[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]
అధ్యాయం-8: కాళిదాసు – వాల్మీకి – మేఘసందేశానికి – రామాయాణంతో సంబంధం
కాళిదాసు మేఘసందేశానికి వాల్మీకి రామాయాణంతో ఉన్న సంబంధం:
[dropcap]వా[/dropcap]ల్మీకి హనుమంతుని మాటిమాటికి మేఘముతో పోల్చాడు. అతనే రామదూత అని పోలిక కల్గిన శ్లోకాలను ఉదాహరణగా చూద్దాము.
వాల్మీకి మహర్షి రామాయణం | కాళిదాసు కవి మేఘదూతం | |
1 | హనుమ తన స్వరూపాన్ని పిల్లి అంతదిగా కుదించుకుని రహస్యంగా లంకలో ప్రవేశించడం.
‘వృషదంశకమాత్రస్సన్ బభూవాద్భుత దర్శనః’ (సుందరకాండ, 2 సర్గ, 49 శ్లో) |
యక్షుడు పిల్ల ఏనుగంతదిగా స్వరూపాన్ని సంక్షేపించుకుని తన గృహంలో ప్రవేశించమనడం
‘గత్వా సద్యః కలభతనుతాం శీఘ్రసంపాత హేతో’ (మేఘసందేశం, 2-20) |
2 | సీతకు ప్రాణత్యాగము సందర్భంలో శుభ శకునములు కనిపిస్తాయి. | అలాగే మేఘ దౌత్య తరుణంలో యక్ష భామకు శుభ నిమిత్తములు కన్పించాయి. ఇరువురికి ఉభయత్ర శకునములు ఉపమానములు. |
3 | సీతకు ఎడమ కన్ను అదరడం – చేప వలన కదిలిన తామర పువ్వు వలె –
‘ప్రాస్పందతైకం నయనం సుకేశ్యా మీనాహతం పద్మామివాభితామ్రం’ (సుందరకాండ, 29 సర్గ, 2 శ్లో) |
చేప వలన కదిలిన కలువ పువ్వు వలె యక్ష ప్రియ కన్ను స్పందించింది. ఒక చోట తామర పువ్వు, మరొక చోట కలువ పువ్వు.
‘త్వయ్యాసన్నే నయనముపరిస్పంది శంకే మృగాక్ష్యాః మీనక్షోభాచ్ఛలకువలయ శ్రీతులా మేష్యతీతి’ (మేఘసందేశం, 2-34) |
4 | సీత హనుమంతుని ప్రేమతో చూచినట్లు | నా ప్రేయని నిన్ను ప్రేమతో చూచును అని మేఘునికి యక్షుడు చెప్పడం
‘త్వయ్యాసన్నే పవనతనయం మైథిలీ వోన్ముఖీ సా త్వా ముత్కణ్ఠోచ్ఛస్వితహృదయా వీక్ష్య సంభావ్య చైవ,’ (మేఘసందేశం, 2-39) |
5 | వియోగ కాలం ఒక సంవత్సరం
‘నిద్రా శనైః కేశవమభ్యుపైతి’ (కిష్కింధకాండ, 28 సర్గ, 25 శ్లో) జ్యోతిశాస్త్ర పరిభాష, పద్ధతి కవి వాడారు (కార్తీకమాసానంతరం 10 దినాలని లెక్కవేశారు) విష్ణువుకు నిద్ర వచ్చు కాలం వర్షర్తువు. శరదృతువులో మేల్కొంటాడు అని. |
ఇక్కడ కూడా ఒక సంవత్సరమే.
‘ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్టసానుం’ (మేఘసందేశం, 1-2)
|
6 | దూత చేత సీత రామునకు రెండు అభిజ్ఞానములు పంపడం.. కాకాసుర వృత్తాంతం
‘ఇదం శ్రేష్ఠమభిజ్ఞానం బ్రూయాస్త్వం తు మమ ప్రియమ్ శైలస్య చిత్రకూటస్య పాదే పూర్వోత్తరే పురా’ (సుందరకాండ, 38 సర్గ, 12 శ్లో) రెండవది చూడామణి: ‘తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభమ్ ప్రదేయో రాఘవాయేతి సీతా హనుమతే దదౌ’ (సుందరకాండ, 38 సర్గ, 66 శ్లో) |
వృత్తాంత రూప అభిజ్ఞానం కాళిదాసు కథకు అగత్యమైనది కనుక రహస్య వృత్తాంతమును కాళిదాసు కల్పించి వుండవచ్చు.
