[‘మా మంచి మాస్టారు’ వ్యాసరచన పోటీ కోసం శ్రీ చాడా శ్రీనివాస్ రచించిన – ‘నా ఇష్టమైన గురుదేవులు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
“సంచిక” వెబ్ మ్యాగజైన్ లో ప్రచురితం అయిన డా.రాయపెద్ది వివేకానంద్ వ్రాసిన “స్వాతిచినుకు” కథ చదివి ప్రేరణ పొంది ఈవ్యాసం రాస్తున్నాను. మీరు కూడా ఆ కథ తప్పక చదవండి.
https://sanchika.com/swathi-chinuku-dr-vrp-story/
జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే, అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టి, జ్ఞాన దీపాన్ని వెలిగించిన గురుదేవులు, నా ప్రియతమ ఆరాధ్య దైవం శ్రీ పట్టా త్రినాధ రావు గారు.
ఈయన ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు భౌతిక శాస్త్రాన్ని బోధించటమే గాక, విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను గుర్తించిన గొప్పవారు.
నా భవిష్యత్తుకి బంగారు బాటలు వేసిన మహనీయులు. నేను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తాను పనిచేసే పాఠశాలలో నాకు విద్యా వాలంటీర్ అవకాశాన్ని కలగజేసి, నాలో ప్రతిభను గుర్తించి, PG చేయించడమే కాక, పండిత శిక్షణ కూడా పూర్తి చేయించి ఈరోజు నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నిలబడినట్లు చేసిన మహా మనిషి శ్రీ పి. త్రినాధ రావు గారు.
ఎన్ని జన్మలెత్తినా వారి రుణం తీర్చుకోలేనిది.