[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘ఆ రోజే మళ్ళీ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఆ[/dropcap] వైపున నీవు
ఈ దిక్కున నేను
ఒకే రుచి గల మన మాటలు ఎన్నో
ఒంటరిగా బిక్కు బిక్కు మంటూ
నా నిద్రలో నిలబడి
నీ కలను నాటి
నిన్ను గడుపుకుపోతుంటే
అలుపొస్తుంది కళ్లకు
నీతో కలుపుపోతుంటే
ఆయాసమొస్తుంది ఆలోచనకు
ఇంకెంత దూరంలో ఉందో?
తప్పిపోయిన నా సంతోషం
ఇంకెప్పుడు వస్తుందో?
నిన్ను పరిచయం చేసిన రోజు మళ్ళీ