‘భూయశ్చాహ త్వమపి శయనే కణ్ఠలగ్నా పురా మే’ (మేఘసందేశం, 2-51) నాయిక స్వప్నమున, నాయకుని పరస్త్రీ గమనము చూచి ఏడ్చిన ఏకాంత వృత్తాంతాన్ని అభిజ్ఞానంగా మేఘదూత చే పంపించడం |
7 | నాయిక పంపినది | నాయకుని ద్వారా పంపించడం |
8 | రామదూత దక్షిణానికి వెళ్ళటం | మేఘదూత ఉత్తరం వైపుకి వెళ్ళటం |
9 | విమానంలో ఉన్న సీత రాముని వర్ణనలు తలచుకోవడం | యక్ష యక్షిణులు వర్ణనలు ఉభయత్ర సమానములు |
10 | సీతని ‘శ్యామ’ అనీ, ‘యౌవన మధ్యస్థ’ అనీ వర్ణించడం
‘భార్యా తస్యోత్తమా లోకే సీతా నామ సుమధ్యమా శ్యామా సమవిభక్తాంగీ స్త్రీరత్నం రత్నభూషితా’ (అరణ్యకాండ 31వ సర్గ 29వ శ్లోకం); ‘శ్యామాం కమలపత్రాక్షీముపవాసకృశాననామ్ తదేకవాసఃసంవీతాం రజోధ్వస్తశిరోరుహామ్’ (సుందరకాండ 58వ సర్గ 56వ శ్లోకం) |
యక్షుని ప్రియురాలు కూడా శ్యామయే.
‘తన్వీ శ్యామా శిఖరిదశవా’ (మేఘసందేశం, 2-51) |
11 | సీత ‘సహచరి హి తేవ చక్రవాకీ’
(సుందరకాండ 16వ సర్గ 30వ శ్లోకం) |
యక్షిణి ‘దూరీభూతే మయి సహచరే చక్రవాకీ వైకాం’
(మేఘసందేశం, 2-22) |
12 | పై శ్లోకం ఉత్తరార్థంలో సీత –
‘హిమహతనళినీవ నష్టశోభా వ్యసనపరంపరయాతిపీడ్యమానా’ (సుందరకాండ 16వ సర్గ 30వ శ్లోకం) |
‘గాఢోత్కణ్ఠాం గురుషు దివ్సేస్యేషు గచ్ఛతు బాలాం జాతాం మన్యే శిశిరమథితాం పద్మినీం వాన్యరాపామ్’
(మేఘసందేశం, 2-22) – అని పేర్కొన్నారు. |
13 | సుందరకాండలో సీతను – ‘ఉపవాసకృశాం దీనాం నిశ్శ్వసన్తీం పునః పునః.
దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలామ్’ అని వర్ణించారు. (15వ సర్గ 19వ శ్లోకం) |
యక్షిణిని కూడా ‘ఆధిక్షామాం విరహశయనే సన్నిషణ్ణైకపార్శ్వాం’
(మేఘసందేశం, 2-28) – అని పేర్కొన్నారు. |
14 | ఇక్కడ మొగ్గ | ఇక్కడ పువ్వుగా మారినది |
15 | సీత ‘ఏకవేణి’
(సుందరకాండ 57వ సర్గ 38వ శ్లోకం) |
యక్షిణి కూడా ‘స్పర్శక్లిష్టా మయమితనఖే నాసకృత్సారయంతీం’
(మేఘసందేశం, 2-31) |
16 | రాముడు విరహ దశావేశమున మధువు సేవించుట మానివేశాడనడం
‘న మాంసం రాఘవో భుఙక్తే న చాపి మధు సేవతే’ (సుందరకాండ 36వ సర్గ 41వ శ్లోకం) |
యక్షుడు ‘పత్యాదేశా దపి చ మధునో విస్మృతభ్రూవిలాసమ్’
(మేఘసందేశం, 2-34) |
17 | హనుమ కామరూపియే
(సుందరకాండ 1వ సర్గ 6వ శ్లోకం) (సుందరకాండ 35వ సర్గ 76వ శ్లోకం) |
ఇక్కడ కూడా కామరూపి |
18 | లంకాపురి వర్ణనలు | అలకాపురి వర్ణనలు |
19 | ‘నారీప్రవేకైరివ దీప్యమానం తటిద్భిరమ్భోదవదర్చ్యమానమ్.
