[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘చెలికాడు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఓ[/dropcap] చెలీ..!
మమతల కోవెలలో
నిను దేవతలా కొలిచా
ప్రేమ ఆలయంలో
నిను ప్రమిదగా మలిచా
ఊహల ఊయలలో
నీ ప్రతిరూపం తలచా
ఆశల పల్లకిలో
నీ జ్ఞాపకాలను మోసా
కలల లోకంలో
నీ జతనై విహరించా
వాస్తవ ప్రపంచంలో నీ
చెలికాడుగా నిలిచా