నేపాల్ జాతీయ పుష్పం ‘రోడోడెండ్రాన్’

0
4

[డా. కందేపి రాణీప్రసాద్ గారి – నేపాల్ జాతీయ పుష్పం ‘రోడోడెండ్రాన్’ – అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]నే[/dropcap]పాల్ దేశ జాతీయ పుష్పమైన రోడోడెండ్రాన్ పూల గురించి తెలుసుకుందాం. ఈ చెట్టు సతత హరిత చెట్టు. ఈ చెట్లు భూటూన్, పాకిస్తాన్, చైనా, మయన్మార్, నేపాల్, ఇండియా, శ్రీలంక, థాయిలండ్ దేశాలలో ఎక్కువగా పెరుగుతాయి. ఎర్రటి ఎరుపు వర్ణంలో ఆకర్షణీయంగా ఉంటాయి పుష్పాలు. ఈ చెట్టు ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క రాష్ట్ర వృక్షం కూడా. ఇది పొదలుగా, చిన్న వృక్షాలుగా పెరుగుతాయి. అంతేకాక ఈ పువ్వులు నాగాలాండ్ యొక్క రాష్ట్ర పుష్పంగా ఎన్నిక కాబడ్డాయి. ఈ చెట్టు ‘ఎరికేసి’ కుటుంబానికి చెందిన చెట్టు. దీని యొక్క శాస్త్రీయనామం ‘రోడోడెండ్రాన్ ఆర్బోరియం’ అంటారు.

రోడోడెండ్రాన్ జాతుల్లో అనేక రూపాంతరాలు కనుగొనబడ్డాయి. భారతదేశంలోని తమిళనాడులో రోడోడెండ్రాన్ యెక్క మరోక దగ్గరి రూపాంతరం కనిపించింది. రోడోడెండ్రాన్ చెట్టు మరొక జాతిలో చిన్న రక్త వర్ణపు మచ్చలు కలిగిన తెల్లని పువ్వులతో ఉంటుంది. మరొక జాతి సిన్నమేమియం గోధుమ వెంట్రుకలు కరిగిన ఆకులను కలిగి ఉంటుంది. శ్రీలంక లోని ఎత్తైన ప్రాంతాలలో ‘జైలానికమ్’ ఆనే జాతి పువ్వులు ఉంటాయి. ఈ జాతిని అరేబియా వ్యాపారులు జైలాన్ అనే పేరు పెట్టారు.

రోడోడెండ్రాన్‌ను సింహళ భాషలో మహారత్మల్ లేదా అసేలా మాల్ లేని పిలుస్తారు. ఇది సమశీతోష్ణ మండలాల్లో ఎక్కువగా ఊటాయి. హిమాలయాల లోని తేమతో కూడిన నేలల్లో ఎక్కువగా పెరుగుతూ ఆకర్షణీయమైన ఆకుల్ని అందమైన పువ్వుల్ని కలిగి ఉంటాయి. వీటిలోని అనేక జాతులను అలంకార మొక్కలుగా ఉద్యానవనాలలో సాగుచేస్తారు. ఎరికెసి కుటుంబానికి చెందిన పుష్పించే మొక్కలు ఈ కుటుంబంలో వెయ్యికి పైగా రకాల జాతులున్నాయి.

రోడోడెండ్రాన్ పువ్వులు సువాసన కలిగి ఉంటాయి. ఇది గరాటు ఆకారంలో ఉంటాయి. సాధారణంగా ఎరుపురంగులో పువ్వలు ఉన్నప్పటికీ వివిధ జాతుల్లో తెలుపు, ఊదా, గులాబీ, పసుపు, నీలం, స్కార్లెట్ వంటి అనేక రంగుల్లో సైతం పూస్తాయి ‘రోడోడెండ్రాన్’ అంటే ‘ఎరుపు చెట్టు’ అని అర్ధం. కాబట్టి ప్రధానంగా ఎరుపు రంగులో పూస్తాయి.

18వ శతాబ్దం చివరలో ఈ రోడోడెండ్రాన్ జాతులు స్పెయిన్, పోర్చుగల్, టర్కీల నుండి పరిచయం కాబడ్డాయి. ‘రోడోడెండ్రాన్ పోటికన్’ దీవులలో పెరుగుతుంది. ‘రోడోడెండ్రాన్ కాటాబియన్స్’ అనే జాతి ఆగ్నేయ యునైటెడ్ స్టేట్స్ లోని గ్రేట్ స్మోకి మౌంటెన్స్ నేషనల్ పార్కులో ఉన్నాయి. ఇది జాన్ నెలలో పుష్కలంగా పూస్తాయి. హిమాలయ ప్రాంతాల నుండి పెద్ద ఆకులతో కూడిన జాతులు ప్రసిద్ధమైన అలంకార వెలక్కలుగా పేరు పొందాయి.

