[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘ప్రేమ పూజారి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]నీ[/dropcap] స్వప్నలోకంలో
విహరించడానికి
రెక్కల గుర్రాన్నయ్యా
నీ వలపు పూదోటలో
ఎగరడానికి
చిలిపి తుమ్మెదనయ్యా
నీ జడకుచ్చులో
ఒదగడానికి
మల్లెమొగ్గలనయ్యా
నీ తడి అధరాలలో
మెరవడానికి
వెన్నెల వెలుగునయ్యా
నీ తీగ నడుములో
పరవశించడానికీ
పసిడి వడ్డాణమయ్యా
నీ గుండె గుడిలో
ఆరాధించడానికి
ప్రేమ పూజారినయ్యా