రాజమహేంద్రవరంలో ‘సాహితీ వేదిక’ – నివేదిక

0
3

[dropcap]సా[/dropcap]హిత్య యాత్ర పేరిట సభ్యుల ప్రసంగ రచనలు, బృంద కవితల సంకలనం సహా పలు పుస్తకాల ఆవిష్కరణలు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కృతుల విజేతల ఉపన్యాస మధురిమలు, సాహితీవేత్తలు రచించిన – వారికి నచ్చిన పలు ప్రక్రియల పఠనాలు, పునశ్చరణలు, భవిష్యత్‌ కార్యాచరణల సమాలోచనలతో ‘సాహితీ వేదిక’ రెండు రోజుల మహోత్సవ సదస్సు పర్వదినోత్సాహంగా భాసించింది.

అప్పుడు రాజమహేంద్రిలో ఉండిన, ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో అక్కడికి చేరుకున్న కలం ప్రియులంతా గౌతమీ గ్రంథాలయ ఆవరణకు చేరి పునఃస్సమాగమ మహానుభూతిని ఎంతగానో సొంతం చేసుకున్నారు. ఒకటీ రెండూ మూడూ కాదు.. నలభై మూడేళ్ల కిందటి ఆవిర్భావ సందర్భాన్ని పరిపూర్ణంగా మననం చేసుకుంటూ, డిసెంబరు 25 విలక్షణతను మది మదినా నింపుకొంటూ, ‘అరవైలు దాటిన ఇరవైఏళ్లవారంతా’ ఆనందానుభవాలను పరస్పరం పంచుకున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను మరెంతో విస్తరించుకున్నారు.

సాహితీ వేదిక ప్రాదుర్భావ వేడుక వేళలోనే మునుపే ‘కథా వేదిక, కథా గౌతమి, కవితా వేదిక, ఆర్కెష్ట్రా’ల పునర్‌ ముద్రణలు, ఆవిష్కరణలూ అయ్యాయి. గతంలోనే ‘పునర్నవం’ అంటూ ప్రత్యేక సంచికా వెలువడిరది. సరికొత్తగా ‘మళ్లీ నది ఒడ్డున’ శీర్షికన సభ్యులందరి కవితలతో వెలయించిన సంకలనాన్ని ‘తెలుగు వెలుగు’ అరిపిరాల నారాయణరావు ఆవిష్కరించారు.

‘కవితా ప్రేమ పిపాసి’ చక్రాల వెంకట సుబ్బు మహేశ్వర్‌ రచించిన ‘అంత్యోదయం’ పుస్తకానికి ఆవిష్కర్త ‘నిరంతర సంపాదకీయాల’ ఎర్రాప్రగడ రామకృష్ణ. ‘ఫోటోలనూ కవిత్వీకరించిన’ సత్యభాస్కర్‌ కావ్యం ‘రంగురంగుల సూర్యుడు’ని ‘జీవితమే సాహిత్యం’ అయిన కుప్పిలి పద్మ ఆవిష్కరించి వెలువరించారు.

‘పాత్రికేయతకు పర్యాయ పదం’ కల్లూరి భాస్కరం విరచిత ‘ఇవీ మన మూలాలు’ను ఆవిష్కరించినవారు 2023 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును సాధించిన పతంజలిశాస్త్రి. ‘సాహితీ ఆత్మీయ సంపన్న అన్నగారు’ మల్లాప్రగడ రామారావు కథల సంపుటి ‘గోరంత దీపం’కి మలయాళ అనువాద ఆవిష్కర్తలు ఒకరు కాదు ` ఇద్దరు. పతంజలి శాస్త్రితో పాటు ‘సహజానువాద నిధి’ ఎల్‌.ఆర్‌. స్వామి. ఆవిష్కరణోత్సవ శోభతో వేదిక సమస్తం ధగధగలాడిరది.

సాధన, శోధన నిత్యకృత్యాలు కావాలని, వాటితోనే సృజన ఆసాంతమూ వెల్లివిరుస్తుందని మరింత ప్రస్ఫుటం చేశారు పతంజలి శాస్త్రి. చరిత్ర, సంస్కృతి, పురావస్తు తత్వం, పరిణత భావం అసలు అర్థాలను ఉదాహరణలతో విపులీకరించారు. అనువాదం అనేది సహజం, సమగ్రం, సౌందర్యవంతం, మరెంతో నాణ్యతాయుతంగా విలసిల్లాలని ఎల్‌.ఆర్‌. స్వామి అభిలషించారు. ఆధునిక సాహిత్యకారులు ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటే అంత ఉత్తమమని, వాటన్నింటి వల్లనే అనువాద ప్రక్రియ ఇంకా ప్రకాశిస్తుందని తెలియపరిచారు.

విధివిధానాల పెన్నిధి కొప్పర్తి వెంకట రమణమూర్తి, ప్రజ్ఞ్ఞా జిజ్ఞాసల కలనేత వాడ్రేవు చినవీరభద్రుడు, ఉమ్మడి తమ్ముడిగా పేరు గడిరచిన యెల్లేపెద్ది హనుమంతరావు అందిస్తూ వస్తున్న సహాయ సహకార సమన్వయ ప్రాభవానికి సభ్యులంతా జేజేలు పలికారు. సాదనాల వెంకటస్వామి నాయుడు, ‘సమాచారమ్‌’ రవిప్రకాశ్‌ జంట, ఎర్రాప్రగడ దంపతులు, మల్లాప్రగడ కవిదంపతులు, చల్లా శకుంతలా మహేశ్వర్‌, చల్లా శేషవేణి, లంకా సూర్యనారాయణ, ఎమ్మెస్‌, ఒమ్మి రమేష్‌బాబు, రాజారాం, నామాడి శ్రీధర్‌, పీవీ కృష్ణారావు, శర్మ, బాపిరాజు, సురేష్‌, రాఘవరావు, ఇంకా ఎందరెందరో సారస్వతవేత్తల భావమాలికతో ఎంతగానో కళకళలాడిరది సాహితీ వేదిక. అనేకమంది ఆత్మీయ మిత్రులూ, మధుర మనోహర జ్ఞాపకాల తలపోతలూ. కనువిందు, వీనులకు పసందు. ప్రత్యేకించి ‘మళ్లీ నది ఒడ్డున’ సమీక్షకులు ఆర్‌.ఎస్‌. వెంకటేశ్వరరావు సునిశిత పరిశీలనతో సభాస్థలి అంతటినీ మురిపింపచేశారు.

భావి ప్రణాళికలో భాగంగా గౌతమీ గ్రంథాలయ పురోభివృద్ధి, సాహితీ సభామందిర ఏర్పాట్ల గురించి సభ్యులంతా చర్చించుకున్నారు. పరిమళ భరిత వాతావరణంలో మహదానందాన్ని అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here