ఖాన్ సార్‌ల రాజ్యంలో పాగా వేసిన తెలుగు డైనోసా(లా)ర్

2
3

[dropcap]కా[/dropcap]వటానికి కృష్ణంరాజు వారసుడే అయినా, అదృష్టంతోనో, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవటం వల్లనో, లేదా జనాలందరికీ కొట్టొచ్చినట్లు కనుపడే ఆ మంచితనానికి దేవుడిచ్చిన ప్రతిఫలమో కానీ, ప్రభాస్‌కు ఈ రోజు ఉన్న అభిమానులంతా స్వయంగా సంపాదించుకున్న వారే. మహేశ్‌కు తండ్రి అభిమానులు కూడా కలిశారు. మిగిలిన వారసులకు అభిమానులు ఎలా transfer అయ్యారో అందరికీ తెలిసిందే.

ఏక్ నిరంజన్, అంతకు ముందు బుజ్జిగాడుతో క్రమంగా తనదైన ఒక శైలి ఏర్పరచుకున్నాడు. అంతకు మునుపు నటనలో, శైలీపరంగా కాస్త స్వంత మార్క్ లేదనే చెప్పాలి. ఛత్రపతిలో రాజమౌళి శైలికి తగినట్లు మారినట్లే. అంతే!

సాధారణంగా రాజమౌళి సినిమా తరువాత ఏ హీరో అయినా ఒక పతాక స్థాయికి చేరి జక్కన్న చెక్కిన శిల్పం అనే ఇమేజ్‌ను వదుల్చుకుని మళ్ళా హిట్ ట్రాక్‌లో పడాలంటే సామాన్యం కాదు. ఒక్క రవితేజ మటుకూ రాజమౌళి శైలిని దాటి తనను తానే ఆవిష్కరించుకున్నాడు విక్రమార్కుడితో.

రాజమౌళి చెప్పినట్లు, Baahubali: The Beginning వరకూ మాత్రమే ప్రభాస్ అనే వ్యక్తి ఒక తెలుగు హీరో. వన్ of the many Tollywood star heroes. ఆ సినిమాకు రాజమౌళే కర్త, కర్మ, క్రియ. Baahubali: The Conclusion కూడా రాజమౌళి సినిమానే. కానీ ప్రభాస్ రాజమౌళి హీరో కాదు. బాహుబలి. నేషనల్ స్టార్. ఒకే ఒక్క సినిమాతో అలవి కాని ఇమేజ్ వచ్చేసింది. ప్రభాస్ బాహుబలి సినిమాకు రాజమౌళి దర్శకుడిప్పుడు. ఆ తేడా మనకు RRR విషయంలో తెలుస్తుంది. ఇద్దరు పెద్ద హీరోలున్నా, రాజమౌళి సినిమా ముందు (బాహుబలి) ప్రభాస్ ఇమేజ్ కన్నా, RRR ముందు ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల ఇమేజ్ పెద్దది. రాజమౌళి అప్పటికే అంతర్జాతీయ దర్శకుడు. కానీ బాహుబలి 2 కన్నా ఆర్ఆర్ఆర్ కలెక్షన్లు 600 కోట్లు తక్కువ.

అహంకారం వల్లే, మరో కారణం వల్లో ఎవరైనా ఒప్పుకోక పోయినా, ఆ పైన వచ్చిన 600 కోట్ల రూపాయలు అమాంతం పెరిగిన ప్రభాస్ ఇమేజ్ వల్లే. Prabhas is the undisputed pan-India star by then. అది సాహోతో నిరూపితమైంది. వన్ స్టార్ రేటింగ్‌తో 400 కోట్ల పైన ఆ సినిమా సంపాదించింది. మహా మహా బాలీవుడ్ superstars కూడా 3 సినిమాలతో 400 కోట్లు సాధించింది అరుదు. కానీ ప్రభాస్ 3 వరుస సినిమాలతో అది సాధించాడు. హిందీలో సాహో పెద్ద సక్సెస్.

