైనా ఎప్పుడైనా ఈ వింత చూసారా! మొదటి పెళ్ళి అయి పిల్లాడు కన్నా కొంచెం పెద్దది అయినా పర్వాలేదు, అని చివరికి అత్తగారిని ఒప్పించి చెప్పారు.
కానీ ఆవిడ ససేమిరా అన్నది. మరి వాడిని జిమ్‍కి పంపి రెండు నెలలు అయింది. కొంచెం శరీరం తగ్గించి చూపారు. ఇంకా డైట్ బాగుండాలి ఇంట్లో ఏమీ తినవద్దు. ఒక్క పుల్కా పచ్చి కూరలు అన్నారు.
బామ్మ చూడలేక పోయింది, బాధపడింది. పిల్లాడు బొజ్జ కొంచెం కరిగింది. చిన్నప్పుడు వద్దురా! అంటే వెన్న మీగడ పెట్టి ఫ్యాట్ పెంచింది. ఇప్పుడు కరగాలి అంటే బాగా జిమ్ వర్క్ చెయ్యాలి.
ఆదివారం ఎక్కువ సేపు వుంటాడు. అది బామ్మకి బెంగ, తల్లికి మాత్రం ఆనందం అని చెప్పాలి. వాళ్ళ ఇంట్లో ఇది అనువంశికం! ఎంతకాలం వీడు ఇంకా వెళ్ళాలో?
జిమ్‌లో మాత్రం అందమైన అమ్మాయిల్ని చూస్తే మనసుకి ఆనందమే కానీ ఒక తరంలో ఆడపిల్లలు వద్దు అన్న పెద్దవాళ్ళ వల్ల నేటి తరంలో ఎందరో మగపిల్లలు పెళ్ళి కాకుండా వుండిపోయారు.
అధ్యాయం 4
కొన్నాళ్ళు క్రితం వరకూ కట్నం ఇవ్వలేక ఆడపిల్లలకి పెళ్ళి కాలేదు. వుద్యోగాలు చేస్తూ బ్రతికారు. మొగపిల్లలకి పెళ్ళి చేసే వంశాలు నిలబెట్టుకున్నామని గర్వపడ్డారు. వింత మనుష్యులు ఆడపిల్లలకి అన్యాయం చెయ్యడమే వారి ధ్యేయంగా పెట్టుకున్నా – ఆడపిల్లలు ధైర్యంగా బ్రతుకుగడిపారు.
తల్లితండ్రిని పెళ్ళికాని పిల్లలు చూశారు. మరి ఇప్పుడు మగపిల్లాడికి పెళ్ళికాకపోతే మహా బాధపడుతున్నారు. ఎంత స్వార్థం వీళ్ళకి! ఆడదే అత్తరూపంలో ఆడపిల్లకి పుట్టకుండా చేసే వారి వంశములో పెళ్ళికాని అబ్బాయిలుగా వాళ్ళే చేసుకున్నారు. కోడళ్ళను హింసించడం తన పిల్లలు బాగుండాలి పరాయి పిల్ల బాధలు పడాలి అని వారి ఉద్దేశం. విశ్వంలో మార్పు వచ్చింది, ఆడపిల్ల కన్నీరుకి దేముడు చలించి ఆదుకుని అబ్బాయికి కూడా ఈ పరిస్థితి వచ్చింది. చాలా మంది అబ్బాయిలు రెండో పెళ్ళి పిల్లల్ని చేసుకుంటూ ఉన్నారు. కొందరు పెద్ద పిల్లల్ని చేసుకునే పరిస్థితి వచ్చింది.
ఇది ఆదేశం కాదు, ఆదర్శం కాదు, నేటి యువతకి అటువంటి స్థితతి ఇంటి పెద్దలే తెచ్చారు అంటే అతిశయోక్తి కాదు.
