సినిమా క్విజ్-69

0
11

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. జి. రామ్మోహనరావు దర్శకత్వంలో కృష్ణ, సుహాసిని, రాధిక నటించిన ‘శాంతినివాసం’ (1986) చిత్రం హిందీలో ‘కల్పతరు’ దర్శకత్వంలో రిషీకపూర్, గోవిందా, జయప్రదలతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  2. కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి, మాధవి, గొల్లపూడి మారుతీరావు నటించిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ (1982) చిత్రాన్ని సుభాష్ సోనిక్ దర్శకత్వంలో గోవిందా, నీలం గార్లతో హిందీలో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  3. విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి, సుహాసిని నటించిన ‘మగమహారాజు’ (1983) చిత్రం హిందీలో కె. బాపయ్య దర్శకత్వంలో జితేంద్ర, శ్రీదేవిలతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  4. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వెంకటేష్, సౌందర్య, లైలాలు నటించిన ‘పెళ్ళి చేసుకుందాం’ (1997) చిత్రాన్ని హిందీలో సతీష్ కౌశిక్ దర్శకత్వంలో అనిల్ కపూర్, ఐశ్వర్యా రాయ్, సోనాలి బింద్రేలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  5. టి. కృష్ణ దర్శకత్వంలో సుమన్, విజయశాంతి నటించిన ‘నేటి భారతం’ (1983) చిత్రం హిందీలో టి. రామారావు దర్శకత్వంలో జితేంద్ర, జయప్రదలతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  6. పి. లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో కృష్ణ, వాణిశ్రీ, గుమ్మడి నటించిన ‘పచ్చని సంసారం’ (1970) చిత్రాన్ని హిందీలో కె. బాపయ్య దర్శకత్వంలో జితేంద్ర, శ్రీదేవిలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  7. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వెంకటేష్, సౌందర్య నటించిన ‘పవిత్ర బంధం’ (1996) చిత్రం, హిందీలో సతీష్ కౌశిక్ దర్శకత్వంలో అనిల్ కపూర్, కాజల్, అనుపమ్ ఖేర్‍లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  8. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కమల్ హాసన్, జయసుధ, రోజా రమణి నటించిన ‘సొమ్మొకడిది సోకొకడిది’ (1979) చిత్రాన్ని హిందీలో బి.ఎస్. గ్లాడ్ దర్శకత్వంలో రాజేష్ ఖన్నా, హేమమాలిని, రీనా రాయ్ లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  9. బి. గోపాల్ దర్శకత్వంలో అర్జున్, శారద నటించిన ‘ప్రతిధ్వని’ (1985) చిత్రం హిందీలో బి. గోపాల్ దర్శకత్వంలో అనిల్ కపూర్, రేఖ, రిచా శర్మలతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  10. ఎన్.టి.ఆర్. దర్శకత్వంలో, ఎన్.టి.ఆర్., చంద్రకళ, నాగభూషణం, హరికృష్ణ నటించిన ‘తల్లా? పెళ్ళమా?’ చిత్రాన్ని హిందీలో జితేంద్ర, లోనా చందవర్కర్ లతో దర్శకనిర్మత ఎల్.వి. ప్రసాద్ ఏ పేరుతో రీమేక్ చేశారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 జనవరి 02 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 69 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 జనవరి 07 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 67 జవాబులు:

1.బేకరార్ (1983) 2. భాయ్ (1997) 3. కలకత్తా మెయిల్ (2003) 4. ఛత్రపతి (2023) 5. ఛోటీ బహు (1971) 6. దాఁవ్ పేచ్ (1989) 7. ధరమ్ అధికారి (1986) 8. దిల్ ఔర్ దీవార్ (1978) 9. ఆషిక్ (2001) 10. ఆఘాజ్ (2000)

సినిమా క్విజ్ 67 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • జి. స్వప్నకుమారి
  • వి. గాయత్రి
  • దీప్తి మహంతి
  • కొన్నె ప్రశాంత్
  • వర్ధని మాదిరాజు
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here