శ్రీమతి కావేరి చటోపాధ్యాయ ఆత్మకథ అనువాదం ‘ఆటుపోట్ల కావేరి’ త్వరలో – ప్రకటన

0
3

[dropcap]గ[/dropcap]తంలో సంచికలో ప్రచురితమైన ఆత్మకథలు/స్వీయచరిత్రల/జీవితగాథల అనువాదాలు పాఠకులను అలరించాయి.

శ్రీ చందకచర్ల రమేశ బాబు అనువదించిన కస్తూర్ బా గాంధీ జీవితగాథ ‘నేను.. కస్తూర్‌ని’; శ్రీ శ్రీధర్ రావు దేశ్‍పాండే అనువదించిన ‘మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్వీయచరిత్ర’; శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్ అనువదించిన డా. హెచ్. నరసింహయ్య ఆత్మకథ ‘పోరాట పథం’ తొలుత సంచికలో ధారావాహికలుగా ప్రచురితమైన, తరువాత పుస్తక రూపంలో వెలువడ్డాయి.

ప్రేరణాత్మాక వ్యక్తిత్వం కల వ్యక్తుల స్వీయచరిత్రలు/జీవితగాథలను పాఠకులకు అందించే క్రమంలో భాగంగా మరో విశిష్ట వ్యక్తి ఆత్మకథ అనువాదాన్ని అందిస్తున్నాము.

బారక్‌పూరు, కలకత్తా లోని సైనిక పాఠశాలలో అధ్యాపకురాలిగా పనిచేసి పదవీ విరమణ చేసిన శ్రీమతి కావేరీ చటోపాధ్యాయ ఆత్మకథ ‘Peeping Through my Window’ ని ‘ఆటుపోట్ల కావేరి’ అనే పేరుతో అనువదించారు ఉస్మానియా విశ్వవిద్యాలయపు తెలుగుశాఖ విశ్రాంతాచార్యులు, డా. వెలుదండ నిత్యానంద రావు.

~

‘ఆటుపోట్ల కావేరి’ శ్రీమతి కావేరి చటోపాధ్యాయ జీవితంలోని నిరాడంబరమైన గాథను వివరిస్తుంది, ఇది పాఠకులకు ఆసక్తికరంగా ఉంటుందని భావిస్తున్నాము. నిరంకుశులైన తండ్రి, విధేయత గల తల్లి పర్యవేక్షణలో గడిచిన వారి సాధారణ బాల్యం, తోబుట్టువులతో వారు పంచుకున్న హృదయపూర్వక బంధం, భర్తతో గడిపిన ఆర్మీ జీవితంలోని బహుప్రాంత అనుభవాలు, గోబిందోపూర్ గ్రామంలోని పూర్వీకుల ఇంటిని సందర్శించడం; అనేకమంది సాధారణ పల్లెటూరి ప్రజలతో అనుభవాలు, రామకృష్ణ మిషన్‌లో, ఆ తర్వాత ఆర్మీ స్కూల్ బారక్‌పూర్‌లో ఉపాధ్యాయురాలిగా అనుభవాలు పాఠకులను ఆకట్టుకుంటాయి. వీటిలో, క్యాన్సర్‌తో కావేరి గారి యుద్ధం చాలా ముఖ్యమైనది. సుదీర్ఘ పోరాటం తర్వాత, సర్వశక్తిమంతుడి దయతో విజేతగా నిలిచిన వైనం స్ఫూర్తిదాయకం.

~

07 జనవరి 2024 సంచిక నుంచి ప్రారంభమయ్యే ‘ఆటుపోట్ల కావేరి’ చదవండి. చదివించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here