ఆ మధ్య కోమలి ప్రక్కింటి ఆమె అక్క వచ్చింది, వీళ్ళ దగ్గర సంబంధాల లిస్ట్ ఉందని తెలిసి వచ్చింది.
“అత్తగారు లాప్‌టాప్‌లో పెట్టుకుని చూస్తారు. మీ అబ్బాయి వివరం చెప్పండి” అంటే “వాడు పెద్ద కంపెనీలో ఇంజనీర్. నలభైయేళ్ళు వచ్చాయి. తెల్లగా అందంగా నాకు మల్లేనే ఉంటాడు.
నేను ఈ మధ్య రెండు సంబంధాల అనుభవం, పిల్ల బాగుంది చెయ్యండి పైసా వద్దు అన్న అభిప్రాయం చెప్పాను.
పిల్లకి ముప్పైరెండేళ్ళు వున్నాయి, మా పిల్ల అవును అనాలి, అది బ్యాంక్ ఆఫీసర్ పిల్లలని కనక పోయినా పర్వాలేదు మా పిల్లాడికి తోడుగా ఉంటే చాలు. ఒక గర్ల్ ఫ్రెండ్ మాదిరి ఉంటే చాలు, ఆమె ఇష్టాలు ఆమెవిగా స్వతంత్ర భావంతో ఉండవచ్చును అని చెప్పినా పెళ్ళికి వాళ్ళు అంగీకారం చెప్పలేదు.
ఇంకో పిల్లకి ఇదే వయస్సు. వాడి ఆఫీస్‌లో చేస్తోంది ఆమెకి తల్లితండ్రి పోషణ వున్నది. ముందు ఒప్పుకుని తర్వాత ఆ వద్దు అని అంటారు. సూత్రం కట్టేవరకు ఒక తంటా, అనక వేరే విధంగా ప్రవర్తిస్తారు అంటూ ఆమె బాధపడింది.
పెళ్ళి కాకపోతే మంచి స్నేహితులుగా ఉంటాము. పెళ్ళి చేసుకుని బాధ్యతలు చూడక విసుక్కుంటే మరీ బాధాకరం. కనుక నేను మీ అబ్బాయి మంచి స్నేహితులమే. ఏది కావాలన్నా వచ్చి నన్ను సహాయం అడుగవచ్చు అని చెప్పిందా అమ్మాయి.
ఆడపిల్లలు ఈ సమాజంలో అత్తింటి వారితో విసిగి వేసారి ఇలా ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని ఆదుకుంటున్నారు, కొడుకులు చూడకపోయినా అమ్మాయిలు ఎంతో శ్రద్ధగా వారు సంపాదించుకుంటూ సంపాదనలో ఎంతో కొంత తల్లిదండ్రులకు కేటాయిస్తూ వారి పద్ధతిని ఎంతో అందంగా మలుచుకుంటున్నారు. ఈ స్థితి సమాజంలో.. కొంతసేపు మార్పు గురించి ఆలోచించండి.” అంది కోమలి ప్రక్కింటామె అక్క.
ముఖ్యంగా ఎక్కువ మంది ఆడవాళ్ళే ఇలా బాధపడుతున్నారు. కొందరికి చిన్న వయస్సులోనే పెద్ద ఆలోచనలు ఉంటాయి. ఆ కోవకి చెందిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు.
అధ్యాయం 5
కృత్తిక చాలా అందంగా, మెరిసే నక్షత్రంలా ఉంటుంది. అయితే ఆ పిల్ల తన భాగస్వామి కూడా తన లాగే ఉండలానుకుంటుంది. ‘నాజూకుగా మొగ్గలా ఉంది’ అని కొత్త మంది పెళ్ళి చూపులకి వచ్చి “అబ్బే మీ అమ్మాయి మరీ నాదరుగా ఉన్నది” అన్నారు. కానీ ఆమె తను స్లిమ్‌గా ఉన్నదని వారికి ఈర్ష్య అని అంటుంది కృత్తిక.