ఈ చెట్టు సాధారణంగా 20 మీ ఎత్తు వరకు పెరుగుతుంది. 1993వ సంవత్సరంలో నాగాలాండ్ లోని ఓ చెట్టు గిన్నిస్ రికార్డును పొందింది. కోహిమా జిల్లా లోని మౌంట్ జాప్పు వద్ద కనుగొనబడిన చెట్టు 20మి. ఎత్తులో అతి పెద్ద రోడోరెండ్రాన్‌గా పేరు గాంచింది. అలాగే అతి చిన్న రోడోరెండ్రాన్‌గా నాలుగు ఆంగులాలతో చిన్న చెట్టు కూడా ఉన్నది. దీని పేరు ‘రోడోడెండ్రాన్ కేస్పికెస్పిటోసమ్’.

ఇది కేవలం అందమైన పువ్వు మాత్రమే కాదు. స్థానిక ప్రజల ఆచారాల్లోనూ, పురాణాల్లోనూ అంతర్జంగా ఉన్నది. అందుకే ఉత్తరాఖండ్ రాష్ట్ర వృక్షంగా ఎంచుకున్నది. హిమాలయల నది మధ్యన ఉన్న సహజ సంపదలు కలిగిన భూమియే ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్‌కు వచ్చే అనేక యాత్రికుల మనస్సు గెలుచుకున్నది చెట్టు. అక్కడి సాంస్కృతిక విలువలకు ప్రాతినిథ్యం వహిస్తుంది.

‘బోటానికల్ సర్వే ఆఫ్ ఇండియా’ వారి ప్రచురణ ప్రకారం భారతదేశంలో 80 జాతులు, 25 ఉపజాతులు, 27 రకాలు ఉన్నాయని తెలిసింది వీటిలో ఎక్కువగా సిక్కిం, డార్జిలింగ్‌ల హిమాలయాల్లోనే ఉన్నాయి. ఈ చెట్లకు కూడా పర్యావరణ కాలుష్య ముప్పు పొంచి ఉన్నది. ఉత్తర సిక్కింలో కనిపించే ఉదారంగు రోడోడెండ్రాన్ పెద్ద పూలకు ముప్పు ఉందని తెలుస్తున్నది.

ఈ రోడోడెండ్రాన్ లను మొదటి సారిగా కెప్టెన్ హర్షివిక్ 1776లో కనుక్కున్నారు. జమ్ము కాశ్మీర్ ప్రాంతాలలో ‘రోడోడెండ్రాన్ ఆర్జోరియం’ ను గుర్తించారు . 1848 -1850 ప్రాంతాలలో బ్రిటీష్ శాస్త్రవేత్త జోసఫ్-డి-హాకర్ సిక్కిం మరియు డార్జిలింగ్ ప్రాంతాలలోని రోడోడెండ్రాన్ లను గుర్తించాడు. ఈ వృక్ష శాస్త్రవేత్త జోసఫ్-డి-హాకర్ తన డార్జిలింగ్ యుత్రలో 22 రకాల రోడోడెండ్రాన్ లను గుర్తించాడు. ఈ పూల జాతులను గుర్తించడానికి పెయింటింగులు ఉపయోగపడ్డాయి. దేశ వృక్ష శాస్త్ర చరిత్రలో ప్రముఖమైన స్థానం లభించింది. జోసఫ్-డి-హాకర్ ఈ రోడోడెండ్రాన్‌ల గురించి ‘ద రోడోడెండ్రాన్ ఆఫ్ సిక్కిం హిమాలయాస్’ అనే పుస్తకంలో వివరించారు. దీని వలన ఐరోపాలో హార్టికల్చర్‌లో విబృంభణ మొదలయింది. ‘రోడోడెండ్రాన్ డల్హౌసియా’ను మొదటి జాతిగా 1848 లో జోసఫ్-డి-హాకర్ తన పుస్తకంలో పేర్కొన్నారు. శావలకాల్ రాయ్, మిస్టర్ మావో, నార్చు షెర్పా, సుబ్రతాగుప్తా వంటి శాస్త్రవేత్తలు ఎందరో ఈ రోడోడెండ్రాన్ గురించి పరిశోధనలు చేసి ప్రచురణ సాగించారు. సాధారణంగా ఈ రోడోడెండ్రాన్‌లు పుష్పించే కాలం మార్చి నెల నుంచి మే నెల వరకు ఉంటుంది. కానీ ఈ మధ్య కొన్ని జాతులు జనవరి నుంచే పూయటం మొదలు పెడుతున్నాయి. నేలలు వేడెక్కడమే దీనికి కారణమని తెలుస్తున్నది. కాలుష్య సెగలు ఈ పూలనూ అంటుకుంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here