కారణాంతరాల వల్ల రాధేశ్యామ్ పోయినా అంత ఏమాత్రం అభిమానులే పట్టించుకోని సినిమాకు గొప్ప ఓపెనింగ్స్ రప్పించిన ఘనత మటుకూ ప్రభాస్‌దే.

ఆదిపురుష్ ఎంత నెగటివిటీని ఎదుర్కొందో, ఎంత trolling కు గురి అయినదో మనం చూశాం. అయినా ఆ సినిమా కూడా ఈ సంవత్సరం వచ్చిన సినిమాలలో తొలిరోజు అత్యధిక గ్రాస్ సంపాదించిన సినిమాగా నిలవటమే కాక ప్రభాస్‌కు మరో 400 కోట్ల సినిమాగా నిలిచింది. పెట్టుబడి వివాదం పక్కన పెడితే ఇటు ఆదిపురుష్ అయినా అటు సాహో అయినా బాక్సాఫీస్ వద్ద Average టు above Average సినిమాలుగా నిలిచాయి. రెండూ హిందీలో మాత్రం హిట్లు.

అది కూడా ఖాన్ హీరోలు కూడా నెగిటివ్ టాక్‌తో తమ సినిమాలను హిట్లు చేయలేని కాలంలో. సల్మాన్ తీసిన కిసీ కా భాయ్ కిసీకీ జాన్ కూడా 400 కోట్ల మార్క్ అందుకోలేదు. నెగిటివ్ రివ్యూల దెబ్బకు. ఆమిర్ నటించిన లాల్ సింగ్ ఎలా అడ్రస్ లేకుండా పోయిందో రీసెంట్ హిస్టరీ చూపించింది కూడా.

ఒకరకంగా చెప్పాలంటే, వరుస 16 హిట్ లతో 2016 నుంచీ బాలీవుడ్ భారం మోసిన అక్షయ్ కుమార్‌ను కూడా దాటి దేశంలో అన్ని ప్రాంతాలలో సమానమైన ప్రభావం చూపగల స్టార్ గా నిలిచింది ప్రభాస్ మాత్రమే. హిట్ ఫ్లాప్ తేడా లేదు. టాక్ ఎలా ఉన్నా కలక్షన్ల వర్షమే.

మరి అలాంటి బాక్సాఫీస్ బాహుబలి ప్రభాస్‌కు సరైన టాక్ తెచ్చుకునే సినిమా పడితే?

దానికి ఉదాహరణే సలార్. బాహుబలి తర్వాత వైవిధ్యమైన సినిమాలే చేశాడు ప్రభాస్. దర్శకత్వ లోపం వల్ల సినిమాలు దెబ్బతిన్నాయి. కానీ కేజీఎఫ్‌తో రాజమౌళి తరువాత 1000 కోట్ల సినిమా తీసిన దర్శకుడిగా నిలిచిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ స్టార్డమ్‌నే కాదు, అతని కటౌట్‌ను సరిగ్గా వాడుకుని తీసిన సినిమా సలార్.

అందరు హీరోలు పంచ్ డైలాగ్‌లో, swag, లేదా ఎలివేషన్ ద్వారానో ట్రైలర్, టీజర్లను హిట్ చేసుకుంటారు. అసలు మొహం కూడా కనబడకుండా, స్వరం కూడా వినబడకుండా కేవలం ప్రభాస్ పిడికిలి మాత్రమే ఆ టీజర్‌ను రికార్డు స్థాయిలో హిట్ చేసింది. సలార్‌ను డైనోసలార్‌గా మార్కెట్ చేసింది. సినిమా వాయిదా పడ్డా, antifans లాటరీ స్టార్ అన్నా, ఉగ్రమ్ రీమేక్ అని వెక్కిరించినా, అటు తమ హీరో మీదకు డైరక్ట్ దండయాత్ర చేస్తున్నాడని, మునిగి పోతాడని షా రుఖ్ ఖాన్ అభిమానులు (అందరూ కాదు) నెగటివిటీ పెంచాలని చూసినా, ఆ పిడికిలే సమాధానంగా నిలిచింది.