“పెళ్ళి ఎలాగే?” అంటే “ఇటువంటి ఫిజిక్ కోసం అందరూ జిమ్‌లకి వెళ్ళి వెంటపడి అమ్మాయిలను వెతుకుతున్నారు, మీరు ఏమిటి? నన్ను విమర్సిస్తారు” అంటుంది. “రాసిపెట్టిన వాడు వస్తాడు నేనేమీ పెద్ద అమ్మాయిని కాదు. జస్ట్ ట్వంటీ” అంటూ నవ్వుకుంటూ ఉంటుంది.
ఇంట్లో అన్నయ్య ‘జస్ట్ ట్వంటీ’ అని వెక్కిరిస్తూ ఉంటాడు. అదొక ఆనందం అతనికి.
కృత్తిక ఒక షాపింగ్ మాల్ వారి ‘మిస్ హైదరాబాద్’ కాంపిటీషన్‌లో పాల్గొన్నది. వాళ్ళకి నచ్చి మొదటి బహుమతితో పాటు అవార్డ్, పెద్ద పట్టుచీర ఇచ్చారు. అంతే కాక డ్రెస్ డిజైనింగ్ డిప్లొమా ఉండటం వల్ల ఆమెకి శారీ వర్కులు చేయించడానికి మేనేజర్ పోస్ట్ కూడా ఇచ్చారు. అలా కృత్తిక పెద్ద మాల్లో ఉద్యోగంలో చేరింది.
ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. కానీ వచ్చిన అవకాశం వదులుకోకూడదు, అంటూ తాతగారు పట్టుపట్టడంతో ఆనందంగా ఉద్యోగంలో చేరింది.
టి.వి.వాళ్ళు కూడా యాక్టర్‌గా, యాంకర్‌గా రమ్మన్నారు, “వద్దు ఆ కల్చర్ మనకి సరిపడదు” అనేవారు పెద్దలు.
ఏది ఏమైతేనేం కృత్తిక ఉద్యోగం బాగుంది. అంతా ఎ.సి హాల్స్, అందమైన డిజైన్లు, చీరలు డిజైన్‌లు ఓహో ఆనందం, జీతం కూడా ఎంతో హితంగా వున్నది. జీవితంలో ఎన్నో మలుపులు, మజిలీలు. ఆనందమే ఆరోగ్య అమృతము. కృత్తిక సలహాలు, సూచనలు ఇస్తూ ఉ౦టుంది.
డ్రెస్ వర్క్ ఎన్నో రకాలు కొత్త పద్దతులు వచ్చాయి. ఇప్పుడు రఫుల్స్ చీరలు జాకెట్లు వచ్చాయి, వయసుతో సంబంధం లేకుండా టి.వి. సినిమా వాళ్ళు వాడుతున్నారు. వాళ్ళని చూసి మన ఇళ్ళల్లో పిల్లలు కూడా వాడుతున్నారు.
“శరీరం చిన్నప్పుడే పెరగనివ్వకుండా చూసుకోవాలి. పెరిగాక తగ్గటం చాలా కష్టం అని చెప్పాలి. ప్రతి ఏడూ కూడా వస్త్ర పోటీలు పెడతారు. అప్పుడు పిల్లలు కాలేజి గృహిణులు పెద్దవాళ్ళకి తగ్గట్టుగా డ్రెస్‌ల ఎంపికతో తయారీ చేసి ఎగ్జిబిషన్ పెడతారు. అప్పుడు ఊళ్ళో కాలేజీలకు గ్రౌండ్స్‌లో బేనర్స్ కూడా ఉంటాయి” అని చెబుతుంది.
***
ఇంటికి దగ్గర కాలేజీలో వాకింగ్ గ్రౌండ్ ఉన్నది. అక్కడికి చాలా మంది జనం అన్ని వయసుల వాళ్ళు వస్తారు. వారికి అక్కడ మంచి సీనరీ ఉంటుంది. అంతే కాదు మంచి సంగీతం కూడా పెట్టి ఉంచుతారు.