హంసప్రవేకైరివ వాహ్యమానం శ్రియా యుతం ఖే సుకృతాం విమానమ్’ (సుందరకాండ 7వ సర్గ 7వ శ్లోకం) రామాయణానికే మాతృక |
ఇండ్లు మబ్బులతో పోల్చడం – లలిత వనితలు అని |
20 | ‘లతా గృహామః చిత్ర గృహాన్ నిశా గృహాన్’
(సుందరకాండ 12వ సర్గ 1వ శ్లోకం) ‘లతాగృహాణి చిత్రాణి చిత్రశాలాగృహాణి చ’ (సుందరకాండ 6వ సర్గ 36వ శ్లోకం) |
ఇంద్రచాపములు |
21 | ‘మృదంగతలఘోషైశ్చ ఘోషవద్భిర్వినాదితమ్’
సుందరకాండ 6వ సర్గ 44వ శ్లోకం) |
‘సంగీతాయ ప్రహతమురజాః స్నిగ్గ గంభీర ఘోషమ్’
(మేఘసందేశం, 2-1) |
22 | ‘జాంబూనదమయైర్ద్వారైర్వైడూర్యకృతవేదికైః’
(సుందరకాండ 3వ సర్గ 8వ శ్లోకం) ‘వైడూర్యకృతసోపానైః స్ఫాటికాంతరపాంసుభిః’ (సుందరకాండ 3వ సర్గ 10వ శ్లోకం) |
‘అన్తస్తోయం మణి మయభువస్తుంగ మభ్రం లిహాగ్రాః’
(మేఘసందేశం, 2-1) |
23 | ‘మేరుమందరసంకాశైరుల్లిఖద్భిరివాంబరమ్’
(సుందరకాండ 9వ సర్గ 14వ శ్లోకం) ‘కైలాసశిఖరప్రఖ్యామాలిఖంతీమివాంబరమ్’ (సుందరకాండ 2వ సర్గ 23వ శ్లోకం) |
‘తుంగ మభ్రం లిహాగ్రాః’
(మేఘసందేశం, 2-1) |
24 | కిష్కిందకాండలో పూర్వ మేఘంలోని వర్ణనలు చాలా వున్నాయి | ‘వప్ర క్రీడా పరిణతగజ పేక్షణీయం దదర్శ’
(మేఘసందేశం, 1-2) |
25 | ‘గర్జంతి మేఘాః సముదీర్ణనాదాః
మత్తా గజేన్ద్రా ఇవ సంయుగస్థాః’ (కిష్కిందకాండ 28వ సర్గ 20వ శ్లోకం) ‘విభాన్తి రూపాణి బలాహకానాం రణోద్యతానామివ వానరణానాం’ (కిష్కిందకాండ 28వ సర్గ 31వ శ్లోకం) ‘వహంతి వర్షంతి నదంతి భాంతి ధ్యాయంతి నృత్యంతి సమాశ్వసంతి నద్యో ఘనా మత్తగజా వనాన్తాః ప్రియావిహీనాశ్శిఖినః ప్లవంగమాః’ (కిష్కిందకాండ 28వ సర్గ 27వ శ్లోకం) |
‘మేఘాలోకే భవతి సుఖినోఽప్యన్యథావృత్తి చేతః’
(మేఘసందేశం, 1-3) |
26 | ‘కాంతా సకామా ప్రియమభ్యుపైతి’
(కిష్కిందకాండ 28వ సర్గ 25వ శ్లోకం) ‘ఇమాస్తా మన్మథవతాం హితాః ప్రతిహతా దిశః’ (కిష్కిందకాండ 28వ సర్గ 13వ శ్లోకం) ‘ప్రవాసినో యాంతి నరాస్స్వదేశాన్’ (కిష్కిందకాండ 28వ సర్గ 15వ శ్లోకం) |
‘త్వా మారూఢం పవనపదవీ ముద్గృహీతాలకాంతాః
ప్రేక్షిష్యంతే పథికవనితాః ప్రత్యయా దాశ్వసంత్యః’ (మేఘసందేశం, 1-8) |
27 | ‘మానసవాసలుబ్ధాః’
(కిష్కిందకాండ 28వ సర్గ 16వ శ్లోకం) |
‘మానసోత్కాః’
(మేఘసందేశం, 1-11) |
28 | ‘మేఘాభికామా పరిసంపతంతీ
సమ్మోదితా భాతి బలాకపంక్తిః వాతావధూతా వరపౌండరీకీ లంబేవ మాలా రచితాంబరస్య’ (కిష్కిందకాండ 28వ సర్గ 23వ శ్లోకం) |
‘గర్భాధాన క్షణపరిచయాత్’
(మేఘసందేశం, 1-9) |
29 | ‘ముక్తాసకాశం సలిలం పతద్వై
సునిర్మలం పత్రపుటేషు లగ్నమ్. హృష్టా వివర్ణచ్ఛదనా విహంగా- స్సురేంద్రదత్తం తృషితాః పిబంతి’ (కిష్కిందకాండ 28వ సర్గ 30వ శ్లోకం) |
‘అంబోబిందుగ్రహణ చతురాం శ్చాతకాన్ వీక్షమాణాః’
(మేఘసందేశం, 1-22) |
30 | ‘సముద్వహంతః సలిలాతిభారం
బలాకినో వారిధరా నదంతః మహత్సు శృంగేషు మహీధరాణాం విశ్రమ్య విశ్రమ్య పునః ప్రయాంతి’ (కిష్కిందకాండ 28వ సర్గ 22వ శ్లోకం) |
‘ఖిన్నః ఖిన్నః శిఖరిషు పదం న్యస్య గంతాసి యత్ర’
(మేఘసందేశం, 1-13) |
ఈ విధంగా కాళిదాసులో వాల్మీకి మూడుమూర్తులా వెలిశాడా అని అనుకోవాలి.
(ఇంకా ఉంది)