ట్రైలర్ అంత సంతృప్తికరంగా లేదనిపించుకున్నా, నీల్ మీద నమ్మకం రికార్డులు తిరగరాసేలా చేసింది. కానీ ఆ నీల్‌కు ఉన్న నమ్మకం ప్రభాస్. తన తొలి సినిమాను passion తో తనకు కావలసిన విధంగా తీయాలని ప్రయత్నించినా కుదరలేదు. అదే కథను మరొక విధంగా తీయాలని అనుకున్నాడు ప్రశాంత్ నీల్. ఆ సినిమా ఏమన్నా జమానా కాలందా అంటే కాదు. ఈమధ్య కాలంలోనే వచ్చింది. అయినా ప్రభాస్ నీల్‌ను నమ్మాడు. నీల్ నమ్మకం ప్రభాస్. Span పెరగటంతో ఖాన్సార్ అనే కొత్త ప్రపంచాన్నే సృష్టించి దానిలో ప్రభాస్ అనే డైనోసార్‌ను వదిలాడు. ఫలితం చూస్తున్నాముగా!

ప్రభాస్ స్టార్డమ్ ఎంత కలవరపెట్టకపోతే తన charm తో అందరి మనసులు గెలుచుకునే ప్రయత్నం చేసిన షా రుఖ్ జవాన్ ప్రమోషన్ సమయంలో దీపిక తన తరువాత సినిమా ప్రభాస్‌తో అని విలేకరులకు చెప్తే మొహం మాడ్చుకుంటాడు? We have several videos as proof. నిన్నటికి నిన్న ఉత్తరాదిలో సలార్‌కు multiplex లలో స్క్రీన్లు దొరక కూడదని ఆదేశాలు పంపాడని వార్తలు గుప్పుమన్నాయి. ఇటు సలార్ తీసిన హోంబలే ఫిల్మ్స్ వారు దక్షిణాదిలో కూడా పీవీఆర్ మాకు అవసరం లేదని చెప్పి మరీ వారి మెడలు వంచారు. దాని వెనుక ఉన్న బలం ప్రభాస్ స్టార్డమ్. నిజమైన pan-India Superstar.

ప్రభాస్ బలమంతా loyal fans మాత్రమే. సరైన పీఆర్ కానీ, social media managers కానీ లేరు. ఇమేజ్ బిల్డప్ చేసే పీఆర్ స్టంట్లు కూడా లేవు. రాజమౌళి వల్ల బాహుబలి 1 వచ్చింది. బాహుబలి 2 తో ఋణం తీర్చుకున్నాడు. వచ్చిన అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకున్నాడు. అభిమానుల మనసులు గెల్చుకున్నాడు. ఆ అభిమానమే కాసులు తెచ్చిపెడుతోంది.

షా రుఖ్ ‘ఖాన్ సర్’ సోషల్ మీడియా సాక్షిగా దొరికిపోయేంత అభద్రతకు గురయ్యేంత స్టార్డమ్. సల్మాన్ లాంటి వారు హుందాగా అంగీకరించేంత స్టార్డమ్. ఆమిర్ ఖాన్ లాంటి వారు మాట్లాడలేక కిమ్మనకుండా ఉండేంత స్టార్డమ్. అటు కన్నడ సీమ అయినా, తమిళనాట అయినా, కేరళ అయినా, ఉత్తర దేశమైనా, సెవెన్ సిస్టర్స్ అయినా, వంగభూమి అయినా.. ఎక్కడ చూసినా ప్రభాస్‌కు అభిమానులే. వారే అతని పీఆర్.

అందుకే కమల్ హాసన్, చిరంజీవి, రజనీకాంత్ లాంటి వారికి కూడా కొరుకుడు పడని బాలీవుడ్ ముఠాకు కొరకరాని కొయ్య కాదు, భయంతో కూడిన గౌరవంతో నాలుగు అడుగులు ఎక్కువ దూరంగా నిలబడేంత స్టార్డమ్. ఖాన్ సర్ కింగ్డమ్‌లో తెలుగు డైనోసార్ రాజ్యం. పాలన మొదలైంది. కల్కి, స్పిరిట్, సలార్ 2.. కొనసాగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here