ఒక ప్రక్క యోగా టీచర్ కూడా ఉంటుంది. ఎవరి క్లాసులు వాళ్ళవి, ఇప్పటి మనుష్యులలో శరీర ఆకృతి మీద మోజు మళ్ళీ మంచి ఆరోగ్యానికి మందు కూడా అని గ్రహించారు.
ముఖ్యంగా గతంలో పెద్దవాళ్ళు వెన్న మీగడ పెరుగు, మినప సున్ని పెడితే ఇప్పటి పిల్లలు పిజ్జాలు, పఫ్‌లు, కేక్‌లు, బర్గర్లు తిని బాగా ఒళ్ళు పెంచుతున్నారు. ఆనాటి ఆహారానికి బలమైన ఊళ్ళు వస్తే ఈనాటి ఆహారానికి బోల ఒళ్ళు వచ్చి ఆయాసం వస్తోంది.
చిన్నపిల్లలు సహితం పరుగు పెట్టలేరు, ఎక్కువ దూరం స్కూల్లో కూడా వెళ్ళలేరు. ఎక్కడికక్కడ లిఫ్ట్ వెహికల్స్ ఉంటాయి. మనిషి జీవన సరళి మారింది. ఆహార వ్యవహార ఆహార్యం అలవాటు అన్నీ మారాయి. దానితో సున్నిత సుకుమార భావాలు మనుష్యులు కూడా మారారు, ఆహార వ్యవహార ఆహార్యం అలవాటు అన్నీ మారాయి, సున్నిత సుకుమార భావాలు పెరిగాయి. దానివల్ల అన్నీ మారాయి.
భార్యభర్త ఇద్దరు ఉద్యోగస్తులు కావడంతో అలసిపోయి వచ్చి వండుకునే తీరిక లేక హోటల్స్ మీద ఆధారపడటం, ఆ హోటల్ ఫుడ్ అరగక అనేక రకాల వ్యాధులు, ఒబిసిటీ లాంటివి రావడం ఇలా ఎన్నో రకాల మార్పులు జీవనప్రయాణంలో వచ్చే ప్రతి మార్పుకి మనిషి ఎంతో చలించుతున్నాడు.
***
కృత్తిక గ్రౌండ్స్ బానర్స్ చూసికొని వస్తూంటే అక్కడ పై మాటలు వినిపించాయి. కొంతమంది కృత్తికను చూసి చాలా ముచ్చటపడ్డారు, అమ్మాయిలు ఇలా ఉండాలి అనుకున్నారు.
అబ్బాయిలు అయితే ఇలాంటి భార్య కావాలని, ఆడవాళ్ళు అయితే మాకు ఇలాంటి కోడలు కావాలని అంటున్నారు. ఆ మాటలు చెవిన పడ్డాయి. నవ్వుకొన్నది.
“కొన్ని ఉద్యోగాలకు ఇలాంటి ఫిజిక్ ఉండాలి” ఎవరో వెనుక నుంచి అంటున్నారు.
“కళా మహిమ షో రూమ్‌లో వర్కింగ్ విభాగ మేనేజర్ అని మొన్న టి.విలో ఇటర్వ్యూ చూసాను” అని మరో ఆమె అన్నది.
కృత్తికకి అందరూ వందశాతం మార్కులు వేశారు. పుట్టుకలో అదృష్టం! తల్లితండ్రి అందంగా ఉంటారు, అందుకే ఆమె బాగా పుట్టింది. మరో ప్రశంసా వచ్చింది.
***
ఓపెనింగ్ రోజు పెద్ద పెద్ద అడ్రస్‍లలో, పెద్ద పెద్ద బ్యానర్లతో ఎగ్జిబిషన్ గ్రౌండ్ చాలా బిజీగా ఉంది. వారం రోజులు అమ్మకము. టి.వి వాళ్ళు సినిమా వాళ్ళు స్టాల్స్ ఓపెన్ చేస్తున్నారు. ఏ వయసు వారు ఆ స్టాల్ దగ్గర చూసుకుంటున్నారు. సిటిలో ముసలమ్మ కూడా నైటీలు పంజాబీ డ్రెస్లు అయితే కంఫర్ట్ అని అందరూ అక్కడే ఎగబడ్డారు. చీరల స్టాల్స్ తక్కువ జనంతో వెలవెలబోతూ ఉన్నాయి.
ఈ తరం పిల్లలు ఆడమగ పొట్టి పొట్టి నిక్కర్లు, బనీనులు అంతేగా. ఇంగ్లీష్ పదాలతో కూడిన బొమ్మలు. అది బాగుందా! మనకి బాగుంటుందా! అనే ఆలోచన లేదు.
ఈ తరం పిల్లలు ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు. చీరలో ఉన్న అందం వారికి కానరాదు, చీర అంటేనే పక్కన పెట్టేస్తున్నారు. హిందూ సాంప్రదాయాలను పక్కన పెట్టి ఇంగ్లీషు కల్చర్‌కి అలవాటు పడుతున్నారు. అది తప్పు అని చెప్పే తల్లితండ్రులు లేరు. విపరీతమైన గారాలు పిల్లలకు, వారు చెప్పినదే వేదంలా తయారు చేస్తున్నారు తల్లిదండ్రులు.
అన్ని డబుల్ ఎక్స్‌ఎల్ సైజులవి ఎక్కువ అమ్ముడు పోయాయి. కారణం జాగింగ్, వాకింగ్ అన్ని అవసరాలకి ఈ డ్రెస్లు ఉపయోగం. చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఈ డ్రెస్లు కొన్నారు.
కోమలి కూడా రెండు నైటీలు మూడు పంజాబీ డ్రెస్లు కొని తెచ్చింది. అత్తగారికి వెంకటగిరి చీర కొన్నది. కొడుకుకి నిక్కరు మాదిరి ఖరీదైన డ్రెస్ కొన్నది. నాలుగు వేలు బిల్ చేసింది. ప్రతి రెండు వేలకి గిఫ్ట్ ఆఫర్ ఉన్నది. రెండు గిఫ్ట్ ఓచెర్స్ ఇచ్చారు.
ఇంటికి తెచ్చి అత్తగారికి చూపిస్తే “ఈ డ్రెస్సులు కొని నువ్వు తొడక్కోవడం బాగుండదు, వాడికి కూడా ఆ పొట్టి నిక్కర్లు ఏమిటి? బొజ్జ తగ్గేదెలా? బొజ్జ పైకి కట్టుకోవాలి. అయినా ఆ కాగితాలకి ఏమిస్తారు?” అంది.
“కిచెన్‌వేర్ ఇస్తారు, కూర గిన్నెలు. మూకుడులు, పాన్ కుక్కర్ వంటివి ఏదైనా తగిలితే ఇంట్లో వాడకోవచ్చును.” అంది కోమలి.
“నువ్వు ఈ డ్రెస్లు తొడుక్కుని ఇంట్లో తిరగవద్దు, మా ఇంటా వంటా లేవు ఇలాంటి పనులు” అని ఒకటే అరుపులు అరిచింది కాంతమ్మ. ఆమెకి కోడలు ఏచి చేసినా నచ్చదు.
“ఆ సరే. వాకింగ్‌కి వెళ్ళే వారు తప్పక ఈ డ్రెస్ వేసుకోవాలి, లేదంటే జాగింగ్ సూట్ వేసుకోవాలి, అదెలా వద్దు అంటారు? కనుక ఇలా పంజాబీ డ్రెస్‍లు తెచ్చుకున్నాను.” చెప్పింది కోమలి.
(ఇంకా ఉంది)